News
News
X

Janhvi Kapoor: 'లెక్క' తప్పిన జాన్వి- ఆడేసుకుంటున్న నెటిజన్స్, పాపం అడ్డంగా బుక్కైపోయింది

జాన్వీ కపూర్ ను మరోసారి నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

FOLLOW US: 

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ ని నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. గణితం గురించి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ నటించిన చిత్రం గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ గణితం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా ట్రోలింగ్ కి గురైంది. తనకి మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదని చెప్తూ అల్జీబ్రాని కాలిక్యులేటర్ మీద చేయవచ్చని చెప్పింది. ఇంకేముంది దాన్ని నెటిజన్లు పట్టేశారు. నీ ఐక్యూ ఇదేనా తల్లి అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

స్కూల్ ల్లో చదివేటప్పుడు మీకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టమని ఒకరు అడిగారు. అందుకు జాన్వీ జవాబిస్తూ 'చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక సబ్జెక్టు అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు. అదే మ్యాథ్స్. కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు చెయ్యడం బాగా సులువైంది. కానీ ఎందుకో చాలా మంది మాత్రం లెక్కలు చేసేందుకు తెగ తంటాలు పడతారు. కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు చెయ్యడం బాగా ఈజీ అయిపోయింది. ఇక అల్జీబ్రాతో ఏం పని? చరిత, లిటరేచర్ మనిషిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. కానీ లెక్కల వల్ల ఆలోచన కుంచించుకుపోతుంది' అని చెప్పుకొచ్చింది. ఇంకేముంది లెక్కల గురించి ఇంత దారుణంగా మాట్లాడినందుకు నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. గణితం గురించి జాన్వీకి ఉన్న తెలివి తేటలు ఇంతేనా అని ట్రోలింగ్ చేస్తున్నారు. జాన్వీ ట్రోలింగ్ బారిన పడటం ఇదేమి ఫస్ట్ టైం కాదండోయ్. గతంలో పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు తన వస్త్రధారణ బాగోలేదంటూ ట్రోలింగ్ చేశారు. పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా తెలియదా అంటూ కామెంట్లు పెట్టారు. 

'మీరు మాట్లాడింది చూస్తే మీకు గణితంలో జీరో నాలెడ్జ్ అని అర్థం అవుతుంది'..  'కాలిక్యులేటర్ మీద ఆల్జీబ్రా చెయ్యొచ్చా? వావ్ వాట్ ఏ ఐక్యూ' అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్రైమ్ కామెడీతో తెరకెక్కిన 'గుడ్ లక్ జెర్రీ' సినిమా జులై 29 న విడుదల కానుంది. ప్రస్తుతం జాన్వీ వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ లో ఉంది. అలాగే ఆమె రాజ్ కుమార్ రావ్‌తో కలిసి 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'లో కూడా నటించబోతోంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి రూహి సినిమాలో జంటగా కనిపించారు.

Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్

Published at : 26 Jul 2022 12:44 PM (IST) Tags: Janhvi Kapoor Good Luck Jerry Movie Good Luck Jerry Movie Promotions Janhvi Kapoor Trolling

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల