World Beard Day 2021: గడ్డం ఉంటే అదో కిక్కు.. ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ని అమ్మాయిలే గడ్డం పెంచేయమంటున్నారు
గడ్డం అనేది.. ఇప్పుడు ఫ్యాషన్ కి సింబల్. గర్ల్ ఫ్రెండ్ కూడా.. కాస్త గడ్డం పెంచు.. లుక్ బాగుంటుంది.. అని చెప్పే రోజులు. అయితే సెప్టెంబర్ 4న వరల్డ్ బియర్ట్ డే(World Beard Day) అని మీకు తెలుసా?
ఈరోజుల్లో గడ్డం పెంచడమంటే ఒక ఫ్యాషన్. అమ్మ తిట్టినా.. నాన్న కొప్పడినా.. స్టైల్ అంటూ.. వాళ్లకి ఏదో ఒక సమాధానం చెప్పి బయటపడతాం. ఇక కొంతమందైతే.. బియర్డ్ అనేది అటిట్యూడ్ కి సింబాలిక్ గా చూస్తారు. గడ్డం ఉంటే.. అదో.. ఆనందం. అయితే.. గడ్డానికి ఓ రోజు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని జరుపుకొంటారు.
సెప్టెంబర్ నెలలో వచ్చే మెుదటి శనివారం వరల్డ్ బియర్డ్ డేగా జరుపుకొంటారు. అయితే ఈసారి సెప్టెంబర్ 4న వచ్చింది. చాలా దేశాల్లో ప్రపంచ గడ్డం దినోత్సవాన్ని జరుపుతారు. గడ్డం పౌరుషానికి చిహ్నం.. మంచి గడ్డం ఉండే వ్యక్తికి ఎల్లప్పుడూ గొప్ప గౌరవం ఉంటుందని చాలామంది నమ్ముతారు.
ప్రపంచ గడ్డం దినోత్సవం రోజున కొన్ని దేశాల్లో కుటుంబంలోని గడ్డం ఉన్న సభ్యులు విశ్రాంతి తీసుకుంటారు. ఈరోజున షేవింగ్ చేయడం అత్యంత అగౌరవంగా పరిగణిస్తారు. అయితే.. ఈ గడ్డం దినోత్సవం జరుపుకొనేందుకు సరైన థీమ్ అంటూ ఏం లేదు. తమ గడ్డంపై ప్రేమను చూపుకోవడం అంతే. దక్షిణ స్పెయిన్‌లో, గడ్డం ఉన్న వ్యక్తి, గడ్డం లేని వ్యక్తి మధ్య బాక్సింగ్ పోటీలు కూడా నిర్వహించేవారట.
క్లీన్ షేవ్‌తో ఉండడం పాత ఫ్యాషన్.. కాస్త రఫ్‌లుక్‌లో గడ్డంతో కనిపించడమే లేటెస్ట్ ఫ్యాషన్.. ఇదే రూల్‌ని పాటిస్తూ చాలామంది అబ్బాయిలు గడ్డం పెంచుకుంటూ ఫ్యాషన్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు. అయితే గడ్డం పెంచుకోవడం కేవలం అందం కోసమే కాదండోయ్ ఇందువల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట.
గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి దూరం కావొచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడవని దీనివల్ల చర్మం నల్లగా మారడం, సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు రావు. ముడతలు కూడా రావు..యూవీ కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది.
ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్స్‌కి కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుంది. క్లీన్‌గా షేవ్ చేసుకున్న ప్రతీసారి చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దీని వల్ల బ్యాక్టిరియా పెరిగి ఇన్ఫెక్షన్లు, మొటిమలు పెరుగుతాయి. గడ్డం ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తవు. ముఖంపై మచ్చలుకూడా చాలావరకూ తగ్గుతాయి.
అంతేకాదు.. స్మార్ట్‌గా కనిపించే వారికంటే గడ్డంతో కనిపించేవారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. అప్పుడు ప్రేయసి కాదంటే గడ్డాలు పెంచి ప్రేమదాసులు అయ్యేవారు.. ఇప్పుడు ప్రేమకి దాసులు కావాలంటే గడ్డాలుపెంచండంటూ సలహాలిచ్చేస్తున్నారు.
Also Read: Icecubes Facepacks: ముఖానికి ఐస్ క్యూబ్స్ తో మర్ధనా చేస్తున్నారా? అయితే ఇది చదవండి