By: ABP Desam | Updated at : 21 May 2023 11:21 AM (IST)
ఎన్టీఆర్ వందేళ్ల జయంతి వేడుకలు
భారత రత్న ఇవ్వకపోవడం బాధాకరం-మురళీ మోహన్
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం అని నటుడు, నిర్మాత మురళీ మోహన్ తెలిపారు. ఈ నెల 28(ఎన్టీఆర్ జయంతి)నాటికి అయినా కేంద్రం భారత రత్న ప్రకటించాలి అని కోరారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరి అభిమాన నటుడిగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. నటనలో ఆయనకు ఆయను సాటిగా అభివర్ణించారు. సినిమా పరిశ్రమలో తనను ఎన్టీఆర్ తమ్ముడిగా పిలిచేవారని చెప్పుకొచ్చారు.
క్రమశిక్షణ ఆయన దగ్గరే నేర్చుకున్నా- జయసుధ
ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు సీనియర్ నటి జయసుధ. ఆయనను చూసే క్రమశిక్షణను అలవర్చుకున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆఖరిచిత్రంలో నటించడం ఎప్పటికి గొప్ప అనుభూతిగా మిగిలిపోతుందన్నారు. . ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చీరస్థాయిగా నిలిచిన దేవుడని మరో సీనియర్ నటి జయప్రద వెల్లడించారు. శత జయంతి వేళ ఎన్టీఆర్ ని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వకపోవడం కుట్ర- ఆర్ నారాయణ మూర్తి
ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వకపోవడం కుట్ర అన్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి. భారత రత్న ఏ ఒక్కరి సొత్తు కాదన్న ఆయన, ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు అడిగినా ఇవ్వలేదన్నారు. రూ.100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ వేసరాని సంతోషించాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ కు భారత రత్నఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కలిసి కేంద్రాన్ని కోరాలన్నారు. కాలానికి ఎదురీదిన ధీరో దత్తుడు ఎన్టీఆర్ అన్నారు. ఫెడరల్ లక్షణాలు కాపాడుకోకునేందుకు పోరాడిన నేతగా చరిత్రలోకి ఎక్కారన్నారు. మద్రాసిలుగా ఉన్న మనల్ని తెలుగువారం అని సగర్వంగా చెప్పుకునేలా చేశారని నారాయణమూర్తి కొనియాడారు.
ఒక జాతి కథే ఆయన చరిత్ర- దగ్గుబాటి వెంకటేష్
ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు చేసిన సేవ ఎంతో గొప్పదని నటుడు దగ్గుబాటి వెంకటేష్ అన్నారు. శత జయంతి వేడుకల్లో ఆ మహనీయుడిని తలచుకునే అదృష్టం రావడం గొప్ప విషయం అన్నారు. భౌతికంగా మన మధ్యలేక పోయినా ఆయన ప్రజల గుండెల్లో వున్నారని చెప్పారు. నా భాష తెలుగు అని చెప్పినప్పుడు వుండే గర్వం పేరే ఎన్టీఆర్ అన్నారు. ఒక జాతి కథే ఆయన చరిత్ర అన్నారు. ఆయనతో నటించలేకపోవడం బాధాకరం అన్నారు.
ఎన్టీఆర్ స్వాగతాన్ని మర్చిపోలేను- శివరాజ్ కుమార్
చిన్నప్పుడు ఎన్టీఆర్ ను చూసేందుకు ఎంతో ప్రయత్నించానని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తెలిపారు. ఓసారి ఫిల్మ్ ఫెస్టివల్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి స్వయంగా అందరికి స్వాగతం పలకడం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. త్వరలో బాలకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలుగు చలన చిత్రకి ఎన్టీఆర్ ములస్థంభం- నాగ చైతన్య
తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్ మూలస్థంభం అన్నారు నటుడు నాగ చైతన్య. ఆయన నటన, వాక్కు అద్భుతం అన్నారు. ఎన్టీఆర్ గురించి తన తాన ఏఎన్నార్ ఎంతో గొప్పగా చెప్పేవారన్నారు. కళకు , భాషకు ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ని చూసి నటుడిని కావాలి అనుకున్నాను- అడవి శేష్.
చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలను చూసి నటుడిని కావాలి అనుకున్నట్లు అడవి శేష్ తెలిపారు. తాను చూసిన తొలి సినిమా ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’ అన్నారు. ఆయన సినిమాలు యువ నటులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అన్నారు.
ఎన్టీఆర్ చిరస్మరనీయుడు అన్నారు ప్రముఖ నిర్మాత అశ్విని దత్. ఆయన కాల్ షీట్స్ కోసం వెళ్తే తనను ఆశీర్వదించి, వైజయంతి మూవీస్ అని తమ బ్యానర్ కు పేరు పెట్టారని చెప్పుకొచ్చారు.
సినిమాల్లో చెప్పింది రాజకీయాల్లో చేసి చూపించారు- బోయపాటి శ్రీను
సోషల్ ఇంజనీరింగ్ చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఓటర్, నాయకుడు ఎలా ఉండాలో చెప్పిన నేత ఆయన అన్నారు. సినిమాల్లో చెప్పింది, రాజకీయాల్లో చేసి చూపించారన్నారు.
Read Also: బాబోయ్ దీపికా! మగాళ్లలో ఆ స్టామినా గురించి మరీ ఇంత పచ్చిగా చెప్పాలా?
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
The Kerala Story: కమల్ హాసన్ కామెంట్స్కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్
Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ
Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?
Brahmamudi May 29th: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!