By: Haritha | Updated at : 07 Feb 2023 05:50 AM (IST)
(Image credit: Pixabay)
గర్భవతి అయినప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటపడకుండా 20 వారాలు వచ్చేవరకు గర్భం ధరించిన సంగతి తెలియకపోవడమే క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలు తాము 20వారాల ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అవుతారు. ఇలాంటి షాకింగ్ అనుభవాలు ప్రపంచంలో ఎంతోమంది మహిళలు అనుభవించారు. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీని స్ట్రెల్త్ ప్రెగ్నెన్సీ అని కూడా పిలుస్తారు. దీనిలో సాధారణంగా గర్భం ధరించిన తర్వాత కనిపించే లక్షణాలు ఏవి కనిపించవు. అదే దీని ప్రధాన సమస్య.
ఈ గర్భం ఎందుకు వస్తుంది?
గర్భం ధరించిన వెంటనే సాధారణంగా శరీరం ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. వికారంగా అనిపిస్తుంది. మార్నింగ్ సిక్నెస్ మొదలవుతుంది. వాంతులు, పీరియడ్స్ రాకపోవడం వంటివన్నీ జరుగుతాయి. కానీ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలో మహిళల్లో ఎలాంటి మార్పులు కనిపించవు. అంతా సాధారణంగా ఉంటుంది. పీరియడ్స్ కూడా వచ్చి పోతుంటాయి. కానీ మూడు రోజులు, ఐదు రోజులు కాకుండా కేవలం రక్తస్రావం కొద్దిగా కనిపించి పోతుంటుంది. దీనివల్ల తాము గర్భవతులమని ఆ మహిళలు తెలుసుకొనే అవకాశం తగ్గిపోతుంది. 20 వారాలకు గర్భంలోని బిడ్డ ఎదుగుదల వేగంగా జరుగుతుంది. కాబట్టి పొట్ట పెరగడం ద్వారా గర్భం ధరించామేమో అని అనుమానం మొదలవుతుంది. అలా క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ బయటపడుతుంది.
పరీక్ష చేయించుకున్నా
ప్రెగ్నెన్సీ బారిన పడ్డాక ఏదైనా అనుమానం వచ్చి మొదటి నాలుగు వారాల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంటిదగ్గర చేసుకున్నా కూడా, కొందరిలో నెగిటివ్ అనే చూపిస్తుంది. దీనికి కారణం ఆ మహిళల్లో ‘హ్యూమన్ కొరియోనిక్ గోనడో ట్రోపియన్’ అనే హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం. యాంటీబయోటిక్స్ లేదా ఫెర్టిలిటీ మందులు తీసుకున్నా కూడా ఈ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లోనే టెస్ట్ చేయించుకోవడానికి బదులు వైద్యుడిని కలిసి స్కాన్ చేయించుకోవడం వల్ల ఈ గర్భం బయటపడుతుంది.
గర్భం ధరిస్తే కనిపించే సాధారణ సంకేతాలు ఇవే
మాయో క్లినిక్ ప్రకారం సాధారణంగా గర్భం ధరించాక కనిపించే లక్షణాల్లో మొదటిది పీరియడ్స్ మిస్ అవ్వడం. అలాగే వాంతులు, వికారం, మూత్ర విసర్జన పెరగడం, తీవ్రంగా అలసట చెందడం, మానక మానసిక స్థితిలో మార్పులు రావడం, కడుపు ఉబ్బరం, ఒళ్ళు తిమ్మిరిగా అనిపించడం, ఆహారం తినాలనిపించకపోవడం ఇవన్నీ కూడా గర్భం ధరించిన మొదటి నెలలో కనిపించే లక్షణాలు. ఇలాంటివి మీకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని కలిసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి ఇలాంటి క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలో బయటపడకపోవచ్చు.
Also read: రోజులో ఒక పావుగంట వెనక్కి నడిస్తే ఈ సమస్యలన్నీ దూరం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే
Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?
Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే
Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి