(Source: ECI/ABP News/ABP Majha)
Vijayakanth Profile: విప్లవ కళాకారుడు నుంచి 'కెప్టెన్ విజయకాంత్' కావడం వెనుక రోజా భర్త!
Captain Vijayakanth: కోలీవుడ్ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్ ఇకలేరు. హీరోగా 150కు పైగా సినిమాలు చేసిన ఆయనను 'కెప్టెన్' అని ఎందుకు అంటారు? ఆయనకు వారసులు ఎందరు? అనేది చూస్తే...
Vijayakanth Death: తమిళ చిత్రసీమలో సీనియర్ కథానాయకుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ గురువారం ఉదయం కన్ను మూశారు. అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. వెండితెరపై ఆయనది ఎంతో విజయవంతమైన ప్రస్థానం. తమిళనాడులో 150కు పైగా సినిమాలు చేసిన అతికొద్ది మంది హీరోలలో ఆయన ఒకరు. తమిళ ప్రేక్షకులు ఆయన్ను 'కెప్టెన్' అని పిలుస్తారు. అది ఎందుకో తెలుసా?
విజయకాంత్ 100 @ కెప్టెన్!
Which is the 100th film of Vijayakanth?: విజయకాంత్, ఆర్కే సెల్వమణి (రోజా భర్త)ది తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. సెల్వమణి దర్శకుడిగా పరిచయమైన 'పూలన్ విసారణై' సినిమాలో విజయకాంత్ హీరో. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి 'కెప్టెన్ ప్రభాకరన్' చేశారు. అది హీరోగా విజయకాంత్ 100వ సినిమా. దాని తర్వాత నుంచి విజయకాంత్ (Vijayakanth)ను తమిళ ప్రేక్షకులు అందరూ 'కెప్టెన్ విజయకాంత్' అని పిలవడం ప్రారంభించారు. అంతకు ముందు 'పురట్చి కలైంజర్' (విప్లవ కళాకారుడు) అని పిలిచేవారు.
What is Vijayakanth famous for?: కథానాయకుడిగా ఐదు దశాబ్దాల ప్రయాణంలో విజయకాంత్ కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేశారు. ఆయన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోనూ అనువాదం అయ్యాయి. ఎక్కువగా పోలీస్, దేశభక్తి కథాంశాలతో రూపొందిన సినిమాలు చేయడంతో ఆయనను విప్లవ చిత్రాల కథానాయకుడిగా, విప్లవ కళాకారుడిగా ప్రేక్షకులు చూసేవారు. విజయకాంత్ 20కు పైగా సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు.
విలన్ టు పోలీస్... విజయ్ తండ్రి సినిమాతో బ్రేక్!
Who Introduced Vijayakanth: 'ఇనిక్కుమ్ ఇలమై'తో విజయకాంత్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయనది విలన్ రోల్. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్ళు. ఆ తర్వాత హీరోగా మారారు. కెరీర్ ప్రారంభంలో తొలుత ఫ్లాప్స్ వచ్చినప్పటికీ... ప్రస్తుతం తమిళనాడులో స్టార్ హీరో, దళపతి విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరతు ఇడి ముళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తరై' సినిమాలతో బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
విజయకాంత్ వారసులు ఎంత మంది?
Vijayakanth family details: విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. చిత్రసీమలోకి వచ్చిన తర్వాత తన పేరును 'విజయకాంత్'గా మార్చుకున్నారు. ఆయనకు జనవరి 31, 1990లో వివాహం అయ్యింది. ఆయన భార్య పేరు ప్రేమలత. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
తండ్రి ఆఖరి సినిమాయే కొడుకు మొదటి సినిమా!
విజయకాంత్ నటించిన ఆఖరి సినిమా 'సప్తగం'. అందులో ఆయన అతిథి పాత్రలో మెరిశారు. ఆ సినిమాతో విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ సినిమాకు విజయకాంత్, ఆయన బావ కె.ఎల్. సుధీశ నిర్మాతలు. ఆ తర్వాత 'మధుర వీరన్' అని మరో సినిమా చేశారు షణ్ముగ పాండియన్.
విజయకాంత్ తన 50 ఏళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా 'విరుధగిరి'. అందులో 153వ సినిమా అది. నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. హీరోగా విజవంతమైన కెరీర్ తర్వాత ప్రజలకు సేవ చేయాలని 2005లో విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు. డీఎండీకే పార్టీ స్థాపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు (2006, 2011) విజయం సాధించారు. ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు.
Also Read: ‘యానిమల్’ తర్వాత ‘జమాల్ జమాలూ’ గర్ల్‌కు యమ క్రేజ్, ఇంతకీ ఈ క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?