By: ABP Desam | Updated at : 11 Nov 2021 08:03 PM (IST)
తెలుగు చలన చిత్ర పరిశ్రమ
ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వ్యతిరేకం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మడానికి సన్నాహాలు చేస్తున్నదని సమాచారం సినీ వర్గాల్లో కలకలం సృష్టించింది. పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు మాత్రమే ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశం కావడంతో ఏం చర్చించారనేది పరిశ్రమలో చాలామందికి తెలియలేదు. ప్రభుత్వం టిక్కెట్లు అమ్మితే... వాటి ద్వారా వచ్చిన డబ్బులను ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలియలేదు. పవన్ కల్యాణ్ సహా కొంతమంది అదే విషయమై విమర్శించారు. విమర్శలు, ప్రతి విమర్శలతో అప్పుడు వాతావరణం వేడెక్కింది. నిర్మాతలు 'దిల్' రాజు, నవీన్ ఎర్నేని, 'బన్నీ' వాసు తదితరులు ఆ తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకురావాలని తామే కోరినట్టు నిర్మాతలు తెలిపారు. అదంతా గతం.
ప్రస్తుతానికి వస్తే... కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎగ్జిబిటర్లతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, థియేటర్ల వ్యవస్థను పరిశ్రమగా గుర్తించినందున పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలని కోరారు. వారు ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి అంగీకరించినట్టు నిర్మాత అంబికా కృష్ణ తెలిపారు. ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు... డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి వ్యతిరేకం ఏమీ కాదు. కానీ, వారందరూ కోరేది టికెట్ రేట్లు పెంచమని. ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది.
ఆన్‌లైన్ టికెటింగ్ విధానం, టికెట్ రేట్స్ గురించి 'బన్నీ' వాసు మాట్లాడుతూ "కొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్ రేట్లు పెంపు కోరుతూ... గతంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ హై కోర్టుకు వెళ్లేవారు. ప్రతిసారీ టికెట్ రేట్స్ గురించి రావడం ఎందుకు? దీనిపై ఓ కమిటీ వేయమని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. కొంతమంది చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ కమిటీ ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు ఫైనలైజ్ చేసింది. ఆ విషయం పరిశ్రమలో చాలా మందికి తెలియలేదు" అని గతంలో ఓసారి వివరించారు. ఇప్పుడు ఆ టికెట్ రేట్స్ పెంచరాలని నిర్మాతల్లో మెజారిటీ శాతం కోరుకుంటోంది.
ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ వల్ల పెద్ద సినిమాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వరకూ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. పైకి చెప్పడం లేదు గానీ... ఆన్ లైన్ టికెటింగ్ కంటే టికెట్ రేట్స్ పెంచితే బావుంటుందని చాలామంది నిర్మాతలు కోరుకుంటున్నారు. ఈ రేట్స్ ప్రకారం అయితే కోట్ల రూపాయలు ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ కు సినిమాలు తీసుకోలేమని కొందరు తెగేసి చెబుతున్నారు. అందువల్ల, టికెట్ రేట్స్ లో స్పష్టత కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. టికెట్ రేట్స్ పెంచిన తర్వాతే ఆన్ లైన్ టికెటింగ్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నందని సమాచారం.
Malayalam Actor Sreejith: లైంగిక వేధింపుల కేసు- ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవి అరెస్ట్
Thor Love and Thunder Review: థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
Producer Gorantla Rajendra Prasad: టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూత
Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్గానే చెబుతోందా ?
Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!
Rohit Sharma: ఇంగ్లాండ్తో తొలి టీ20కి ముందు రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్!!