అన్వేషించండి

Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ

Telangana Handloom: తెలంగాణలో చేనేత కార్మికుల కోసం నిర్దేశించిన అభ‌య‌హ‌స్తం ప‌థ‌కానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏ పథకానికి ఎంత కేటాయించారో కూడా స్పష్టం చేసింది.

Telangana News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ ప్రారంభోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు మాట ఇచ్చారు. 2024, సెప్టెంబ‌రు 9న‌ నేతన్న స‌మ‌గ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అందిస్తామని చెప్పారు. అన్నట్టుగానే దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ప్రభుత్వం అందించింది. తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు సంబంధించిన మార్గ దర్శకాలను ప్రకిటంచింది. ఈ మేరకు 10 జ‌న‌వ‌రి 2025న జీవో జారీ చేసింది. 

2024-25 ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు ఉన్న నిధులు ప్రకటించింది. తెలంగాణ నేత‌న్న పొదుపు (త్రిఫ్ట్ ఫండ్‌)- రూ.15 కోట్లు కేటాయించింది. ప‌వ‌ర్‌లూమ్స్, బ‌కాయిల‌కు-రూ.15 కోట్లుగా చెప్పింది. తెలంగాణ నేత‌న్న భద్రత అంటే నేత‌న్న బీమా -రూ.5.25 కోట్లని వెల్లడించింది. తెలంగాణ నేత‌న్న భరోసాకు రూ.31 కోట్లు, వేత‌న ప్రోత్సాహాకాలు-రూ.31 కోట్లుగా వెల్లడించింది. 

తెలంగాణ నేత‌న్న పొదుపు పథకం

తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం కింద సంక్షేమ కార్యక్రమాలకి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ నేత‌న్న పొదుపు పథకం జియో-ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి  రూపొందించింది. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించి సామాజిక భద్రత క‌ల్పిస్తుంది. 

చేనేత కార్మికులు/అనుబంధ కార్మికులు వారి వేత‌నాల నుంచి దీనికి నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూష‌న్‌ చేస్తారు. కాంట్రిబ్యూష‌న్ గరిష్ట  పరిమితి రూ.1200. దీనికి ప్రభుత్వం రెండింతలు అధికంగా అంటే 16 శాతం అందిస్తుంది. దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి జరగనుంది. ఈ పథకం 15 వేల మంది మ‌ర మ‌గ్గాల (ప‌వ‌ర్ లూమ్‌) కార్మికులకూ వ‌ర్తిస్తుంది. మ‌ర మ‌గ్గాల కార్మికులు తమ వేతనం నుంచి నెలవారీగా 8 శాతం జమ చేస్తారు. వారి గరిష్ట పరిమితి రూ.1200. ప్రభుత్వం వారి కాంట్రిబ్యూష‌న్‌కు స‌మానంగా 8 శాతం కాంట్రిబ్యూష‌న్ చేస్తుంది. రికరింగ్ డిపాజిట్ వ్యవధి మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు త‌గ్గింది. 

తెలంగాణ నేత‌న్న భద్రత (నేత‌న్న బీమా) 
తెలంగాణ నేత భ‌ద్ర‌త ప‌థ‌కం  రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మ‌ర మ‌గ్గాల  కార్మికులు, అనుబంధ కార్మికుల‌కు వ‌ర్తిస్తుంది. ఇక్కడ న‌మోదైన కార్మికుడు ఏ కార‌ణం చేత మృతి చెందితే రూ. 5 లక్షల నామినీకి అందుతుంది. తెలంగాణ చేనేత కార్మికుల స‌హ‌కార సంఘం ద్వారా బీమా క‌వ‌రేజీ అంద‌రికీ వ‌ర్తిస్తుంది. ఈ ప‌థ‌కంలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న 65 ఏళ్ల గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి కూడా వ‌ర్తిస్తుంది. ఈ పథకం అమ‌లుకు ఏడాదికి బ‌డ్జెట్ అంచ‌నా వ్యయం రూ.9 కోట్లుగా నిర్దారించారు. 

తెలంగాణ నేతన్నకు భ‌రోసా– మార్కెట్ అభివృద్ధి 
నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం...ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం  ఏమిటంటే జియో ట్యాగ్ అయిన మ‌గ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి పరిమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గ‌రిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికుల‌కు రూ.6 వేలు వేత‌న స‌హాయం అందిస్తారు. దీంతో కార్మికుల‌కు వేతన మద్దతు లభించడంతో నాణ్యత పెరుగుతుంది. ఈ ప‌థ‌కం అమ‌లుకు వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.44 కోట్లు కేటాయించారు. 

తెలంగాణ చేనేత మార్క్ లేబుల్
చేనేత‌, సిల్క్ మార్క్ మాదిరే ప్రత్యేక లోగో ద్వారా తెలంగాణ‌కు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందిస్తారు. దేశ‌, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులను లేబుల్ బ్రాండింగ్ చేయ‌డం దీని లక్ష్యం. తెలంగాణ చేనేత వ‌స్త్రాల వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టను పెంపొందించాలని భావిస్తున్నారు. చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, స‌ముచితమైన మార్కెట్‌ను సృష్టించ‌డం జరుగుతుంది. తెలంగాణ చేనేత కార్మికుల జీవ‌నోపాధి, సంక్షేమం, అభివృద్దికి మద్దతుగా నిలవచ్చు. పోటీని  త‌ట్టుకునేలా తెలంగాణ చేనేత పరిశ్రమ సంప్రదాయ నైపుణ్యాలు,ప‌నిత‌నాన్ని సంరక్షించి కొనసాగించే వీలుంటుంది.  

లేబుల్ ద్వారా  తెలంగాణ చేనేత ఉత్పత్తులకు సమ‌ష్టి గుర్తింపును అందినట్టు అవుతుంది. తెలంగాణలో చేతితో నేసిన ఉత్పత్తుల ద్వారా కార్మికుల పనితనం ప్రచారంలోకి వచ్చికొనుగోలుదారులకు ప్రామాణికత, నాణ్యతప‌ర‌మైన హామీ లభిస్తుంది. ఉత్పత్తి ప్రత్యేకత చెప్పడంతో సృజనాత్మక హస్తకళల‌ ముఖ్య లక్షణంగా గుర్తింపు దొరుకుతుంది. ఇది పోటీదారుల నుంచి వేరు చేసి వినియోగ‌దారుల‌తో అనుసంధానం చేస్తుంది. 

ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం చేనేత‌, జౌళి శాఖ  డైరెక్టరేట్ ద్వారా అమ‌ల‌వుతుంది. ప్రత్యేకమైన లోగా ద్వారా "తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్"  రూపకల్పన చేశారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌కు ప్రత్యేకంగా రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు. జియో ట్యాగ్‌తో అనుసంధాన‌మైన మ‌గ్గాల‌న్నీ వాటంత‌ట‌వే రిజిస్టర్ అవుతాయి. ఇలా రిజిస్టర్ అయిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ మాత్రమే. కొత్త మ‌గ్గాల విషయంలో తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ న‌మోదుకు ఆన్‌సైట్ వెరిఫికేష‌న్ చేస్తారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లను ఆయా జిల్లాల అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు (ఏడీ) స‌ర‌ఫ‌రా చేస్తారు. దీనికి వార్షిక బ‌డ్జెట్ రూ.4 కోట్లు కేటాయించారు. 

లేబుల్‌లో ఏముంటుందంటే....
లేబుల్ ఒక వైపు తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌తోపాటు 9 అంకెల నంబ‌ర్ ఉంటుంది. అందులో మొద‌టి రెండు అంకెలు ఆ జిల్లా/ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కోడ్‌ను చెబుతాయి. త‌ర్వాత రెండు అంకెలు సంవత్సరాన్ని తెలియ‌జేస్తాయి. త‌ర్వాత అయిదు అంకెలు ర‌న్నింగ్ సీరియ‌ల్ నెంబ‌ర్ తెలియ‌జేస్తాయి. లేబుల్ మ‌రోవైపు కార్మికుడు, ఉత్ప‌త్తి వివ‌రాలు ఉంటాయి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget