Corona Vaccine: ఓ మై గాడ్.. టీకా పనిచేసేది ఇన్ని నెలలేనా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

టీకా వేసుకున్నామని ధీమాగా ఉన్నవారికి ఇది నిజంగా షాక్ ఇచ్చే అధ్యయనమే.

FOLLOW US: 

కరోనా వైరస్ ప్రపంచంవ్యాప్తంగా ఒమిక్రాన్ రూపంలో అల్లుకుపోతోంది. దీన్నే మూడోవేవ్ గా భావిస్తున్నారు చాలా మంది. ఒమిక్రాన్ అత్యంత భయంకరమైన అంటువ్యాధిలా ఉంది, చాలా సులభంగా వ్యాపించేస్తోంది. కాకపోతే తీవ్రత తక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే రెండు డోసులు టీకా వేసుకుని ధీమాగా ఉన్న వారికి షాకిచ్చే అధ్యయనం వెలుగు చూసింది. టీకా వేసుకున్న 30 శాతం మందిలో ఆరు నెలల తరువాత వ్యాక్సిన్ వల్ల అంది రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. దీని వల్ల కొత్త వైరస్‌లను ఎదుర్కొనే శక్తి వారికి ఉంటుందా, ఉండదా అనేది ప్రశ్నార్థకమే. అందుకే బూస్టర్ డోస్ అందరికీ అవసరమనే వాదనలు ఎక్కువవుతున్నాయి. 

ఆసియన్ హెల్త్ ఫౌండేషన్‌తో పాటూ AIG హాస్పిటల్స్ వారు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న 1636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం జరిగింది.  వైరస్ నుండి రోగులకు అవసరమైన కనీస రక్షణ స్థాయి 100 AU/ml అని అంచనా వేశారు. దీని కంటే తక్కువ స్కోర్ ఉన్నవారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 15 AU/ml కంటే తక్కువ యాంటీబాడీ స్థాయిలను కలిగిఉంటే... వారిలో వైరస్ నుంచి రక్షణాత్మక రోగనిరోధక శక్తి అభివృద్ధి కాలేదని అర్థం. 

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. 6.2 శాతం మంది కోవాగ్జిన్, ఒక శాతం మంది స్పూత్నిక్ వి టీకాలు తీసుకున్నారు. వీరిలో 30 శాతం మంది టీకా తీసుకున్న ఆరునెలల తరువాత 100 AU/ml కంటే తక్కువ యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నారని నిర్ధారించారు. వీరిలో రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. 6 శాతం మంది ప్రజల్లో రోగనిరోధక రక్షణను టీకాలు అభివృద్ధి చేయలేదని కనిపెట్టారు. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా అంచనా వేస్తే చాలా మందిలో రక్షణ స్థాయి తక్కువగానే ఉండి ఉంటాయని భావిస్తున్నారు అధ్యయనకర్తలు. 

Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు

Also read: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి

Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...

Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 20 Jan 2022 07:33 AM (IST) Tags: booster dose Antibodies Shocking study బూస్టర్ డోస్ Vaacination

సంబంధిత కథనాలు

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!