Pfizer-BioNTech Vaccine Trail: హ్యూమన్ ట్రయల్స్‌కు ఒమిక్రాన్ వ్యాక్సిన్... ఫైజర్ -బయోన్‌టెక్ ముందడుగు !
ప్రత్యేకంగా ఒమిక్రాన్ రకం వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫైజర్, బయోటన్ టెక్ కంపెనీలు వ్యాక్సిన్ రెడీ చేశాయి. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభిచాయి.
![Pfizer-BioNTech Vaccine Trail: హ్యూమన్ ట్రయల్స్‌కు ఒమిక్రాన్ వ్యాక్సిన్... ఫైజర్ -బయోన్‌టెక్ ముందడుగు ! Pfizer-BioNTech Begin Trial for Omicron-specific Covid Vaccine in Adults Pfizer-BioNTech Vaccine Trail: హ్యూమన్ ట్రయల్స్‌కు ఒమిక్రాన్ వ్యాక్సిన్... ఫైజర్ -బయోన్‌టెక్ ముందడుగు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/799c62e89b37bfc8f244601df481effe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అత్యధిక మ్యూటేషన్లు ఉన్న కరొనా వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఫైజర్ - బయోన్‌టెక్ వ్యాక్సిన్ రెడీ చేశాయి. ప్రత్యేకంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై పోరాటానికి సిద్ధం చేసిన వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆ కంపెనీలు ప్రకటింయాయి. 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల 1,420 మంది ఆరోగ్యవంతమైన పెద్దలకు మొదట వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వారిని పరీక్షించి... వచ్చే ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ సమర్థతను నిర్ణయిస్తారు.
Also Read: ఓ మై గాడ్.. టీకా పనిచేసేది ఇన్ని నెలలేనా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
మొత్తం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను మూడు భాగాలుగా విభజించారు. ఇప్పటికే మూడు నెలల ముందుగా రెండు డోసులు తీసుకున్న వారికి కొంతమందికి.. అలాగే మూడు డోసులు అంటే బూస్టర్ డోస్ తీసుకున్న వారికి మరికొంత మందికి వ్యాక్సిన్ ఇస్తారు. అసలు ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని మూడో కేటగిరిలో చేర్చి పరిశోధన నిర్వహిస్తారు. ఒమిక్రాన్ ప్రస్తుతం అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వైరస్ మార్పుల కారణంగా భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండటానికి ఫైజర్ - బయోన్ టెక్ ఒమిక్రాన్ వ్యాక్సిన్ పని చేస్తుందని భావిస్తున్నారు.
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
2022లో ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్లను నాలుగు బిలియన్ డోస్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్ంగా పెట్టుకున్నాయి. ఒమిక్రాన్ తో ఆ లక్ష్యం చేరడం సులభమే. ఫైజర్, బయోఎన్‌టెక్ ఇప్పటికే కోవిడ్‌కు బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తోంది. బూస్టర్ డోస్ తర్వాత నాలుగు నెలల తర్వాత ఓమిక్రాన్ వైరస్ వేరియంట్‌ను ఎదుర్కొనేలా రోగనిరోధకత ఉటంుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ముందు ముందు వ్యాక్సిన్ అవసరమా లేదా అన్న విషాయన్ని బహిర్గత పరుస్తాయని అంటున్నారు.
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)