Unstoppable Pawan Kalyan: ‘నేను ఓడిపోవడానికైనా సిద్ధం కానీ...’ - పవర్ స్టార్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది!
అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గ్లింప్స్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను ఆహా విడుదల చేసింది. ఇందులో కేవలం ఒకట్రెండు ప్రశ్నలను మాత్రమే రివీల్ చేశారు. ‘నన్ను బాలా అనే పిలవాలి.’ అని బాలకృష్ణ అన్నప్పుడు ‘నేను ఓడిపోవడానికైనా సిద్ధం కానీ అలా పిలవడానికి...’ అని పవన్ కళ్యాణ్ అంటుండగా కట్ చేశారు.
‘మీ అన్నయ్య చిరంజీవిలో నీకు నచ్చిన, నచ్చని క్వాలిటీస్ ఏంటి?’ అని కూడా బాలయ్య అడిగారు. కానీ దాని ఆన్సర్ రివీల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయాలనుకున్నప్పుడు తన వదినతో మాట్లాడిన మూమెంట్స్‌ను కూడా పవర్ స్టార్ రివీల్ చేశారు. ఆ సమయంలో తన వదినతో కాల్ మాట్లాడాను అని చెప్పారు. అయితే ఏం మాట్లాడారో మాత్రం రివీల్ చేయలేదు.
ఈ మధ్య రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ విమర్శల తీవ్రతను పెంచడంపై కూడా బాలయ్య ఒక ప్రశ్న అడిగారు. ఈ మధ్య వాడి, వేడి డబుల్ ఇంపాక్ట్ అయిందని బాలకృష్ణ అనగా... దానికి పవన్ కళ్యాణ్ కామెడీగా ‘లేదండీ.. నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండీ.’ అన్నారు.
రాష్ట్రంలో నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ ప్రేమ ఓట్ల రూపంలో ఎందుకు కనిపించడం లేదు అని కూడా బాలకృష్ణ అడిగారు. ‘మేం బ్యాడ్ బాయ్స్ 1 2 3 4 5 6 7 8 9 10.’ అని బాలకృష్ణ చెప్పడంతో ఈ గ్లింప్స్ ముగిసింది. ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో ఇంకా తెలపలేదు. అయితే అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కు ఇది ఆఖరి ఎపిసోడ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
గ్లింప్స్‌ను బట్టి చూస్తే కొన్ని వివాదాస్పద విషయాలను కూడా బాలయ్య బాబు టచ్ చేసినట్లు అనిపించింది. మరి ఎపిసోడ్‌లో ఇవి ఎంతవరకు ఉంటాయో చూడాలి. ఈ సీజన్‌లో ప్రభాస్ ఎపిసోడ్ ఇప్పటికే స్ట్రీమ్ అవుతుంది. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు ముక్కలు చేస్తారా లేదా ఒక్కటే పార్ట్ రానుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
ఈ సీజన్‌లో ప్రభాస్ ఎపిసోడ్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంటర్వ్యూ మొదటి పార్ట్ డిసెంబర్ 29వ తేదీన, రెండో భాగం జనవరి 6వ తేదీన వచ్చింది. ఇందులో ప్రభాస్‌తో పాటు గోపిచంద్ కూడా పాల్గొన్నారు. ప్రభాస్ ఎపిసోడ్ మొదటి పార్ట్ విడుదల అయినప్పుడు కాసేపు ఆహా సర్వర్ కూడా క్రాష్ అయింది. మరి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కు ఏం జరుగుతుంతో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ షోలో సోలోగానే కనిపిస్తున్నారు. ఆయనతో పాటు రూమర్స్‌లో వినిపించినట్లు డైరెక్టర్ క్రిష్ కానీ, త్రివిక్రమ్ కానీ లేరు.
రెండు సీజన్లు పూర్తి అయిపోయాక కూడా ఇంకా అన్‌స్టాపబుల్‌కు రాని సెలబ్రిటీలో ఎంతో మంది ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ ఇలా లిస్ట్ పెద్దదే ఉంది. వీరిని తర్వాతి సీజన్లకు పిలుస్తారేమో చూడాలి.