By: ABP Desam | Updated at : 04 Sep 2021 03:41 PM (IST)
ఐస్క్యూబ్తో మర్ధనా జాగ్రత్త సుమీ
చిక్ని చమేలీ గర్ల్ కత్రినా కైఫ్ కారణంగా ముఖానికి ఐస్ క్యూబులతో మర్ధన చేసుకోవడం అమ్మాయిలకు బాగా అలవాటైంది. తన అందానికి ఐస్ ప్యాకులే కారణమంటూ ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేసింది కత్రినా. దాంతో చాలా మంది ముఖానికి ఐసు గడ్డలతో మర్ధనా చేసుకోవడం మొదలుపెట్టారు. సెలెబ్రిటీ చెప్పగానే ఫాలో అయిపోయే అభిమానులే ఎక్కువ. అయితే ఆ బ్యూటీ టిప్ మన చర్మానికి పడుతుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఐస్ క్యూబు ప్యాకులు మంచివే. ముఖంపై మొటిమలను నిరోధిస్తాయి, అలాగే రక్త ప్రసరణను పెంచుతాయి. కానీ అన్నిరకాల చర్మతత్వానికి ఇది సరిపడవు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి ఐస్ ప్యాక్ పడదు. వారి చర్మ రంధ్రాలు మరింతగా పొడిబారి పోయి పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల చర్మసమస్యలు ఎదురుకావచ్చు. అలాగే విపరీతమైన తలనొప్పి కూడా కలిగే అవకాశం ఉంది.
Also Read : వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..
అతి అనర్ధానికే దారి తీస్తుంది. అదే విధంగా అధిక సమయం పాటూ, పదే పదే ముఖంపై ఐసు క్యూబులతో మర్థనా చేయడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. చర్మం ఎరుపుగా మారి, దురదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ రంధ్రాలు పూడుకుపోయి స్వేదం బయటికి రాకుండా చర్మంకిందనే ఉండిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల మొటిమల సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read : టీచర్స్ డే రోజు మీకు నచ్చిన ఉపాధ్యాయులకు మీరివ్వగలిగే బహుమతులు
పొడి చర్మం ఉన్నవారు ఐసు క్యూబుల మర్ధనాకు దూరంగా ఉండాలి. చర్మం పొడిగా ఉన్నప్పుడు చర్మ రంధ్రాలు డ్యామేజ్ అయి ఉంటాయి. అలాంటి సమయంలో మర్ధనా చేస్తే రంధ్రాలు మరింతగా డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ మీకు మొటిమలు, వాపు లాంటివి ఉంటే రోజు తప్పించి రోజు ఐసు ప్యాకులు ప్రయత్నించవచ్చు. పొడి చర్మం కలవారికి చల్లని ఉత్పత్తుల వల్ల పెద్ద లాభం ఉండదు.
ఐసు క్యూబులతో నేరుగా చర్మంపై మర్ధనా చేయకూడదు. ఒక వస్త్రంలో చుట్టి మర్ధనా చేసుకోవాలి. టమాటా ప్యూరీ, కీరా దోస రసం, అలోవెరా జ్యూసు వంటివాటిని ఫ్రీజర్లో ఐసు క్యూబులుగా గడ్డకట్టేలా చేసి వాటితో మర్ధనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే రోజూ మర్ధనా చేసే వారు పది నిమిషాలకు మించి ఎక్కువ సమయం చేయరాదు.
ఈ వేసవి డయాబెటిస్ బాధితులకు డేంజరే - ఈ సూచనలు పాటిస్తే సేఫ్!
Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? వీటిని తింటే మేలు
SugarCane Juice: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Blood Circulation: ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం
Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం