Samantha: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో మరింత జోరు పెంచిన సామ్ తనని తాను యాక్టివ్ గా ఉంచుకోవడంతో పాటూ తన ఫాలోవర్స్ కోసం కూడా మంచి మంచి కొటేషన్స్ షేర్ చేస్తోంది. తాజాగా సమంత షేర్ చేసిన కొటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడమే కాదు దాన్ని నిలబెట్టుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది సమంత. వ్యక్తిగత జీవితంలో ఊహించని సమస్య వచ్చినప్పటికీ ఆ ప్రభావం తన కెరియర్ పై పడకుండా ప్లాన్ చేసుకుంటోంది. రోజురోజుకీ మరింత ఉత్సాహంగా ఉంటూ..తన ఫాలోవర్స్ లో ఉత్సాహాన్ని నింపే పోస్టులు పెడుతోంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టేటస్ లో సామ్ పెట్టిన పోస్టులు వైరల్ అవుతోంది.
View this post on Instagram
చెన్నైలో కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. సామ్ కేవలం ఒక్క రోజు తన పేరెంట్స్ తో ఉండేందుకు చెన్నై వెళ్లింది. తన పెట్ డాగ్స్ ని ఒక్కరోజు కోసం వదిలి వెళ్తున్నానంటూ ఇన్ స్టా లో పేర్కొంది. చైతూతో వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడేందుకు ఏమాత్రం సమయం దొరికినా తల్లిదండ్రులు, స్నేహితులతో స్పెండ్ చేస్తోంది. ఈ మధ్యే సామ్ స్నేహితురాలితో తీర్థయాత్రలకు వెళ్లొచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బాల్కనీ నుంచి వర్షపు వాతావరణం తెలియజేసే ఫొటోస్ పోస్ట్ చేసింది. ''ఎప్పుడూ ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది.. గుర్తుంచుకోండి'' అని షేర్ చేసిన కొటేషన్ మరింత వైరల్ అవుతోంది.
రీసెంట్ గా 'ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సామ్ ఆ తర్వాత కెరీర్ పై మరింత కాన్సన్ ట్రేషన్ పెంచింది. చైతూతో విడిపోయిన తర్వాత ఇప్పటికే రెండు బైలింగ్వల్ ప్రాజెక్టులు ప్రకటించింది. అందులో ఒకటి రొమాంటిక్ ఫాంటసీ కాగా మరొకటి థ్రిల్లర్ అని తెలుస్తోంది. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సామ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా
Also Read: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!
Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?
Also Read: ఫన్ అండ్ సెంటిమెంట్ 'సౌండ్' స్టార్ట్ అయ్యింది... ఇది మల్టీబ్రాండ్ గురూ!
Also Read: 2014లో స్వాతంత్ర్యం అంతకు ముందుది భిక్షే.. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో దుమారం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి