Bollywood Heroines Remuneration: వామ్మో.. ఈ బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ అన్నేసి కోట్లా? నీళ్లు దగ్గరపెట్టుకోండి.. కళ్లు తిరుగుతాయ్!
Bollywood Heroines Remuneration: బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతోమంది హీరోయిన్లు టాప్ స్థానం కోసం పోటీపడుతున్నారు. అందులో ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో మీరూ చూసేయండి.
Bollywood Heroines Remuneration: సౌత్ ఇండియాతో పోలిస్తే బాలీవుడ్ చాలా విధాలుగా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా అక్కడితో పోలిస్తే ఇక్కడ హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంటుంటారు. ఇక బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోతున్నవారి రెమ్యునరేషన్ ఎంత అనే విషయం తాజాగా బయటికొచ్చింది.
తాప్సీ
ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కూడా అతి తక్కువ రెమ్యునరేషన్‌ను అందుకుంటోంది తాప్సీ పన్ను. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాపులారిటీ అందుకున్న తాప్సీ.. ప్రస్తుతం ఒక సినిమాకు రూ.5 కోట్ల నుంచి 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
కంగనా రనౌత్
కాంట్రవర్సీల విషయంలో తాప్సీతో సమానంగా ఉండే మరొక బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా తాప్సీతో సమానంగా ఉంది భామ. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.5 కోట్ల నుంచి 8 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోదట ఈ భామ. సినిమాల విషయంలో ఫార్మ్‌లో లేకపోయినా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు కంగనా.
కియారా అద్వానీ
తాప్సీ, కంగనా లాగానే మరొక హీరోయిన్ కూడా ఒక్క సినిమాకు రూ.5 కోట్ల నుంచి 8 కోట్లు డిమాండ్ చేస్తోంది. తను మరెవరో కాదు.. కియారా అద్వానీ. బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా కియారా చేతిలో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రామ్ చరణ్‌తో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కృతి సనన్
స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్న హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. బాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోయిన్లలో ఒకరుగా మారింది కృతి. ఈ భామ ఒక్క సినిమా కోసం రూ.5 కోట్ల నుంచి 8 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా తన బ్యూటీతో అందరినీ కట్టిపడేస్తోంది కృతి సనన్.
శ్రద్ధా కపూర్
‘ఆషిఖీ 2’ చిత్రంతో ఫార్మ్‌లోకి వచ్చిన హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఆ తర్వాత నుంచి తను నటించిన దాదాపు ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గానే నిలిచింది. దీంతో ఇతర యంగ్ హీరోయిన్లతో పోలిస్తే శ్రద్ధా కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. తను ఒక్క సినిమా కోసం రూ.8 కోట్ల నుంచి 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.
కత్రినా కైఫ్
సీనియర్ హీరోయిన్ అయినా కూడా ఒక్క సినిమా కోసం రూ.8 కోట్ల నుంచి 10 కోట్లు మాత్రమే ఛార్జ్ చేస్తోందట కత్రినా కైఫ్. గత కొన్నేళ్లుగా కత్రినా సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. తను నుంచి కనీసం ఏడాదికి ఒక్క సినిమా కూడా రావడం లేదు. అయినా కూడా తన రెమ్యునరేషన్ ఎక్కువే అని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరీనా కపూర్
ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గని హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. తను ఇప్పటికీ ఒక్క సినిమా కోసం రూ.8 కోట్ల నుంచి 11 కోట్లు డిమాండ్ చేస్తూ రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గనంటోందట. అయినా కొందరు నిర్మాతలు కరీనా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
ఆలియా భట్
ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న హీరోయిన్ ఎవరు అంటే చాలామంది ఆలియా భట్ పేరే చెప్తారు. ఇక ఈ హీరోయిన్ ఒక్క సినిమాకు రూ.15 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. నేషనల్ అవార్డ్ సాధించిన హీరోయిన్‌గా ఆలియాకు ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలానే క్రేజ్ ఉంది.
దీపికా పదుకొనె
ఆన్ స్క్రీన్ సినిమాలు అయినా, ఆఫ్ స్క్రీన్ ఈవెంట్స్ అయినా దీపికా పదుకొనె ఉంటే ఆ మెరుపు వేరే లెవెల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి దీపికా.. బాలీవుడ్‌లో ఇతర హీరోయిన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌తో దూసుకుపోతోంది. తను ఒక్క సినిమాకు రూ.15 కోట్ల నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది.
Also Read: నువ్వే జహీర్‌కు ఉత్తమైన భార్యవి - అత్తమామ మాటలకు ఎమోషనలైన సోనాక్షి సిన్హా!