News
News
వీడియోలు ఆటలు
X

Samyuktha : పేరు చివర తోక కత్తిరించిన 'భీమ్లా నాయక్' భామ

'భీమ్లా నాయక్' సినిమాలో రానా జోడీగా నటించిన అమ్మాయి గుర్తు ఉన్నారా? ఇప్పుడు ధనుష్ 'సార్'లో కథానాయిక. తన పేరు చివర ఆమె కులం తోక కత్తిరించారు.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన ' భీమ్లా నాయక్' సినిమా గుర్తు ఉందా? అందులో రానా దగ్గుబాటికి జోడీగా నటించిన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) గుర్తు ఉన్నారా? ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ మూవీ 'బింబిసార'లో ఎస్సై వైజయంతి పాత్రలో కనిపించారు. త్వరలో రానున్న ధనుష్ 'సార్' సినిమాలోనూ ఆమె కథానాయిక. ఇప్పుడు ఓ బోల్డ్ డెసిషన్ ద్వారా సంయుక్త చిత్రసీమ వర్గాల్లో నిలిచారు. తన పేరు చివర తోకను ఆమె కత్తిరించారు.
 
మీనన్ కాదు... జస్ట్ సంయుక్త!
Samyuktha removes Menon surname : సంయుక్తా మీనన్ కాదు... తన పేరు జస్ట్ సంయుక్త అని అందాల భామ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా పేరు చివర 'మీనన్'ను తొలగించారు. కారణం ఏమిటి? అని అడిగితే ''నా పేరులో నుంచి మీనన్ తీసేయాలనే ఆలోచన నాకు చాలా రోజుల క్రితమే వచ్చింది. పేరు చివర తోకలు ఎందుకు తగిలించుకుంటారు? అనేది నాకు అర్థం కాదు. నటి అయ్యాక నాలో ఈ ఆలోచన మరింత పెరిగింది. కథానాయికగా నాకంటూ బాధ్యత ఉంటుంది. అందుకని, ఇంటి పేరు ఉండకూడదని తీసేశా'' అని సంయుక్త పేర్కొన్నారు. మీనన్ అనేది కేరళలోని నాయర్ కమ్యూనిటీకి చెందినది. తన పేరు చివర కులం ఉండకూడదని సంయుక్త కోరుకోవడం కూడా 'మీనన్' తొలగించడానికి ఒక కారణం. 

విడాకులు తీసుకోవడంతో తల్లి కూడా...
సంయుక్త తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తండ్రి ఇంటి పేరు వద్దని అనుకోవడం మరో కారణం. ''సమాజంలో మానవత్వం, సమానత్వం, ప్రేమ చూడాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి అప్పుడు ఇంటి పేరు ఉంచుకోవడం నా ఆలోచనలు, వ్యక్తిత్వానికి విరుద్ధం కదా! దానికి తోడు నా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో... తండ్రి ఇంటి పేరు వద్దని మా అమ్మ కోరుకుంది. అమ్మ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని కూడా నేను భావించా'' అని సంయుక్త తెలిపారు. 

Also Read : ప్రభాస్ ప్రేమ గోల - హీరోయిన్లు ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయట?

'సార్' కాకుండా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా 'విరూపాక్ష' సినిమాలోనూ సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. 'సార్' విషయానికి వస్తే... అందులో ఆమె టీజర్ రోల్ చేశారు. ధనుష్ జోడీగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణంలో 'సార్' సినిమా రూపొందింది. ఇది తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. 

Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్! 

'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ 'సార్' సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా... నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌.

Published at : 09 Feb 2023 09:24 AM (IST) Tags: Samyuktha Menon Samyuktha Dhaush Sir Heroine Bheemla Nayak Beauty

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి