Tollywood: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!
ఈ వారం మరికొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
గత వారం విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇక ఈ వారం మరికొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
విక్రాంత్ రోణ: కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'.- జూలై 28న (Vikrant Rona On July 28th, 2022) ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
View this post on Instagram
ది లెజెండ్: ప్రముఖ వాణిజ్యవేత్త, శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ది లెంజెడ్'. జూలై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజున సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో మాత్రమే కాదు... కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది.
రామారావు ఆన్ డ్యూటీ:
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో శరత్ మండవ టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
ఏక్ విలన్ రిటర్న్స్:
అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'ఏక్ విలన్ రిటర్న్స్'. ఈ సినిమాను జూలై 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఓటీటీ రిలీజెస్:
రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్:
మాధవన్ (Madhavan) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్' (Rocketry Movie). ఈ సినిమా నిర్మాతల్లోనూ మాధవన్ ఒకరు. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూలై 26 నుంచి (Rocketry The Nambi Effect Movie OTT Release Date) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
ది బ్యాట్ మ్యాన్: హాలీవుడ్ సినిమా 'ది బ్యాట్ మ్యాన్' జూలై 27 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.
గుడ్ లక్ జెర్రీ:
జాన్వీకపూర్ కపూర్ నటించిన ఈ సినిమా జూలై 29 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
షికారు: ఈ సినిమాను జూలై 29 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
View this post on Instagram
పేపర్ రాకెట్: ఈ సినిమాను జూలై 29 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
777 చార్లీ: (కన్నడ వెర్షన్)
కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం '777 చార్లీ'. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ప్రతి భాషలోనూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. జూన్ 10న విడుదలైన సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. జూలై 29 నుంచి వూట్ యాప్ లో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.
View this post on Instagram
19 (1) (ఎ):
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన ఈ మలయాళ సినిమా జూలై 29 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్
Also Read: 'లెక్క' తప్పిన జాన్వి- ఆడేసుకుంటున్న నెటిజన్స్, పాపం అడ్డంగా బుక్కైపోయింది
View this post on Instagram