Mechanic Rocky: మాస్ కా దాస్ ‘మెకానిక్ రాకీ‘ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్, ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
విశ్వక్ సేన్ హీరోగా, రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు.
Mechanic Rocky Trailer: టాలీవుడ్ ఊర మాస్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో మాంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘మెకానిక్ రాకీ’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
శ్రీరాములు థియేటర్ లో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్ల మేకర్స్ ప్రకటించారు. హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. సాయంత్రం 4.01 నిమిషాలకు ట్రైలర్ 1.0ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ అభిమానులు పెద్ద సంఖ్యలు అక్కడికి చేరుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే థియేటర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
It’s going to be mass-yy🔥#MechanicRocky Trailer 1.0 Launch tomorrow @ 4:06 pm 💥💥
— VishwakSen (@VishwakSenActor) October 19, 2024
See you at Sree Ramulu Theatre, Moosapet ❤️🔥#MechanicRockyOnNOV22 🛠 @itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @SRTmovies @manojhreddydop… pic.twitter.com/aGfxOGS5m8
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘మెకానిక్ రాకీ’
విశ్వక్ సేన్ నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ మూవీ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. ట్రయాంగింల్ లవ్ స్టోరీ కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
దీపావళి బరి నుంచి తప్పుకున్న ‘మెకానిక్ రాకీ’
‘మెకానిక్ రాకీ’ సినిమాను తొలుత దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం కారణంగా విడుదల తేదీని వాయిదా వేసింది. అంతేకాదు, అవుడ్ ఫుట్ సరిగా రాకపోవడంతో కొన్ని సన్నివేశాలను మళ్లీ షూట్ చేశారట. ఈ కారణంగానే సినిమా విడుదల లేట్ అయ్యింది. ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ కాటసాని వ్యహరించారు. సంగీతం జేక్స్ బిజోయ్ అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ‘సత్యం’ రాజేష్, విద్యాసాగర్ జె వ్యవహరిస్తున్నారు.
Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?