By: ABP Desam | Updated at : 09 Feb 2023 08:56 PM (IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొమ్మిదేళ్ళ చిన్నారిని కలిశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ స్పర్శ్ హాస్పిస్ ఆసుపత్రికి వెళ్ళారు. తాను చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ... ఆ ఆస్పత్రిలోని తొమ్మిదేళ్ళ బాలుడిని కలిశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
తొమ్మిదేళ్ళ మణి కుశాల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆ చిన్నారికి రామ్ చరణ్ అంటే అభిమానం. స్పర్శ్ హాస్పిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణి కుశాల్... తన ఫెవరేట్ హీరోను చూడాలని ఆశ పడ్డాడు. తన మనసులో కోరికను వెల్లడించారు. ఆ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న చరణ్, చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ... వీలు చేసుకుని మణి కుశాల్ దగ్గరకు వెళ్ళారు. అతనికి ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు ఓ బహుమతిని కూడా ఇచ్చారు. చరణ్ స్వయంగా రావడంతో మణి కుశాల్ సంతోషం వ్యక్తం చేశారు. అతడి ఆనందానికి అవధులు లేవు.
Through #MakeaWishFoundation our #ManOfMasses Mega Power Star @AlwaysRamCharan garu met a 9yr old kid ailing from cancer. The kid’s wish of meeting his favourite star was fulfilled with the actor spending quality time with him. #ManOfMassesRamCharan #Ramcharan pic.twitter.com/vAPMAl9VdV
— SivaCherry (@sivacherry9) February 9, 2023
RC 15 song shoot at Hyderabad Old City : ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం పాతబస్తీలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ మీద పాట తెరకెక్కిస్తున్నారు. పాతబస్తీలో చిత్రీకరణ పూర్తి చేసుకుని కర్నూల్, రాజమండ్రి, విశాఖలో కూడా చిత్రీకరణ చేస్తారని తెలిసింది.
ఐఏఎస్ అధికారిగా...
ముఖ్యమంత్రి అభ్యర్థి!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్. జూన్ నెలాఖరుకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానుందట.
Also Read : పేరు చివర తోక కత్తిరించిన 'భీమ్లా నాయక్' భామ
ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ కథానాయిక. మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
Also Read : 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంతో రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ శంకర్ సినిమాతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు. శంకర్ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చర్చల దశలో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉందని సమాచారం. 'మళ్ళీ రావా', 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా అనుకున్నా క్యాన్సిల్ అవుతుంది.
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు