అన్వేషించండి

Sonakshi Sinha: నువ్వే జహీర్‌కు ఉత్తమైన భార్యవి - అత్తమామ మాటలకు ఎమోషనలైన సోనాక్షి సిన్హా! 

Sonakshi Sinha: భర్త జహీర్‌ ఇక్బాల్‌తో కలిసి మొదటిసారి ఇంటర్య్వూ ఇచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఈ సందర్భంగా లైవ్‌లోనే జహీర్‌ తల్లిదండ్రులు ఆడియో ప్లే చేసి ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

Zaheer Iqbal mother says Sonakshi Sinha is her daughter now : బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ జూన్‌ 23న పెళ్లి చేసుకుంది. అయితే ఈ కొత్త జంట మొదట్లో ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం జహీర్‌ ముస్లిం వర్గానికి చెందిన వాడు కావడం. హిందు అయిన సోనాక్షి ముస్లింను పెళ్లాడటాన్ని కొందరు వ్యతిరేకించారు. దీంతో సోనాక్షిని టార్గెట్‌ చేస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అయినా అవేవి పట్టించుకోకుండా సోనాక్షి-జహీర్‌లు తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సోనాక్షి-జహీర్‌లు గలాట్టా ఇండియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంటక సదరు మీడియా సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. జహీర్‌ ఇక్బాల్‌ తల్లిదండ్రులు తమ కోడలు సోనాక్షి గురించి మాట్లాడిన ఆడియోను లైవ్‌లో ప్లే చేశారు. అది చూసి సోనాక్షి ఆశ్చర్యపోయింది. అంతేకాదు తన అత్తమ్మ మాటాలకు ఎమోషనల్‌ అయ్యి కన్నీరు పెట్టుకుంది. 

జహీర్ కు ఉత్తమైన భార్య నువ్వే

ఈ ఆడియో క్లిప్‌లో జహీర్ తల్లి మాట్లాడుతూ.. "హే సోనా (సోనాక్షి)! నీతో ఒకటి చెప్పాలి. నువ్వు మాకు కోడలు కాదు. కూతురిలా. ఇప్పుడ నిన్ను మా కూతురిగా పొందినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. నువ్వు మాపై ఎంతో (జహీర్‌ తల్లిదండ్రులు) చూపిస్తున్న ప్రేమ, గౌరవం చూపిస్తున్నావు. నీ లాంటి కోడలు మాకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వు, జహీర్‌లు అన్యోన్యంగా కలిసి ఉండటం చూసినప్పుడల్లా మీరు ఒకరి కోసమే ఒకరు పుట్టారు అనిపిస్తుంది. నీ హృదయం బంగారం. ఇక నేను జహీర్ గురించి ఏ మాత్రం చింతించను. ఎందుకంటే జహీర్‌కు నీ కంటే ఉత్తమమైన భార్య ఇంకేవరు లేరు. నువ్వే అతడికి సరైన భాగస్వామి.

దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి" అని సోనాక్షి గురించి చెప్పుకొచ్చింది. ఇక తన అత్తమామల మాటలకు సోనాక్షి ఎమోషనల్‌ అయ్యింది. వారు తనపై చూపించిన ప్రేమ, నమ్మకానికి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఇదే ఇంటర్య్వూలో తమ వెడ్డింగ్‌ ప్లాన్‌పై ప్రశ్న ఎదురైంది. ఇందుకు జహీర్ స్పందిస్తూ.. నిజానికి నేను పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఇద్దరం ఏదైనా దేశానికి వెళ్లి చేసుకుని తిరిగి రావాలనుకున్నాం" అని చెప్పాడు. ఇక భర్త మాటలకు మధ్యలో కలుగజేసుకుని సోనాక్షి ఇలా చెప్పుకొచ్చింది. ఇతర దేశాల్లో పెళ్లి చేసుకుంటే అది ఇండియాలో చెల్లదని, అదే లాస్‌ వెగాస్‌లో పెళ్లి చేసుకుంటే అదీ భారత్‌లో చెల్లదంటూ చెప్పుకొచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)

Also Read: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు - ఆమె పచ్చి తాగుబోతు.. పదేళ్లు మాకు నరకం చూపించింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget