Vishwak sen: విశ్వక్ సేన్ రియల్ లైఫ్ బ్రేకప్ స్టోరీ

విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

FOLLOW US: 

'వెళ్లిపోమాకే' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేశారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2019లో 'ఫలక్‌నుమాదాస్' చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, సహా నిర్మాతగా కూడా మారారు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఆ సినిమా విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత వచ్చిన 'హిట్' సినిమా హిట్టు కొట్టడంతో హీరోగా నిలబడ్డాడు విశ్వక్. ప్రస్తుతం మూడ్నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. 

ప్రస్తుతం ఈ హీరో నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విశ్వక్ సేన్. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే సమయంలో తన బ్రేకప్ స్టోరీను వెల్లడించారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేకప్ ఉంటుందని.. దాన్ని ఎవరూ తప్పించుకోలేదని.. తన లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ ఉందని అన్నారు. 

అంతకుమించి ఎక్కువ బ్రేకప్స్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించినట్లు చెప్పారు విశ్వక్ సేన్. కాలేజ్ లో మూడేళ్లపాటు చూశానని.. కానీ ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. కాలేజ్ అయిన తరువాత ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశామని.. అప్పటినుంచి క్లోజ్ అయ్యామని చెప్పారు. కానీ వారి జర్నీలో ఆ అమ్మాయి ఎప్పుడో బ్రేకప్ చెప్పేసింది.. ఆ విషయం తనకు ముప్పై రోజుల తరువాత అర్థమైందని తెలిపారు. 

ఆ బ్రేకప్ తరువాత చాలా ఎమోషనల్ అయ్యానని.. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని తెలిపారు విశ్వక్ సేన్. బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండా.. కాస్త జోష్ తో ఉన్న పాటలు పెట్టమని తనే దర్శకులకు చెబుతుంటానని తెలిపారు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ సాంగ్స్ బాగుంటాయని తెలిపారు.

View this post on Instagram
 
A post shared by Vishwak Sen (@vishwaksens)

Published at : 29 Apr 2022 04:45 PM (IST) Tags: Vishwak sen AshokaVanamlo Arjuna Kalyanam Vishwak sen Breakup story Vishwak sen Ashokavanamlo arjuna kalyanam

సంబంధిత కథనాలు

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం