Covid 19 India Cases: దేశంలో కొత్తగా 44,658 కేసులు.. కేరళలో తగ్గని వైరస్ ఉద్ధృతి
దేశంలో కొత్తగా 44,658 కరోనా కేసులు నమోదు కాగా 496 మంది మరణించారు. కేరళలో వరుసగా రెండో రోజు 30 వేల కేసులు నమోదయ్యాయి.
దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు 40 వేలకు పైనే నమోదయ్యాయి. అయితే మరణాలు తగ్గుముఖం పట్టాయి. కానీ కేరళలో వైరస్ ఉద్ధృతి అలానే ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.
India reports 44,658 new #COVID19 cases,32,988 recoveries and 496 deaths in the last 24 hrs, as per Health Ministry.
— ANI (@ANI) August 27, 2021
Total cases: 3,26,03,188
Total recoveries: 3,18,21,428
Active cases: 3,44,899
Death toll: 4,36,861
Total vaccinated: 61,22,08,542 (79,48,439) in last 24 hrs pic.twitter.com/3Ekda2cKBP
- కొత్త కేసులు: 44,658
- కొత్త మరణాలు: 496
- మొత్తం కేసులు: 3,26,03,188
- మొత్తం రికవరీలు: 3,18,21,428
- యాక్టివ్ కేసులు: 3,44,899
- మొత్తం మరణాలు: 4,36,861
మొత్తం కేసుల సంఖ్య 3.26 కోట్లకు చేరగా 4,36,861 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో తగ్గని ఉద్ధృతి..
Kerala reports 30,007 new #COVID19 cases, 18,997 recoveries and 162 deaths in the last 24 hours.
— ANI (@ANI) August 26, 2021
Active cases 1,81,209
Death toll 20,134
Test positivity rate is 18.03%
1,66,397 samples tested in the last 24 hours
కేరళలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు 30వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 162 మంది మరణించారు. కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
కర్ణాటకలోనూ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 1213 కేసులు నమోదుకాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
COVID19 | Karnataka reports 1,213 new cases, 25 deaths and 1,206 discharges today; active cases 19,300 pic.twitter.com/PQl7PiBcxV
— ANI (@ANI) August 26, 2021
జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 61.22 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 79,48,439 మంది టీకా వేయించుకున్నారు.