Unstoppable With NBK Promo: అదిరిపోయే డ్యాన్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, ‘యానిమల్’ టీమ్ తో బాలయ్య రచ్చ
Unstoppable With NBK Promo: నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్’ టాక్ షోలో ‘యానిమల్’ టీమ్ ఓ రేంజిలో సందడి చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది.
Unstoppable with NBK Animal Movie Special Episode: 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అంటూ ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నారు నందమూరి నటసింహం బాలయ్య. ఆయన హోస్టు చేస్తున్న ఈ షోలో తాజా ‘యానిమల్’ టీమ్ సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పటికే ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్ కు సంబంధించి ‘ఆహా’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 24న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.
సందీప్ ను తన బ్రాండ్ లోకి మారాలన్న బాలయ్య
ఈ ప్రోమోలో బాలయ్య, రణబీర్ కపూర్, రష్మిక చేసిన సందడి ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. బాలయ్య పాపులర్ డైలాగ్స్ రణబీర్ కపూర్ గుక్కతిప్పుకోకుండా చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక నటసింహం పాటలకు ఆయన చేసిన డ్యాన్స్ వారెవ్వా అనిపించింది. సుమారు మూడు నిమిషాల పాటు ఉన్న ఈ ప్రోమో ఫుల్ ఫన్ గా కొనసాగింది. ప్రోమో స్టార్టింగ్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్టేజి మీదకు వస్తారు. ఈ సందర్భంగా “ఎప్పుడైనా మందు తీసుకుంటావా?” అని బాలయ్య అడుగుతారు. “ఎప్పుడో ఒకసారి సాయంత్ర విస్కీ తీసుకుంటాను” అని సమాధానం చెప్తారు. “విస్కీ వదిలేసి మా బ్రాండ్(మెన్షన్ హౌస్)కు వచ్చేయవయ్యా, తొందరగా రాయడం మొదలు పెడతావు” అనగానే అందరూ నవ్వుతారు. ఒక్కో దర్శకుడి గురించి ఒక్కో మాట చెప్పాలని బాలయ్య సందీప్ ను అడుగుతారు. బోయపాటి శ్రీను అనగానే, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గుడిలో ఉంటుందని చెప్తారు. త్రివిక్రమ్ గురించి అడగ్గానే ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిస్తారు.
బాలయ్య షోలో రణబీర్, రష్మిక సందడి
ఆ తర్వాత రణబీర్ కపూర్ స్టేజి మీదకు ఎంట్రీ ఇస్తారు. వచ్చీ రావడంతోనే బాలయ్య పాపులర్ డైలాగ్ “ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు” అని చెప్పడంతో ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఇక బాలయ్య, రణబీర్ కలిసి చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుంది. ఆ తర్వాత రష్మికను స్టేజి మీదికి పిలుస్తూ బాలయ్య చెప్పిన మాటలు అందరినీ అలరిస్తాయి. “నా మనసు బ్యాలెన్స్ లో లేదిక, ఎందుకో మైండ్ అంతా తికమక. వచ్చేయమ్మా రష్మిక” అంటూ రష్మికను స్టేజి మీదికి ఆహ్వానిస్తారు బాలయ్య. రాగానే ఆమెకు గులాబీ ఇచ్చి, స్టెప్పులు వేస్తారు. “రష్మిక డ్యాన్స్ చేస్తూ మెలికలు తిరుగుతుంటే నా గుండె మెలికలు తిరుగుంది” అనడంతో అందరూ నవ్వుతారు. ‘పుష్ప 2‘ కాకుండా ఇంకా ఏమైనా సినిమాలు చేస్తున్నావా? అని అడుగుతారు బాలయ్య. ‘ఛావా‘ అనే హిందీ సినిమా, ‘గర్ల్ ఫ్రెండ్‘ అనే తెలుగు సినిమా చేస్తున్నట్లు చెప్తుంది. ఈ సినిమాలు చేస్తున్నట్లు దర్శకుడు సుకుమార్ కు తెలుసా? అని అడుగుతారు. తను తెలిసే చేస్తున్నాని సమాధానం ఇస్తుంది.
రణబీర్ డైలాగ్ కు బాలయ్య ఫిదా
ఇక విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ ఫోటోలను చూపించి ఇద్దరిలో ఎవరు బాగున్నారు? అని అడుగుతారు బాలయ్య. సమాధానం చెప్పలేక నవ్వుతుంది రష్మిక. ఆ తర్వాత ‘పైసా వసూల్‘ సాంగ్ కు బాలయ్య, రణబీర్, రష్మిక కలిసి చేసిన డ్యాన్స్ అందరిలో ఫుల్ ఎనర్జీ నింపుతుంది. చివరగా ‘డు నాట్ ట్రబుల్ ద ట్రబుల్‘ అనే డైలాగ్ ను రణ్ బీర్ గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో బాలయ్య ఆశ్చర్యపోతారు. ‘యానిమల్’ టీమ్ కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.
Read Also: గ్లామర్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నా, నటి శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్