Coronavirus Update: దేశంలో కొత్తగా 6,563 మందికి కరోనా.. 153కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు పెరిగింది. కరోనా కేసులు 6,563 నమోదయ్యాయి.

FOLLOW US: 

దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదుకాగా 132 మంది మరణించారు. 8,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం 8,77,055 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.  

యాక్టివ్ కేసుల సంఖ్య 82,267కు చేరింది. 572 రోజుల్లో ఇదే అత్యల్పం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.24గా ఉంది. రికవరీ రేటు 98.39 %గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.

వ్యాక్సినేషన్..

దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 15,82,079 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,67,20,359కి చేరింది. 

వ్యాక్సినేషన్‌లో అండమాన్ అండ్ నికోబార్ దీవులు అరుదైన మైలురాయిని చేరుకున్నాయి. అర్హులైన వారందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు అక్కడి పాలకవర్గం ట్వీట్ చేసింది. కేవలం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తోనే ఈ ఘనత అందుకోవడం విశేషం.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లోనూ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందాయి.

ఒమిక్రాన్ కేసులు..

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా గుజరాత్‌లో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ వ్యాపించింది. దిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్‌ (11), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1), బంగాల్ (1).

ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ చీఫ్ డా. రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేలా ఉండకూడదని ముందుగానే తేరుకోవాలని ఆయన సూచించారు. 

Also Read: Aishwarya Rai Summoned: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ

Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!

Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 12:45 PM (IST) Tags: Covid news COVID-19 Covid-19 vaccination omicron variant Omicron Variant in India omicron news covid cases in india today omicron cases in india today covid 19 case in india today covid vaccination in india

సంబంధిత కథనాలు

Anchor Suma: యాంకర్ సుమ బాధపడుతోంది ఈ వింత వ్యాధితోనే, ఇది వారసత్వంగా వస్తుందట

Anchor Suma: యాంకర్ సుమ బాధపడుతోంది ఈ వింత వ్యాధితోనే, ఇది వారసత్వంగా వస్తుందట

Health problems with Pigeons: పావురాలతో శ్వాసకోశ సమస్యలు తప్పవా? వాటికి ఆహారం వేయొద్దని గతంలో అధికారులు ఎందుకు చెప్పారు?

Health problems with Pigeons: పావురాలతో శ్వాసకోశ సమస్యలు తప్పవా? వాటికి ఆహారం వేయొద్దని గతంలో అధికారులు ఎందుకు చెప్పారు?

Meena Husband Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మీనా భర్త మరణం , ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ట్రాన్స్‌ప్లాంటేషన్ కుదురుతుందా?

Meena Husband Lung Infection:  ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో  మీనా భర్త మరణం , ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ట్రాన్స్‌ప్లాంటేషన్ కుదురుతుందా?

Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 30 మంది మృతి

Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 30 మంది మృతి

Lassi Side Effects: లస్సీ అంటే ఇష్టమా? అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు గురించి తెలుసుకోండి మరి

Lassi Side Effects: లస్సీ అంటే ఇష్టమా? అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు గురించి తెలుసుకోండి మరి

టాప్ స్టోరీస్

Shock For AP Employees : అమరావతి ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్ - గత ప్రభుత్వం కల్పించిన ఆ సౌకర్యం ఎత్తివేత !

Shock For  AP Employees  : అమరావతి ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్ - గత ప్రభుత్వం కల్పించిన ఆ సౌకర్యం ఎత్తివేత !

Pregnant With Doll: బొమ్మను పెళ్లి చేసుకుంది, బిడ్డను కూడా కన్నది - అచ్చం నాన్న పోలికే!

Pregnant With Doll: బొమ్మను పెళ్లి చేసుకుంది, బిడ్డను కూడా కన్నది - అచ్చం నాన్న పోలికే!

Raghurama CID : హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !

Raghurama CID :  హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !

Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు

Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు