అన్వేషించండి

Naveen Medaram: ‘డెవిల్‘ వివాదం - ఆ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డా, ఎప్పటికీ నేనే దర్శకుడిని: నవీన్ మేడారం

Naveen Medaram: ‘డెవిల్’ మూవీ వివాదంపై దర్శకుడు నవీన్ మేడారం స్పందించారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్డపడినట్లు చెప్పారు. ఎవరు ఏం చెప్పినా, ఈ సినిమా దర్శకుడిని తానేనని వెల్లడించారు.

Naveen Medaram On Devil Movie: నందమూరి కల్యాణ్ రామ్ తాజా చిత్రం ‘డెవిల్’.అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రకటన సమయంలో దర్శకుడిగా నవీన్ మేడారం కొనసాగుతారని నిర్మాత అభిషేక్ నామా వెల్లడించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, అభిషేక్ నామా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. దర్శక నిర్మాత అభిషేక్ నామా అని ప్రచారం చేశారు. దీంతో ఈ సినిమా నుంచి నవీన్ మేడారంను తొలగించారని అందరికీ అర్థం అయ్యింది. ఆ తర్వాత నవీన్ మేడారం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ నుంచి తనను తప్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

‘డెవిల్’ నా బేబీ- నవీన్ మేడారం

త్వరలో ‘డెవిల్’ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నవీన్ మేడారం సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా కోసం తను పడ్డ కష్టాన్ని వివరించారు. “డెవిల్' సినిమాకు ప్రాణం పోసేందుకు మూడేళ్లుగా ఎంతో కష్డపడ్డాను. కాన్సెప్ట్, స్క్రిప్ట్‌,  స్క్రీన్‌ ప్లే నేనే డెవలప్ చేశాను. కాస్ట్యూమ్స్ నుంచి ఫ్యాబ్రిక్స్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. సెట్‌ నుంచి లొకేషన్ల వరకు నేనే దగ్గరుంచి పనులు పర్యవేక్షించాను.  సినిమాలోని ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాను. ‘డెవిల్‌’ని  స్వయగంగా రూపొందించాను. కారైకుడి, వైజాగ్‌, హైదరాబాద్‌ లోని లొకేషన్లలో (కొన్ని రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా) 105 రోజుల పాటు సినిమాని షూట్ చేశాను. నాకు ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు. నా బేబీ కూడా. ఎవరు ఏం చెప్పినా ఈ సినిమా దర్శకుడిని నేనే” అని చెప్పుకొచ్చారు.   

క్రెడిట్ ఇవ్వకపోవడం నిరాశ కలిగించింది- నవీన్

అటు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నా మౌనంగానే ఉన్నట్లు వెల్లడించారు నవీన్. “నేను సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నాను. ఈ రోజు ఎదురైన వివాదానికి అసలు కారణం అహం, దురాశ మాత్రమే. ఈ సినిమా విషయంలో నేను ఏ రకమైన చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. నా సొంత చిత్రంలో నాకు క్రెడిట్ ఇవ్వకపోవడం పల్ల చాలా నిరాశకు గురయ్యాను. అయినప్పటికీ నేను దిగులు చెందడం లేదు. నాకున్న అనుభవం, నైపుణ్యం, విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తాను. పట్టుదలగా నా కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాను. పట్టుదలతో మరింత బలంగా తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తాను” అని  నవీన్ తెలిపారు.

‘డెవిల్’ బ్లాక్ బస్టర్ అవుతుంది- నవీన్

అటు “నటుడు కల్యాణ్‌ రామ్ ఈ సినిమా కోసం 100% కష్టపడ్డారు. ఈ సినిమా కోసం నాతోపాటు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. 'డెవిల్' బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. డిసెంబర్ 29, 2023న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నేను ఒక కొత్త చిత్రానికి సంతకం చేశాను. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నాను. త్వరలో వివరాలను ప్రకటిస్తాను. ధన్యవాదాలు” అని నవీన్ మేడారం తెలిపారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాళవిక నాయర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1942లో జరిగిన పీరియాడిక్ కథగా ఈ మూవీ రూపొందింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naveen Medaram (@naveen_medaram)

టాప్ హెడ్ లైన్స్

Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget