Bangarraju Sankranti Release: నాగార్జున పట్టుదలకు కారణమదే..
కొన్నేళ్లుగా నాగార్జున ట్రాక్ రికార్డ్ చూస్తే గనుక సరైన సక్సెస్ రాలేదు. అయినప్పటికీ నాగ్ ఎందుకు సంక్రాంతి పోటీకి దిగుతున్నాడో తెలుసా..?
అక్కినేని నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకి ప్రీక్వెల్ గా 'బంగార్రాజు'ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాలుగేళ్లుగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేయడంతో పక్కా ప్లానింగ్ తో షూటింగ్ లోకి దిగారు. అందుకే అప్పుడే సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. అంతేకాదు.. 2022 సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ సమయానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా ఉందని తెలిసి కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..
నిజానికి కొన్నేళ్లుగా చూసుకుంటే నాగార్జునకి ఒక్క హిట్టు కూడా రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'వైల్డ్ డాగ్' సినిమా కూడా బోల్తా కొట్టింది. అయినప్పటికీ నాగ్ పెద్ద సినిమాలతో పోటీగా తన సినిమాను ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నాడో తెలుసా..? 'బంగార్రాజు' సినిమాకి మొత్తం ఫండింగ్ చేసింది జీ స్టూడియో సంస్థ. చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను జనవరిలో విడుదల చేయాలి. జనవరి నెలలో ఎప్పుడైనా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు.. అలా కాకుండా ఫిబ్రవరికి వెళ్తే ఒప్పుకున్న మొత్తంలో కనీసం 10 నుండి 15 శాతం అమౌంట్ ను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
అందుకే నాగార్జున ఎట్టిపరిస్థితుల్లో తన 'బంగార్రాజు' సినిమాను జనవరిలోనే విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు మాత్రమే విడుదలైతే నాగార్జున సంక్రాంతికి తన సినిమాను కూడా రిలీజ్ చేస్తారు. వాటితో పాటు పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' వస్తే గనుక జనవరి నెలాఖరున 'బంగార్రాజు'ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుకే దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఇప్పుడు 'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగానే.. తన సినిమా డేట్ ను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు నాగార్జున.
కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న 'బంగార్రాజు' సినిమాలో నాగార్జున జోడీగా రమ్యకృష్ణ జోడీ నటించనుంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఆయన సరసన కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది.
Also Read: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్
Also Read: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా
Also Read: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!
Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?
Also Read: ఫన్ అండ్ సెంటిమెంట్ 'సౌండ్' స్టార్ట్ అయ్యింది... ఇది మల్టీబ్రాండ్ గురూ!
Also Read: 2014లో స్వాతంత్ర్యం అంతకు ముందుది భిక్షే.. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో దుమారం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి