X

Teachers Day 2021: టీచర్స్ డే రోజు మీకు నచ్చిన ఉపాధ్యాయులకు మీరివ్వగలిగే బహుమతులు

ఉపాధ్యాయులు ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. ఎవరు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా అందులో గురువుల ప్రోత్సాహం కచ్చితంగా ఉంటుంది.అలాంటి వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..

FOLLOW US: 

ఓ వ్యక్తిని సరైన మార్గంలో తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం అంటే అందరికీ చాలా స్పెషల్. మన ఉన్నతికి శ్రమించిన ఉపాధ్యాయులను స్మరించుకోవడం అందరి బాధ్యత కూడా. ఒకప్పుడు టీచర్స్‌ డే అంటే ఇష్టమైన గురువుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు  కాలం మారింది. కాలంతోపాటు గురువులకు ఇచ్చే గిప్టుల్లోనూ మార్పు వచ్చింది. మీకు ఇష్టమైన ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే బహుమతులను చూసేయండిక్కడ.

టీచర్స్‌ డే కుషన్ అండ్ మగ్‌ సెట్‌: ఇది చాలా మందికి నచ్చే కామన్‌ గిఫ్టు. ఇందులో మగ్‌, కుషన్, కీచెయిన్, ఓ గ్రీటింగ్ కార్డు ఉంటాయి. మీరు ఇచ్చే కుషన్ టీచర్‌ బెడ్‌ రూం డెకరేట్ చేసుకునేందుకు యూజ్ అవుతుంది. మార్నింగ్ తాగే టీ కోసం టీ మగ్‌ కూడా ఉంటుంది. అందులో ఉండే గ్రీటింగ్‌ కార్డులో టీచర్‌పై మీకున్న అభిమానాన్ని తెలిపేలా ఏదైనా రాయొచ్చు కూడా.

టీచర్స్‌ డే ఫొటో ఫ్రేమ్‌: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్‌కు ఇవ్వదగ్గ మరో బహుమతి ఫొటో ఫ్రేమ్‌. దీన్ని టీచర్స్‌ కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు. దీన్ని మీ టీచర్స్‌ గోడలకు వేలాడదీసి... వాళ్లకు నచ్చిన ఫొటోలు పెట్టుకుంటారు. టేబుల్‌పై కూడా పెట్టుకునే వెసులుబాటు దీనికి ఉంది. ఈ ఫ్రేమ్‌తోపాటు టీచర్స్‌తో మీ క్లాస్‌ ఫ్రెండ్స్‌ అంతా కలిసి దిగిన ఫొటోను అందులో పెట్టి పంపించ వచ్చు.

టీచర్స్‌ డే గడియారం : మరో అద్భుతమైన బహుమతి ఈ-వాల్ క్లాక్‌. మీ టీచర్‌ ఇంట్లో మరో అందమైన డెకరేషన్ ఐటెమ్‌గా ఈ వాల్‌ క్లాక్‌ను ఉంచుకుంటారు. ఈ గడియారం చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తుంటారు. అందుకే టీచర్స్‌ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చే బహుమతుల్లో ఇది చాలా విలువైనది.

టీచర్స్‌ డే పెన్ స్టాండ్: మీ ప్రియమైన ఉపాధ్యాయులకు పెన్‌ స్టాండ్ కూడా మరో విలువైన బహుమతి ఇవ్వొచ్చు. ఇది చెక్కతో సుందరంగా ముస్తాబు చేసిన చూడముచ్చటైన గిఫ్టు.

గుడ్‌ లక్‌ ప్లాంట్: టీచర్స్‌ డే సందర్భంగా నచ్చిన ఉపాధ్యాయులకు గుడ్‌లక్‌ ప్లాంట్స్‌ కూడా ఇవ్వొచ్చు. ఇప్పుడు ఇది ట్రెండీ కూడా. చాలా మంది పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, వార్షికోత్సవాలకు వీటినే గిఫ్టులగా ఇస్తున్నారు. అందుకే ఇలా కూడా మీరు ట్రై చేయండి.

భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

Tags: Teachers Day 2021 Surprise your favorite teachers gifts Teachers Day News Today Teachers Day News Teachers Day News 2021 2021 Teachers Day News

సంబంధిత కథనాలు

Kim Jong-Un: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

Kim Jong-Un: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

Squid Game: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..

Squid Game: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..

ఏపీలో ‘బూమ్ బూమ్’ అంటే మందిస్తారు.. ఆ దేశాల్లో మాత్రం దండిస్తారు, ఎందుకంటే..

ఏపీలో ‘బూమ్ బూమ్’ అంటే మందిస్తారు.. ఆ దేశాల్లో మాత్రం దండిస్తారు, ఎందుకంటే..

Kim Jong Un Style: కిమ్ జంగ్ ఉన్ కొత్త రూల్.. ఇకపై అలా కనిపిస్తే చచ్చారే!

Kim Jong Un Style: కిమ్ జంగ్ ఉన్ కొత్త రూల్.. ఇకపై అలా కనిపిస్తే చచ్చారే!

Mike Tyson: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి

Mike Tyson: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

Telangana Cabinet Meet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చకు వచ్చే అంశాలివే..

Telangana Cabinet Meet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చకు వచ్చే అంశాలివే..