News
News
X

Post covid Hair loss : కరోనా కారణంగా జుట్టు రాలుతోందా? బయోటిన్ తో మెరుగైన చికిత్స

కరోనా వచ్చి తగ్గాక ఎన్నో సైడ్ ఎఫెక్టులు శరీరంపై వదిలి వెళుతోంది. అందులో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా మహిళలకు ఈ సమస్య ఇబ్బందిగా మారింది.

FOLLOW US: 
Share:

దేశంలో కొన్ని లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. వారిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గాక సైడ్ ఎఫెక్టులు మొదలయ్యాయి. కొందరికి గ్యాస్ట్రిక్ సమస్యలు, నీరసం, కండరాల నొప్పులు, ఛాతీ నొప్పి, తలనొప్పి, నిద్రలేమి వంటివి కలుగుతున్నాయి. మరికొందరిలో విపరీతంగా జుట్టు రాలుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిన ఆడవాళ్లలో ఇది కనిపిస్తోంది. అయితే దీనికి కచ్చితమైన కారణాన్ని మాత్రం వైద్యులు తేల్చలేకపోయారు.  కరోనా బారిన పడినప్పుడు తెలియకుండానే తీవ్ర ఒత్తిడికి గురవుతుంది శరీరం. ఆ ఒత్తిడి వల్ల జుట్టు రాలడం ప్రారంభమవు తుందని భావిస్తున్నారు వైద్యులు. దాదాపు ఈ రాలే ప్రక్రియ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటూ సాగచ్చు.ఈ సమస్యకు చక్కటి పరిష్కారం బయోటిన్ తో దొరుకుతుందని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. 

బయోటిన్ అంటే?

బి విటమిన్లలో బయోటిన్ కూడా ఒకటి. దీన్నే విటమిన్ బి7 అని కూడా అంటారు. ఇది నీటిలో సులువుగా కరుగుతుంది. పోషకాలను శక్తిగా మారుస్తుంది. ఇది జుట్టు ఎదుగుదలకు ఎంతో అవసరమైన కెరోటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. బయోటిన్ వల్ల చేతి గోళ్లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. శరీరంలో బయోటిన్ తక్కువగా ఉంటే జుట్టు రాలడం, గోళ్లు పగుళ్లు బారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

Also read: ఇదెక్కడి విడ్డూరం.. ఈ మహిళ 40 సంవత్సరాలుగా నిద్రపోలేదు.. రాత్రుళ్లు వాళ్లతో కలిసి..

ఎంత అవసరం

పెద్దవారికి రోజుకు 30 మైక్రోగ్రాముల బయోటిన్ అవసరం. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులకు 35 మైక్రోగ్రాముల బయోటిన్ అవసరం పడుతుంది. దాదాపు మనం తినే ఆహారం నుంచే ఆ మొత్తం వచ్చేలా చూసుకోవచ్చు. బయోటిన్ లోపం ఎక్కువగా ఉంటే వైద్యుని సలహాతో సప్లిమెంట్ల ద్వారా తీసుకోవచ్చు. కరోనా బారిన పడి కోలుకున్నాక జుట్టు రాలడం అధికంగా ఉంటే వైద్యుడిని కలిస్తే మంచిది. ఆయన మీకు బయోటిన్ విటమిన్ టాబ్లెట్లను ఉపయోగించమని చెబుతారు. 

Also read: గురువు మారాడు.. పూరి గుడిసెలో పాఠాలు చెప్పే దగ్గరి నుంచి.. నెట్టింట్లో ఆన్ లైన్ క్లాసులు దాకా

ఏ ఆహార పదార్థాలలో దొరుకుతుంది?

గుడ్డులోని పచ్చ సొన, చికెన్ లివర్, బాదం, వేరు శెనగ పలుకులు, వాల్ నట్స్, కాలిఫ్లవర్, పుట్టగొడుగులు, సోయా, అరటి పండ్లు వంటి వాటిల్లో బయోటిన్ లభిస్తుంది. వీటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.  
 
Also read: సోయా ఉల్లి పెసరట్టు ఎప్పుడైనా ట్రై చేశారా..

Published at : 05 Sep 2021 09:49 AM (IST) Tags: Healthy food Vitamin B Hair loss post covid problems

సంబంధిత కథనాలు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

క‌రోనా వైర‌స్‌కు కార‌ణం గబ్బిలాలు కాదు-ఈ జంతువేనట!, నిపుణులు చెబుతున్న నిజం

క‌రోనా వైర‌స్‌కు కార‌ణం గబ్బిలాలు కాదు-ఈ జంతువేనట!, నిపుణులు చెబుతున్న నిజం

పొంచి ఉన్న వైరస్‌ ముప్పు-తెలంగాణ స‌హా 6 రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌

పొంచి ఉన్న వైరస్‌ ముప్పు-తెలంగాణ స‌హా 6 రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌

Gurugram Covid-19 Scare: కరోనా భయంతో మూడేళ్లుగా చీకట్లోనే ఉంటున్న మహిళ- అద్దె ఇంట్లో ఉంటున్న భర్త

Gurugram Covid-19 Scare: కరోనా భయంతో మూడేళ్లుగా చీకట్లోనే ఉంటున్న మహిళ- అద్దె ఇంట్లో ఉంటున్న భర్త

Heart Attacks: కోవిడ్ తర్వాత గుండె జబ్బులతోనే అత్యధిక మరణాలు - అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

Heart Attacks: కోవిడ్ తర్వాత గుండె జబ్బులతోనే అత్యధిక మరణాలు - అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

టాప్ స్టోరీస్

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్