No Sleep: ఇదెక్కడి విడ్డూరం.. ఈ మహిళ 40 సంవత్సరాలుగా నిద్రపోలేదు.. రాత్రుళ్లు వాళ్లతో కలిసి..
ఒక మహిళ 40 ఏళ్లుగా నిద్రపోవట్లేదు. కనీసం కంటి మీద ఒక్కసారి కూడా కునుకు వేయలేదు. తను చివరిసారిగా నిద్రపోయింది ఎప్పుడో తెలుసా.. తనకు 5 ఏళ్లు ఉన్నప్పుడు.
మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేమి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. విపరీతమైన పని ఒత్తిడితో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అసలు రాత్రి నిద్రపట్టడానికి చాలామంది నానా తంటాలు పడుతుంటారు. ఇక.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు థెరపీ సెషన్లకు వెళ్లడం తరచూ వింటుంటాం. అయితే మనం ఒక రాత్రి.. లేదా రెండు మూడు రాత్రులు నిద్రపోకుండా ఉంటామేమో.. కానీ సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తి గురించి.. విన్నారా? 40 సంవత్సరాల నుంచి ఓ మహిళ నిద్రపోవట్లేదు. చైనాకు చెందిన ఈమె ఎందుకు నిద్రపోవట్లేదు?
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తోంది లీ ఝానింగ్. సంవత్సరాలు.. సంవత్సరాలుగా నిద్రపోకుండా వింత వ్యాధితో బాధపడుతోంది. కనీసం ఆమె ఒక్క సెకను కూడా నిద్రపోదు. ఆమెకి ఇప్పుడు 45 సంవత్సరాలు. ఆమె చివరిసారిగా నిద్రపోయింది ఎప్పుడో తెలుసా.. తనకు 5 ఏళ్లు ఉన్నప్పుడు. ఇక అప్పటి నుంచి 40 సంవత్సరాలుగా ఒక నిమిషం కూడా నిద్రపోలేదు లీ.
లీ భర్త లియు సుక్విన్ ను ఈ వ్యాధి గురించి అడగగా నిజమేనని చెప్పాడు. పెళ్లైన తర్వాత ఇప్పటి వరకు తన భార్య నిద్రపోలేదని అంగీకరించాడు. రాత్రి సమయంలో టైంపాస్ అయ్యేందుకు లీ.. ఏదో ఒక ఇంటి పనిచేస్తూనే ఉంటుందట. పెళ్లైన కొత్తలో భార్య నిద్రపోయేందుకు.. లియు నిద్రమాత్రలు కొని ఇచ్చేవాడు. కానీ అవి కూడా సరిగా పనిచేయలేదని చెప్పాడు.
నిద్రపోని.. లీగా ఝానింగ్ తన గ్రామంలో చాలా ఫేమస్ అయిపోయింది. సమీపంలో నివసించే వ్యక్తులు.. రాత్రి సమయంలో సరదా కోసం లీ ఇంటి దగ్గరకు వెళ్తారు. ఆమెతో కార్డులు ఆడతారు. కొంత సమయం తర్వాత వాళ్లకూ నిద్ర ముంచుకొస్తుంది. ఆ సమయానికి వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు. చైనా బాగా నిద్రపోతున్నప్పుడు.. లీ బాగా మేల్కొని ఉంటుందన్న మాట. అయితే తన నిద్రలేమిపై.. లి చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లింది. కానీ ఎవరూ ఆమెకు సరైన వైద్యం చేయలేకపోయారు. ఎవరి వైద్యం ఆమెను నిద్ర పోయేలా చేయలేదు.