NTR30: ఎన్టీఆర్-కొరటాల సినిమాలో లేడీ సూపర్ స్టార్?
చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) 'ఆర్ఆర్ఆర్' తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా మొదలవ్వాలి కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి కొరటాలకి మరింత సమయం ఇచ్చారు ఎన్టీఆర్.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ ఒకటి ఉందట. దానికోసం ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఆమెని కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె ఒప్పుకుందా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ రాలేదు.
చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పాత్ర నచ్చడం వలనే సినిమా చేశానని.. ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మరి ఆ రేంజ్ లో కొరటాల శివ.. విజయశాంతి కోసం క్యారెక్టర్ రాస్తే మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు అలియాభట్ ను అనుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాల వలన నో చెప్పింది. అప్పటినుంచి హీరోయిన్స్ కోసం చాలా ఆప్షన్స్ చూస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన హీరోయిన్స్ ను మళ్లీ రిపీట్ చేయడం కొరటాలకు ఇష్టం లేదు. టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..!
మరోపక్క 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాను కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట ఎన్టీఆర్. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తయితే.. కొరటాల శివ, బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ముందుగా కొరటాల శివ సినిమాను అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నారు. అక్టోబర్ నుంచి మూడు నెలల తరువాత అంటే 2023 ఆరంభంలో బుచ్చిబాబు సినిమా కూడా మొదలైపోతుంది.
అప్పటికి కొరటాల సినిమా కూడా సెట్స్ పై ఉంటుంది. అలా రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. మరోపక్క.. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిశారు. అతడితో కలిసి పని చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఎన్టీఆర్, వెట్రిమారన్ ఇద్దరికీ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.