(Source: Poll of Polls)
Captain Prabhakaran OTT: రెండు ఓటీటీ వేదికల్లో విజయకాంత్ 'కెప్టెన్ ప్రభాకరన్' - ఎందులో చూడొచ్చంటే?
Vijayakanth Death: విజయకాంత్ హీరోగా నటించిన వందో సినిమా 'కెప్టెన్ ప్రభాకరన్'. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Captain Prabhakaran OTT Platform: విజయకాంత్ (Vijayakanth)ను 'కెప్టెన్ విజయకాంత్' చేసిన సినిమా 'కెప్టెన్ ప్రభాకరన్'. తమిళంలో మాత్రమే కాదు... తెలుగులో కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ సినిమా ఏ ఓటీటీలో వేదికలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'కెప్టెన్...'
Captain Prabhakaran streaming on Prime Video: ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'కెప్టెన్ ప్రభాకరన్' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, ఆహా తమిళ ఓటీటీ వేదికలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. రెండు వేడుకల్లోనూ తమిళ భాషలో సినిమా అందుబాటులో ఉంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు సినిమా చూడవచ్చు.
Watch Captain Prabhakar movie: 'కెప్టెన్ ప్రభాకరన్'ను తెలుగులో 'కెప్టెన్ ప్రభాకర్' పేరుతో డబ్బింగ్ చేశారు. ఆ తెలుగు వెర్షన్ చూడాలంటే ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. డబ్బింగ్ సినిమా తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో చూడవచ్చు.
Also Read: విజయకాంత్ 'కెప్టెన్ ప్రభాకరన్' - బ్లాక్‌బస్టర్ వెనుక వివాదాలు, గాయాలు!
'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాకు ప్రముఖ నటి, ప్రస్తుత నగరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు రెండో సినిమా అది. హీరోతోనూ ఆయనకు అది రెండో సినిమా. విజయకాంత్ హీరోగా నటించిన 'పూలన్ విసారణై' సినిమాతో ఆర్కే సెల్వమణి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళంలో ప్రశాంత్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తదితరులతో సినిమాలు చేశారు.
'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాలో నటీనటులు ఎవరు?
Vijayakanth role in Captain Prabhakaran movie: 'కెప్టెన్ ప్రభాకరన్' సినిమాలో ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారిగా విజయకాంత్ నటించారు. మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సీనియర్ కథానాయకుడు, నటుడు శరత్ కుమార్, హీరోయిన్ రోజా ప్రేమికులుగా కనిపించారు. శరత్ కుమార్ సైతం ప్రభుత్వ అధికారి పాత్ర చేశారు.
Also Read: విప్లవ కళాకారుడి నుంచి 'కెప్టెన్ విజయకాంత్' కావడం వెనుక రోజా భర్త!
అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడంతో పాటు గిరిజన ప్రజలను భయపెట్టే వీరభద్రన్ (వీరప్పన్ స్ఫూర్తితో రూపొందించిన పాత్ర) పాత్రలో మన్సూర్ అలీ ఖాన్ నటించారు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయనకు... 'కెప్టెన్ ప్రభాకరన్' సినిమా తర్వాత నుంచి మేజర్ రోల్స్ రావడం మొదలైంది.
విజయకాంత్ మృతి పట్ల పలువురు తెలుగు హీరోలు తమ సంతాపం ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు ట్వీట్స్ చేశారు. వాళ్ళు ఏమన్నారో చూడండి.
Saddened to learn about Vijayakanth Garu's passing. A true powerhouse in both cinema and politics. May his soul find eternal peace. My thoughts are with his family and friends.
— Jr NTR (@tarak9999) December 28, 2023
Disheartening to know about the demise of #Vijayakanth Garu, May his family find solace in the memories of his impactful life 🙏
— Ravi Teja (@RaviTeja_offl) December 28, 2023