COVID JN 1 Causes : కొవిడ్ జెఎన్ 1 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి
covid JN 1 Precautions : జనవరి వచ్చేసింది. ఈ సమయంలో పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు అందరినీ దగ్గర చేస్తాయి. ఇదే సమయంలో కొవిడ్ కూడా విజృంభిస్తుంది. దానిని నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో తెలుసుకుందాం.
COVID Variant JN 1 Guidelines : పండుగల సమయంలో, చలికాలంలో కొవిడ్ విజృంభించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పండుగలు, ఫంక్షన్ల సమయంలో చాలా మంది ఒకే చోట చేరుతుంటారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. దానివల్ల త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశముంది. ప్రస్తుతం కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. కేరళలో మొదటి కేసు నమోదు కాగా.. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం ప్రారంభించాయి.
కొవిడ్ జెన్ఎన్ 1 ఇన్ఫెక్షన్ రేటుకు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు. అయితే జాగ్రత్తలు తీసుకోవడంలో.. సామాజిక దూరం పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని నిబంధనలు కచ్చితంగా ఫాలో అవ్వాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దానిని ఎలా ఎదుర్కోవాలి? వైరస్ బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టీకా..
కరోనా సమయంలో రెండు టీకాలు తీసుకుంటే.. ఇప్పుడు అదనపు వ్యాక్సిన్లు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు వైరస్ వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిపారు.
మాస్క్‌లు..
వైరస్ సోకకుండా మాస్క్‌లు ప్రభావవంతగా రక్షిస్తాయి అంటున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో.. ఇండోర్ పరిసరాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి అంటున్నారు. ఇది వైరస్ వ్యాప్తి నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించమని సలహా ఇస్తున్నారు.
చేతుల శుభ్రత
క్రమం తప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లివచ్చిన వెంటనే చేతులను సబ్బుతో లేదా హ్యాండ్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలి. ఇది వైరస్‌లను తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. బయటకు వెళ్లేప్పుడు దానిని కచ్చితంగా క్యారీ చేయాలంటున్నారు.
సామాజిక దూరం..
వైరస్ విజృంభిస్తున్న సమయంలో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు వైద్యాధికారులు. దీనివల్ల కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు అంటున్నారు. తప్పక వెళ్లాల్సి వస్తే సామాజిక దూరం పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వైరస్ లక్షణాలు కనిపిస్తే..
కొవిడ్‌కి సంబంధించిన లక్షణాలు మీలో ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. తలనొప్పి, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. రిజల్ట్ వచ్చేవరకు, వచ్చిన తర్వాత కూడా ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీ కుటుంబసభ్యులు, మిత్రులు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. వైద్యులు సూచించిన మెడిసిన్స్ కచ్చితంగా ఉపయోగించాలని చెప్తున్నారు.
గతంలో కొవిడ్ కోసం తీసుకున్న జాగ్రత్తలు ఇప్పటికీ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటివరకు కొవిడ్ వ్యాక్సిన్ కానీ.. బూస్టర్ డోస్ తీసుకోని వారు వాటికి ప్రాధాన్యతను గుర్తించి వేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఎక్కువ ప్రభావం ఉండదని ఎవరూ దానిని నిర్లక్ష్యంగా చూడకూడదని.. సిఫార్సు చేసిన జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. మరింత హెల్తీగా ఉండేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలంటున్నారు.
Also Read : జనవరి 1 అని జిమ్ ఫీజ్ కడుతున్నారా? హెల్తీగా ఉండేందుకు జిమ్‌కే వెళ్లాలా ఏంటి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.