News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'Drushyam 2 Release: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..

'దృశ్యం' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన 'దృశ్యం 2' కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది మూవీ యూనిట్...

FOLLOW US: 
Share:

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ తెలుగులో రీమేక్ అయిన సూపర్ హిట్టైంది.  వెంకటేశ్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో శ్రీ ప్రియ ఈ మూవీని రీమేక్ చేసింది.  ఆ తర్వాత దృశ్యం సీక్వెల్ గా మోహన్ లాల్ నటించిన  ‘దృశ్యం -2’  కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో...మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే రీమేక్ కి ఎంపిక చేసుకున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట‌ర్లో విడుదలవుతుందా...ఓటీటీలో డైరెక్ట్ గా వస్తుందా అనే చర్చ జరిగింది. ఎట్టకేలకు విడుదల తేదీ ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. 

మాతృక బాటలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు.  తాజాగా 'దృశ్యం 2' టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. వెంకటేశ్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ ఓటీటీలో విడుదల చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని విధంగా పంపిణీదారుల నుంచి సురేశ్ బాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ' దృశ్యం2' ను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఊహించ‌ని విధంగా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

'దృశ్యం' ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే 'దృశ్యం 2' మొదలవుతోందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.  'రాంబాబు కేసు ఏమైంది సార్' అని అడగడంతో ప్రారంభమైన ఈ టీజర్.. ఆరేళ్లుగా ఈ కేసు విషయంలో పోలీసులు రాంబాబు మీద నిఘా పెట్టారని తెలియజేస్తోంది. 'ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మళ్ళీ మమ్మల్ని లాగొద్దని వెంకటేష్ బ్రతిమాలుతుండటం.. ఎప్పటిలాగే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడాన్ని ఇందులో చూపించారు. అయితే రాంబాబు మాత్రం ఈ ప్రాబ్లమ్ కూడా ఎప్పటిలాగే పోతుందని తన కూతుళ్ళతో ధీమాగా చెబుతున్నాడు. 'దృశ్యం 2'' లో వెంకటేష్ గడ్డం పెంచుకుని మొదటి భాగం కంటే కొత్తగా కనిపించాడు. భార్యగా మీనా, కుమార్తెలుగా ఎస్తర్ అనీల్, కృతికా ఆకట్టుకున్నారు. 'దృశ్యం' లో నటించిన నదియా, నరేష్, తనికెళ్ళ భరణి, సత్యం రాజేష్ సీక్వెల్లోనూ ఉన్నారు.  అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులే పడ్డాయి. 'నారప్ప' తర్వాత ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోన్న వెంకీ మూవీ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి...
Also Read: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్
Also Read: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా
Also Read: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!
Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల‌ విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?
Also Read: ఫన్ అండ్ సెంటిమెంట్ 'సౌండ్' స్టార్ట్ అయ్యింది... ఇది మల్టీబ్రాండ్ గురూ!
Also Read: 2014లో స్వాతంత్ర్యం అంతకు ముందుది భిక్షే.. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో దుమారం !
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 01:27 PM (IST) Tags: Venkatesh Meena Drushyam 2 Release Drushyam 2 On Prime

ఇవి కూడా చూడండి

Gruhalakshmi December 9th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: పరంధామయ్యకు భయంకరమైన వ్యాధి అని చెప్పిన డాక్టర్ - షాక్‌లో తులసి కుటుంబం

Gruhalakshmi December 9th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: పరంధామయ్యకు భయంకరమైన వ్యాధి అని చెప్పిన డాక్టర్ - షాక్‌లో తులసి కుటుంబం

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Krishna Mukunda Murari Today Episode : కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ భర్త ఎవరు? ఎంక్వైరీ స్టార్ట్ చేసిన మురారి!

Krishna Mukunda Murari Today Episode : కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ భర్త ఎవరు? ఎంక్వైరీ స్టార్ట్ చేసిన మురారి!

Bigg Boss 7 Telugu: అదే మా ఇంట్లో ఆడవాళ్లైతే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని - శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: అదే మా ఇంట్లో ఆడవాళ్లైతే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని - శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: శివాజీని గెలిపించిన హౌజ్‌మేట్స్ - తాను నమ్మే సూత్రం అదేనట!

Bigg Boss 7 Telugu: శివాజీని గెలిపించిన హౌజ్‌మేట్స్ - తాను నమ్మే సూత్రం అదేనట!

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!