News
News
X

Shiva Vedha Movie Review - 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?

Shiva Rajkumar's Vedha Review 2023 Telugu Movie : కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన 125వ సినిమా 'వేద'. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : వేద
రేటింగ్ : 3/5
నటీనటులు : శివ రాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, భరత్ సాగర్, శ్వేతా చంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్, వీణా పొన్నప్ప తదితరులు
ఛాయాగ్రహణం : స్వామి జె. గౌడ 
సంగీతం : అర్జున్ జన్యా
నిర్మాత : గీతా శివ రాజ్ కుమార్, జీ స్టూడియోస్
విడుదల (తెలుగులో) : ఎంవిఆర్ కృష్ణ
రచన, దర్శకత్వం : హర్ష
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2023

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా నటించిన 125వ సినిమా 'వేద' (Shiva Vedha Movie). కన్నడలో గత ఏడాది డిసెంబర్ 23న విడుదలైంది. తెలుగులో ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ఎంవిఆర్ కృష్ణ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది? (Vedha Telugu Review) 

కథ (Vedha Movie Story) : వేద (శివ రాజ కుమార్) కుమార్తె కనక (అదితి సాగర్)  జైలు నుంచి విడుదల అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చంద్రగిరిలో పోలీస్  అధికారి రుద్ర (భరత్ సాగర్)ను అత్యంత కిరాతకంగా చంపేస్తారు. మర్డర్ వేద, కనక చేశారని మరో మహిళా పోలీస్ అధికారి రమా (వీణా పొన్నప్ప)కి తెలుసు. రుద్రను హత్య చేశాక... మరో నలుగురిని చంపేస్తారు. అత్యంత కిరాతకంగా తండ్రీ కూతుళ్ళు మారణకాండ ఎందుకు సాగించారు? వేద గతం ఏమిటి? కనక ఎందుకు జైలుకు వెళ్ళి వచ్చింది? వేద భార్య పుష్ప (గానవి లక్ష్మణ్) ఏమైంది? వేద, అతని కుమార్తెకు సహాయం చేస్తున్న వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తున్న వేశ్య (శ్వేతా చంగప్ప) ఎవరు? చివరకు వేద, కనక తెలుసుకున్న నిజం ఏమిటి? ఎందుకు మహిళా పోలీస్ అధికారి వీళ్ళను అడ్డుకోకుండా చంపే స్వేచ్ఛ ఇచ్చింది? అనేది సినిమాలో చూడాలి. 

విశ్లేషణ : యాక్షన్ వెనుక ఎమోషన్ ఎంత బలంగా ఉంటే... ఫైట్ చేసేటప్పుడు థియేటర్లలో ప్రేక్షకులకు అంత హై వస్తుంది. యాక్షన్ సీన్ ఎలివేట్ అవుతుంది. హీరో ఫైట్ చేసినా... హీరోయిన్ ఫైట్ చేసినా... అందులో మార్పు ఉండదు. ఆ విషయాన్ని 'వేద' మరోసారి బలంగా చెబుతుంది. 

'వేద' కథా నేపథ్యం అంతా 1985, 1965లలో ఉంటుంది. అయితే... ఈ కాలంలోనూ మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యను బలంగా చెప్పారు. అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు ధైర్యంగా ఉండాలని, భయపడకూడదని సందేశం ఇస్తుంది. 'వేద' ప్రారంభం బావుంది. ఎందుకు చంపుతున్నారు? అని చిన్న ఆసక్తి కూడా ఉంటుంది. అయితే... మధ్య మధ్యలో వచ్చే హీరో హీరోయిన్ ట్రాక్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. అందులో కన్నడ ఫ్లేవర్ ఎక్కువ అయ్యింది. దానికి తోడు ఆ కామెడీ కూడా మనకు కనెక్ట్ కాదు. ఇంటర్వెల్ ముందు ఫైట్, క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మధ్యలో గానవి లక్ష్మణ్ చేసే ఫైట్ కూడా!

'వేద' ప్రచార చిత్రాలు చూసినా... సినిమా చూసినా... 'కెజియఫ్' ప్రభావం బలంగా కనబడుతుంది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, లైటింగ్ విషయంలో 'కెజియఫ్' ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అయితే... శివన్నను స్వామి జె. గౌడ కొత్తగా చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో స్లో మోషన్ షాట్స్ సూపర్. ఎడిటింగ్ బావుంది. సంగీతంలోనూ 'కెజియఫ్' ఛాయలు ఉన్నాయి. సేమ్ మ్యూజిక్ కొట్టలేదు. కానీ, ఎలివేషన్స్ ఇచ్చే విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అర్జున్ జన్యా రీ రికార్డింగ్ వల్ల కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యాయి. నేపథ్య సంగీతంలో ఉపయోగించిన పాటలు కూడా బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. 

నటీనటులు ఎలా చేశారంటే? : నటుడిగా, కథానాయకుడిగా 125 సినిమాల శివ రాజ్ కుమార్ అనుభవం 'వేద' పాత్రలో కనిపించింది. ఇటువంటి యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ రోల్స్ ఆయన ఇంతకు ముందు చేశారు. మరోసారి పాత్రకు ప్రాణం పోశారు. 'వేద'కు సినిమాకు వస్తే ఆయనలో గొప్పదనం ఏమిటంటే... ఫైట్స్ అన్నీ తాను ఒక్కడినే చేయాలని అనుకోలేదు. హీరోయిజంతో పాటు షీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశం ఇచ్చారు. గానవి లక్ష్మణ్, అదితి సాగర్... ఇద్దరూ ఫైట్స్ చేశారు. వాళ్ళు చేసిన ఫైట్స్ 'హై' ఇస్తాయి. ఫైట్స్ చేసేటప్పుడు వాళ్ళ నటన కూడా బావుంది. మిగతా క్యారెక్టర్లలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ. ఆల్మోస్ట్ అంతా కన్నడ యాక్టర్లు ఉన్నారు. 

Also Read : 'సువర్ణ సుందరి' రివ్యూ : 'అరుంధతి' తరహా సోషియో ఫాంటసీ, సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే? : 'వేద' ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్... రెండూ ఉన్నాయి. మెసేజ్ కూడా ఉంది. 'కెజియఫ్'లో మదర్ ఎమోషన్ అయితే... 'వేద'లో వైఫ్ & డాటర్ ఎమోషన్. ఇందులో హీరోయిజం మాత్రమే కాదు... షీరోయిజం ఉంది. శివన్నతో పాటు గానవి లక్ష్మణ్, అదితి సాగర్ చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయి. కన్నడ ఫ్లేవర్, ఫ్యామిలీ సీన్స్ పక్కన పెడితే సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.  

Also Read : 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Published at : 09 Feb 2023 02:22 PM (IST) Tags: Shiva Rajkumar ABPDesamReview Vedha Telugu Review Vedha Movie Review  Ganavi Laxman

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?