Gold Vada Pav: వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..
వడపావ్ అంటే మన ముంబైకి మాత్రమే పరిమితమైందనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్టే. విదేశాల్లోనూ ఫేమస్. ఇంకో విషయం చెప్పాలంటే.. గోల్డ్ వడపావ్ కూడా అమ్మేస్తున్నారు.
వడాపావ్.. ఎంతోమంది ఇష్టంగా తినే రుచికరమైన చిరుతిండి. వడాపావ్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే నగరం ముంబై. అక్కడ అది తిని బతికే.. చాలామంది ఉంటారు. అయితే, ఇప్పుడు దుబాయ్‌లో చేసిన ఓ గోల్డెన్ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అట. వడపావ్ ఇప్పుడు దుబాయ్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ అవుతోంది. గోల్డ్ బిర్యానీ, గోల్డెన్ బర్గర్ మాదిరే ఇప్పడు గోల్డ్ వడపావ్‌నూ అర్డర్ చేయొచ్చు. అవునండీ నిజంగా నిజం.. కావాలంటే మీరే చదవండి.
Also Read; Mogulayya : భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ సింగర్ మొగులయ్య గురించి తెలుసా ?
Ashu Reddy Slaps RGV: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు
దుబాయ్‌లోని కరమా ప్రాంతంలో ఉన్న ఓపావో అనే రెస్టారెంట్ భారతీయుల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేస్తుంటుంది. కొత్తగా 22కే గోల్డెన్ పావ్ పేరుతో ఈ ఆహార పదార్థాన్ని ప్రవేశపెట్టింది. దీని ధరను 99 దిర్హామ్ అంటే సుమారు రూ. 2,000 గా తెపింది.
#Gold_Vada_Paav This is what's wrong with the world: too many rebels without a cause. pic.twitter.com/JKeKsgOLEo
— Masarat Daud (@masarat) August 30, 2021
వెన్న, జున్నుతో తయారు చేసిన ఈ వడపావ్‌పై 22 కారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే దానిపై ఉన్న బంగారం కోటింగ్ తినదగినది అన్నమాట. ఫ్రెంచ్ నుండి ఇంపోర్ట్ చేసిన 22 క్యారెట్ గోల్డ్ లీవ్స్‌తో తయారు చేస్తారు. మస్రత్ దావూద్ అనే పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో గోల్డ్ వడపావ్ వీడియోను షేర్ చేశారు. దీన్ని 20వేలకు పైగా మంది వీక్షించారు. ఫుడ్ లవర్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది.
Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!
Yami Gautam Photo: తెల్ల చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతున్న యామీ
మరి ఇంత వెరైటీ వడపావ్ నార్మల్ గా ఇస్తే ఏం తృప్తి. అందుకే ప్రజంటేషన్‌లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడపావ్ రేంజ్‌లోనే ప్రజంటేషన్ కూడా ఉంది. ఈ గోల్డెన్ వడాపావ్‌ని చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్‌తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్, పుదీనా లేమనేడ్‌ని కూడా ఇస్తారు.
గతంలోనూ రూ. 19,704 లతో ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో లగ్జరీ డిన్నర్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. దీనిలో గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో మూడు రకాల వంటకాలను వడ్డించేవారు.
Also Read: జంపు జిలానీ.. హోటల్‌లో 8 నెలలు తిష్ట.. బిల్లు చెల్లించకుండా బాత్రూమ్ కిటికీ నుంచి ఎస్కేప్