అన్వేషించండి
Advertisement
Vijay Devarakonda: బ్రేకప్ అయింది.. బాధలో ఉన్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్..
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వ్యక్తికి రీసెంట్ గా బ్రేకప్ అయిందట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కాకుండా బాలీవుడ్ లో విజయ్ కి అభిమానులున్నారు. ఈ తరం యంగ్ హీరోల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదనే చెప్పాలి. 'గీత గోవిందం', 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలు విజయ్ రేంజ్ ని పెంచేశాయి. అలాంటి వ్యక్తికి రీసెంట్ గా బ్రేకప్ అయిందట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
ఈ సినిమాకి విజయ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దీంతో కొన్ని రోజులుగా 'పుష్పక విమానం' ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ పై ఈ సినిమాను ప్రమోట్ చేశారు. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో.. దేవరకొండ బ్రదర్స్ సరదాగా చాట్ లో పాల్గొన్నారు. 'పుష్పక విమానం', దేవరకొండ బ్రదర్స్ గురించి గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నాడా..? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నను ఆనంద్ దేవరకొండ చదివి వినిపించగా.. దానికి విజయ్ 'ఈ మధ్య నాకు ఒక హార్ట్‌బ్రేక్ జరిగింది. ఇప్పటివరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. అందుకే కొంచెం బాధలో ఉన్నా..' అంటూ చెప్పుకొచ్చాడు. మరో యూజర్ విజయ్ ఎప్పుడైనా టాటూ వేయించుకున్నాడా..? అని అడిగితే.. ఇప్పటివరకు అయితే వేయించుకోలేదని.. ఒకవేళ ఈరోజు నచ్చిందని వేయించుకున్నాక.. రేపు ఎప్పుడైనా నచ్చకపోతే.. అందుకే ఎప్పుడూ ట్రై చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఈ హీరో 'లైగర్' అనే సినిమాలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Your doubts
— Vijay Deverakonda (@TheDeverakonda) November 6, 2021
I clear..
The Deverakonda boys answer questions asked and searched about us - https://t.co/60Mh4Y3K73 #PushpakaVimanam - In Cinemas NOV 12..
Also Read: మంగళం శ్రీనుగా సునీల్.. రేపే ఇంట్రడక్షన్..
Also Read: బాలయ్య షోతో 'ఆహా'కి ఎన్ని బెనిఫిట్సో..
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion