Corporate Bookings: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?
Corporate Bookings: కార్పొరేట్ బుకింగ్స్ చేసి ఉంటే ‘యానిమల్’ వసూళ్లు రూ. 1000 కోట్లు దాటి ఉండేవని తాజాగా నిర్మాత ప్రణయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీశాయి.
![Corporate Bookings: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు? Bollywood stars and producers really making 100 Cr corporate bookings Corporate Bookings: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/27/340b9686ea63c93570e6591d2e6854e91703688299124239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Animal Movie Producer Pranay On Corporate Bookings: గత కొద్ది రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్పొరేట్ బుకింగ్స్ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ‘సలార్’ విషయంలోనూ ఈ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ‘సలార్’ మూవీ సుమారు రూ.50 కోట్లకు పైగా కార్పొరేట్ బుకింగ్స్ జరుపుకున్నట్లు విమర్శలు రావడం తీవ్ర చర్చకు కారణం అయ్యింది. అంతేకాదు, కార్పొరేట్ బుకింగ్స్ చేస్తే ‘యానిమల్’ వసూళ్లు రూ.1000 కోట్లు దాటేవని చెప్పడం కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ రూ.100 కోట్ల కార్పొరేట్ బుకింగ్స్ సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇంతకీ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటి?
స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాక, అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోతే ఆ సినిమాలో నటించిన హీరో, లేదంటే సదరు నిర్మాణ సంస్థ కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసి, సినిమా చూసే అవకాశం కల్పిస్తాయి. తమ సినిమాకు ఎక్కువ టికెట్లు అమ్ముడు అవుతున్నాయని ప్రకటిస్తాయి. ఫ్రీ టికెట్ తో సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా సదరు సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. అంటే కార్పొరేట్ బుకింగ్స్ చేసి వాళ్ల సినిమాను వాళ్లే ప్రమోట్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇదో ఫేక్ కలెక్షన్ స్కామ్ అనవచ్చు.
చర్చనీయాంశంగా నిర్మాత ప్రణయ్ వ్యాఖ్యలు
తాజాగా ‘యానిమల్’ దర్శకుడు ప్రణయ్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 900 కోట్ల వసూళ్లు సాధించింది. చాలా మంది ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని భావించారు. కానీ, ఈ సినిమా ఇంకా ఆ మార్క్ అందుకోలేకపోయింది. ఇదే విషయం పైన నిర్మాత స్పందించారు. “’యానిమల్’ మూవీ ఇప్పటి వరకు రూ. 900 కోట్లు సాధించింది. అయితే, 1000 కోట్లు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, ఆ అంచనాలు నిజం కాలేదు. మేం కార్పొరేట్ బుకింగ్స్ చేస్తే ఇప్పటికే ఈ సినిమా రూ.1000 కోట్లు దాటి ఉండేది. మా సినిమా నిజాయితీగా సాధించే వసూళ్ల గురించే మాట్లాడుకోవాలి. అనవసర ఆర్భాటాలు వద్దు అనుకున్నాం. అయినా స్టార్‌లకు నిజమైన క్రేజ్ ఉన్నప్పుడు కార్పొరేట్ బుకింగ్‌లు అవసరం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
‘సలార్’ విషయంలోనూ కార్పొరేట్ బుకింగ్స్ విమర్శలు
రీసెంట్ గా ‘సలార్’ విషయంలోనూ కార్పొరేట్ బుకింగ్స్ ఆరోపణలు వచ్చాయి. బుక్ మై షోలో ‘సలార్’ ఎర్లీ మార్నింగ్ షోలు హౌస్ పుల్ చూపించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. పీవీఆర్ ఐనాక్స్ లాంటి నేషనల్ మల్టీఫ్లెక్స్ చైన్లలో ఉదయం 6, 7 గంటల బుకింగ్స్ అన్ని ఫుల్ అయ్యాయి. దీంతో ‘సలార్’ టీమ్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తుందని సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డంకీ’ మూవీకి కూడా ఇలాగే చేశారనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బుక్ మై షోలో ఆ హాలు నిండినట్లు చూపించిందని, కానీ.. అదే స్క్రీన్‌కు ఆఫ్ లైన్ టికెట్ తీసుకొని వెళ్తే హాల్‌లో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: ‘డెవిల్‘ వివాదం - ఆ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డా, ఎప్పటికీ నేనే దర్శకుడిని: నవీన్ మేడారం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)