Pawan Kalyan Balakrishna : ఆ గొడవ లేదన్న బాలకృష్ణ, అలా కష్టమన్న పవన్ కళ్యాణ్
Unstoppable PSPk Episode 2 Highlights : 'అన్‌స్టాపబుల్ 2' షోకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అటెండ్ అయ్యారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా ఆయన చెప్పారు.
![Pawan Kalyan Balakrishna : ఆ గొడవ లేదన్న బాలకృష్ణ, అలా కష్టమన్న పవన్ కళ్యాణ్ Unstoppable 2 Final Episode Highlights, Director Krish explains Difference Between Pawan Kalyan Balakrishna Acting Styles Pawan Kalyan Balakrishna : ఆ గొడవ లేదన్న బాలకృష్ణ, అలా కష్టమన్న పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/4996361a5c76aaaacc4bfd72a3ca3cb51675960817275313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... తెలుగులో బలమైన అభిమానం, రాజకీయ నేపథ్యం ఉన్న ఇద్దరు అగ్ర కథానాయకులతోనూ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) పని చేశారు. వాళ్ళిద్దరితో కలిసి 'అన్‌స్టాపబుల్ 2' పవర్ ఫైనల్ ఎపిసోడ్ పార్ట్ 2లో సందడి చేశారు.
బాలకృష్ణ, పవన్...
డిఫరెన్స్ ఏంటి?
''ఇప్పుడు మా ఇద్దరితో పని చేశావ్ కదమ్మా! డిఫరెన్స్ ఏంటి?'' అని బాలకృష్ణ ప్రశ్న వేయగా... ''సార్! బేసిగ్గా మీరు ఇద్దరూ కంప్లీట్ డిఫరెంట్. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. దర్శకుడిగా డిఫరెన్స్ ఏమిటో చెప్పాలంటే... మీరు (బాలకృష్ణ) కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ మెథడ్ యాక్టర్. గూగుల్ లో మెథడ్ యాక్టర్ అని సెర్చ్ చేస్తే ఏం ఏం వస్తాయో... పవన్ కళ్యాణ్ గారిలో అవి అన్నీ ఉన్నాయి. ఎప్పుడూ క్యారెక్టర్ మూడ్ లో ఉంటారు. ఆయనకూ అలా ఉండటం చాలా కష్టమే'' అని క్రిష్ జాగర్లమూడి సమాధానం ఇచ్చారు.
పవన్ కోసమే ఎక్కువ కెమెరాలు!
Pawan Kalyan Style Of Shooting : పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ లో, ఆ మూడ్ లో ఉన్నప్పుడు కొన్ని షాట్స్ తీసుకోవాలని ఎక్కువ కెమెరాలు ఉపయోగిస్తామని క్రిష్ తెలిపారు. మెథడ్ యాక్టింగ్ కి అపోజిట్ క్లాసికల్ యాక్టింగ్ అని... గూగుల్ లో క్లాసికల్ యాక్టింగ్ అని టైప్ చేస్తే బాలకృష్ణ అని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ ఇంప్రవైజ్ చేస్తారు!
దర్శకుడు చెప్పిన దానికి, స్క్రిప్టులో రాసిన దానికి బాలకృష్ణ ఇంప్రవైజ్ చేస్తారని క్రిష్ చెప్పుకొచ్చారు. ''నేను షాట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని చాలా సార్లు చూశా. కట్ చెప్పిన తర్వాత కత్తిని గాల్లో ఎగరేసుకుంటూ వస్తారు. డిస్కో డ్యాన్స్ చేస్తూ వెళతారు. యాక్టింగ్ విషయానికి వస్తే... మీరు (బాలకృష్ణ), పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫరెంట్. దర్శకులు అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి'' అని క్రిష్ వివరించారు.
Also Read : 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?
క్రిష్ మాట్లాడిన తర్వాత ''ఎప్పుడూ సీరియస్ గా ఉండాలి. క్యారెక్టర్ మూడ్ లో ఆ విధంగా ఉండాలి... నాకు ఆ గొడవ లేదు'' అని బాలకృష్ణ అంటే... వెంటనే ''చాలా కష్టం సార్! అందరికీ అలా కుదరదు'' అని పవన్ కళ్యాణ్ అందుకున్నారు. ''నాకు అలా సెట్ అయ్యిందమ్మా'' అని బాలకృష్ణ ఆ సంభాషణకు ముగింపు పలికారు.
త్రివిక్రమ్ తప్పించుకున్నారు!
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్యలో కూర్చుంటే ఒక సింహం, ఒక పులి మధ్య కూర్చున్నట్టు ఉందని క్రిష్ కామెంట్ చేశారు. అంతే కాదు... త్రివిక్రమ్ ఎందుకు తప్పించుకున్నారో తనకు ఇప్పుడు అర్థమైందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
సమరసింహారెడ్డి... తొలిప్రేమ...
బ్యానర్లు కట్టాను! - క్రిష్ జాగర్లమూడి
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్... తాను ఇద్దరికీ అభిమానిని అని క్రిష్ తెలిపారు. అంతే కాదు... 'సమర సింహా రెడ్డి', 'తొలి ప్రేమ' సినిమాలు విడుదలైనప్పుడు బ్యానర్లు కట్టానని వివరించారు. టాక్ షోలో స్టేజి మీద కాసేపు కూర్చున్న తర్వాత అభిమానుల మధ్యకు వెళ్ళి కూర్చున్నారు. తనపై ఒకరి అభిమాని అని ముద్ర వేయవద్దని చెప్పారు.
Also Read : తొమ్మిదేళ్ళ క్యాన్సర్ పేషెంట్‌ను కలిసిన రామ్ చరణ్ - ధైర్యమే కాదు, బహుమతి కూడా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)