అన్వేషించండి

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

కొన్ని ఆహారాలు త్వరగా మార్పులకు లోనవుతాయి. వాటిని ఎక్కువ కాలం తర్వాత తినకూడదు.

ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం, కూరలు మిగిలిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు ఉదయమో,  రాత్రో తింటూ ఉంటారు చాలా మంది.  ఫ్రిజ్లో దాచుకొని రెండు మూడు రోజుల తర్వాత తినే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని రకాల ఆహారాలు ఇలా దాచుకొని తినడం వల్ల ఎలాంటి ముప్పు ఉండదు, కానీ కొన్ని రకాలు మాత్రం తినడం వల్ల అవి శరీరానికి హాని చేసే అవకాశం ఉంది. అధ్యయనాల ప్రకారం కొన్ని ఆహారాలు లేదా పదార్థాలు తిరిగి వేడి చేసుకుని తిన్నప్పుడు అవి హానికర సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఆ సమ్మేళనాలు ఆరోగ్యానికి చాలా ముప్పుగా మారుతాయి. ముఖ్యంగా మేము ఇక్కడ ఇచ్చిన ఐదు ఆహారాలు మిగిలిపోతే పడేయండి, కానీ తినకండి.

గుడ్లు
గుడ్లు కూర మిగిలిపోతే మరుసటి రోజు తిందామని దాచుకోవద్దు. ఉడికించిన గుడ్లు ఏరోజుకారోజు తినడమే మంచిది. వీటిలో ఎల్లప్పుడూ సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది.  మిగిలిపోయిన గుడ్లు ఫ్రిడ్జ్ లో దాచినప్పుడు ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా బతికే ఉంటుంది. మరుసటి రోజు ఆ గుడ్లను  కాస్త వేడి చేసుకొని తిన్నా కూడా ఆ బాక్టీరియా చావదు. ఆ బాక్టీరియా శరీరంలో చేరడం వల్ల అంతర్గతంగా హాని కలుగుతుంది. 

బీట్రూట్ 
బీట్రూట్ కూర, పచ్చడి ఏ రోజుకి ఆరోజే తినాలి. వీటిలో నైట్రిక్ ఆక్సైడ్ సమృద్ధిగా ఉంటుంది. ఈ బీట్రూట్ కూర లేదా పచ్చడిని మరుసటి రోజు తినే ముందు వేడి చేయడం వల్ల అందులో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ,నైట్రేట్లుగా, ఆ తరువాత నైట్రోసమైన్లుగా మారుతుంది . నైట్రోసమైన్లు క్యాన్సర్ కారకాలని ఎప్పుడో గుర్తించారు శాస్త్రవేత్తలు. కాబట్టి బీట్రూట్ కూర మిగిలితే పడేయండి, కానీ మరుసటి రోజు వేడి చేసుకుని తినకండి. 

పాలకూర 
పాలకూరలో కూడా బీట్రూట్లో ఉన్నట్టే నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి.  పాలకూరను మళ్ళీ వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక నైట్రోసమైన్లు విడుదలవుతాయి. ఇది శరీరంలో చేరితే చాలా హానికరంగా మారుతుంది.

పచ్చి చికెన్
చికెన్ తెచ్చినప్పుడు కొంత ఫ్రిడ్జ్ లో దాచి, కొంత వండుతారు. ఆ పచ్చి చికెన్ పై సాల్మొనెల్ల అనే బాక్టీరియా నిత్యం ఉంటుంది. దాన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు బాగా ఉడికించకపోతే ఆ సాల్మొనెల్లా శరీరంలో చేరి ముప్పుగా మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు చికెన్ తెచ్చి వండుకోవడం మంచిది. 

కోల్డ్ ప్రెస్డ్ నూనెలు
అవిసె గింజల నూనె, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్స్ వంటివి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. వీటిలో ఒమేగా 3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల అవి ఆరోగ్యానికి సురక్షితం కావు. 

Also read: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget