By: ABP Desam | Updated at : 04 Sep 2021 06:18 PM (IST)
pesarattu
పెసరట్టు ఉప్మా తిని ఉంటారు, అలాగే ఉల్లి ముక్కలు చల్లిన ఆనియన్ పెసరట్టు కూడా తిని ఉంటారు. అదే విధంగా ఓసారి సోయా ఉల్లి పెసరట్టు టేస్ట్ చూడండి. కొత్త రుచితో మీకు నచ్చడం ఖాయం.
సోయా చంక్స్- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయ (పెద్దది) - ఒకటి
పెసరపప్పు - రెండు కప్పులు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - ఒకటిన్నర స్పూను
కరివేపాకు - ఒక రెమ్మ
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీస్పూను
1. రెండు గంటల ముందే పెసరపప్పు నానబెట్టుకోవాలి.
2. సోయా చంక్స్ ను కూడా నీళ్లలో నానబెట్టాలి. ఇవి త్వరగా నానిపోతాయి కనుక కేవలం అరగంట ముందు నానబెట్టుకున్నా చాలు.
3. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు, సోయా చంక్స్, జీలకర్ర, అల్లం, మిరియాలపొడి, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అట్టుగా వేసుకునేందుకు వీలుగా ఆ రుబ్బులో అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పుని కూడా చేర్చాలి.
4. పెనం వేడి చేసి సరిపడా నూనె వేసి పెసరట్టును వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలాక పెసరట్టును తీసివేయాలి.
5. దీన్ని కొబ్బరి చట్నీ లేదా గ్రీన్ చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
సోయా చంక్స్ లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఎంత తిన్నా కొలెస్ట్రాల్ చేరదు. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పులో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండె, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కనుక ఈ సోయా ఆనియన్ పెసరట్టు పెద్దలతో పాటూ పిల్లలు తిన్నా ఆరోగ్యమే.
Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే
ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
Diabetes: డయాబెటిస్ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి
ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్తో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !