Vishal: 'సామాన్యుడు' స్నీక్ పీక్.. యాక్షన్ సీన్ అదిరిపోయింది..
విశాల్ నటిస్తోన్న 'సామాన్యుడు' సినిమా నుంచి స్నీక్ పీక్ ను విడుదల చేశారు. ఇది సినిమాలో ఓ యాక్షన్ సీన్.
![Vishal: 'సామాన్యుడు' స్నీక్ పీక్.. యాక్షన్ సీన్ అదిరిపోయింది.. Vishal's Saamanyudu sneak peek Vishal: 'సామాన్యుడు' స్నీక్ పీక్.. యాక్షన్ సీన్ అదిరిపోయింది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/026b042f90602a21041e1ae8245c7536_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విశాల్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'సామాన్యుడు'. తు.ప.శరవణన్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ముందుగా ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. రీసెంట్ గా ఫిబ్రవరి 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి స్నీక్ పీక్ ను విడుదల చేశారు. ఇది సినిమాలో ఓ యాక్షన్ సీన్. మధు అనే వ్యక్తిని వెతుక్కుంటూ హీరో ఓ దాబాకు వెళ్తాడు. అక్కడ జరిగే ఓ యాక్షన్ సీన్ ను అభిమానులతో పంచుకున్నారు విశాల్. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు విశాల్. అందుకే వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
గత కొన్నేళ్లలో విశాల్ నటించిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఎనిమీ' సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇప్పుడు 'సామాన్యుడు'పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మాలిక్ స్టీమ్స్ కోపరేషన్ సంస్థ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పీఏ తులసి, రవీనా రవి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. విశాల్ నటిస్తున్న 31వ సినిమా ఇది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
View this post on Instagram
Sneak Peek from #Saamanyudu is out now.https://t.co/k92W0AlPnP#VVSFromFeb4th #SaamanyuduFromFeb4th #ObbaFromFeb4th pic.twitter.com/NdmMAumZEs
— Vishal (@VishalKOfficial) February 1, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)