అన్వేషించండి

Varun Sandesh: ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నా- ఆమె నాతో లేకుంటే ఏం చేసేవాడినో తెలియదు: వరుణ్ సందేశ్

యంగ్ హీరో వరుణ్ సందేశ్ తన స్ట్రగులింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ ను మలుపు తిప్పిన ‘హ్యాపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ లాంటి హిట్స్ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

Varun Sandesh Gets Emotional In Suma Adda Show, Watch Latest Promo: నటుడు వరుణ్ సందేశ్... ‘విరాజి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ‘సుమ అడ్డా’ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తన కెరీర్ గురించి, స్ట్రగులింగ్ పీరియడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ లాంటి హిట్స్ మళ్లీ రావాలని వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. “హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారులోకం’ నా కెరీర్ లోనే పీక్ హిట్స్. అలాంటి హిట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ సినిమాల మాదిరి సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాను. వితిక షేరు నా పక్కన లేకుంటే ఏం చేసేవాడినో నాకే తెలియదు” అని చెప్పారు. ఇక ‘జబర్దస్త్’ నూకరాజు షోలో చేసిన కామెడీ అందరినీ ఎంత గానో ఆకట్టుకుంది.  

వరుస సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్

‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించారు. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ మూవీ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. మధ్యలో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘నింద’ చిత్రం విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘విరాజి’ అనే సినిమా చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను నూతన దర్శకుడు ఆద్యంత్ హర్ష తెరకెక్కిస్తున్నారు. మహా మూవీస్, M3 మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు.   

‘విరాజి’ సినిమాలో వరుణ్ హిట్ కొట్టేనా?

రీసెంట్ గా విడుదలైన ‘విరాజి’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. వరుణ్ సందేశ్ కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా నిలువబోతోంది.  ఈ సినిమా వరుణ్ సందేశ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారబోతుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ కు వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. వరుణ్ కూడా ఈ సినిమా పైనే తన ఆశలు పెట్టుకున్నారు. ‘విరాజి’ మూవీతో పాటు ‘రాచరికం’ అనే సినిమాలోనూ నటిస్తున్నరు వరుణ్. ఈ సినిమాలో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

Read Also: వామ్మో.. ఈ బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ అన్నేసి కోట్లా? నీళ్లు దగ్గరపెట్టుకోండి.. కళ్లు తిరుగుతాయ్!

Also Read: నువ్వే జహీర్‌కు ఉత్తమైన భార్యవి - అత్తమామ మాటలకు ఎమోషనలైన సోనాక్షి సిన్హా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Embed widget