Trinayani December 15th Episode: 'త్రినయని' సీరియల్: తిలోత్తమకు మల్లెపువ్వుల గండం, టెన్షన్ పడుతున్న నయని!
Trinayani Today Episode: మల్లెపువ్వుల ద్వారానే తిలోత్తమ రక్తం చిందుతుందని తెలుసుకున్న నయని ఆ ప్రమాదాన్ని ఎలా తప్పించాలని టెన్షన్ పడుతుండటంతో కథలో క్యూరియాసిటీ ఏర్పడుతుంది
Trinayani Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎంతైనా తిలోత్తమా అత్తయ్య అదృష్టవంతురాలు అంటుంది హాసిని. ఎందుకు అని అడుగుతుంది తిలోత్తమ.
హాసిని: ఎందుకంటారు ఏంటి ఆ పూల కుండీ మీ నెత్తి మీద పడి మీ నెత్తికి కట్టు కడితే రేపు మీ పెళ్లి రోజున కట్టుకుని చీరకి మీ కట్టుకి మ్యాచ్ అవ్వదు అంటుంది.
ఆమెని కోప్పడుతుంది తిలోత్తమ.
విశాల్: పూల కుండీ మీద పడకముందు ఏదో పడిందని వచ్చారు కదా ఏం పడింది అని అడుగుతాడు.
పూల కుండీనే అంటాడు హాసిని భర్త. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.
తిలోత్తమ : వాడో పిచ్చోడు ఏం మాట్లాడుతాడో వాడికే తెలియదు అంటుంది.
ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తుంటే టాపిక్ మార్చడం కోసం ముందు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లండి అంటుంది సుమన.
విక్రాంత్: అంత పెద్ద దెబ్బ ఏమి తగలలేదులే.
నయని: అప్పుడే అయిపోలేదు ప్రమాదం ఇంకా ముందుంది అని చెప్పటంతో అందరూ మరింత కంగారు పడతారు.
విశాలాక్షి: ముందు రేపు మీ అత్తయ్య పెళ్లిరోజు కార్యక్రమాలు కానివ్వండి అని చెప్పి విశాల్ తో గుడికి వెళ్లి ఈ అవతారం చాలించి వస్తాను అని చెప్పి గుడికి బయలుదేరుతుంది.
ఆ తర్వాత భార్యకి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటాడు విక్రాంత్.
సుమన : నా మీద ఇంకేదైనా పడితే ఊరుకునేదాన్ని కానీ ఆ పూల కుండీ పడటమే విచిత్రంగా ఉంది అంటుంది.
విక్రాంత్: ఇందులో వింత ఏముంది.
సుమన: అది విశాలాక్షి మీద పడాల్సింది, అయినా ఆ పిల్ల మనిషి కాదేమో అని అనుమానంగా ఉంది అంటుంది.
విక్రాంత్: ఏం మాట్లాడుతున్నావ్
సుమన: మీరు కొట్టినా,తిట్టినా నేను నిజమే చెప్తాను అంటూ జరిగిందంతా చెప్తుంది.
విక్రాంత్: ఆ మాటలు విని నమ్మకుండా రెస్ట్ తీసుకో నొప్పి తగ్గిపోతుంది.
సుమన : పూల కుండీ నేనే పడేసానంటే నమ్మరేంటి అంటుంది.
విక్రాంత్: ఆ మాటలు కామెడీగా తీసుకొని నీ బుర్రలో ఉండే గుజ్జు కాస్త నుజ్జయిపోయిందని నాకు అర్థమైంది రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తరువాత సుమన బుర్ర ఎలా బద్దలైందని ఆలోచిస్తూ ఉంటారు తిలోత్తమ, హాసిని భర్త. అప్పుడే అక్కడికి హాసిని వస్తుంది.
హాసిని: మీరు గాని అత్తయ్య గాని నాకు ఒక సహాయం చేసి పెట్టాలి.. కుక్కలకి చపాతీలు చేసి పెడితే చాలా మంచిదట మన కుక్కకి పెడితే తినటం లేదు అందుకే మీరు తింటారని తీసుకు వచ్చాను అంటుంది.
ఆ మాటలకి తల్లీ కొడుకులు ఇద్దరు కోప్పడతారు, ఏమన్నావ్ అంటూ భర్త చెయ్యెత్తేసరికి అక్కడి నుంచి పారిపోతుంది హాసిని.
మరోవైపు నయని స్వామి దగ్గరికి వెళ్లి ఆపద ఎవరికి వస్తుంది అని తెలుసు కానీ ఎవరి వల్ల వస్తుందో తెలియటం లేదు అందుకే మీ దగ్గరికి వచ్చాను అంటుంది.
స్వామి: ఇదంతా నీ భర్త వల్లే జరుగుతుంది అని చెప్పటంతో షాక్ అవుతుంది నయని. రేపు ఆమె పెళ్లి రోజు ఆమె చావుని సూచిస్తుంది. ఎలా అడ్డుకుంటావో ఆలోచించు. భగవంతుడి మీద భారం ఉంచు అని చెప్పటంతో బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నయని.
ఆ తర్వాత హాసిని తిలోత్తమ వాళ్ళ దగ్గరికి వస్తుంది త్వరగా కేక్ కట్ చేసేస్తే అయిపోతుంది లేకపోతే చావడానికి కూడా పనికి రాకుండా పోతారని దిగులుగా ఉంది అంటుంది.
హాసిని భర్త: సుభమా అని పెళ్లిరోజు చేసుకోబోతుంటే చావు గురించి మాట్లాడతావ్ ఏంటి అని భార్యని కోప్పడతాడు.
అప్పుడు హాసిని చావబోయిది ఎవరో కాదు మీ అమ్మే చెప్పటంతో ఆమెని కోప్పడతారు తల్లి కొడుకులు. హాసిని అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత అలా చెప్తే నేను డి గ్లామరైజ్డ్ గా తయారవుతానని దాని ఫీలింగ్ కానీ నేను తగ్గను కదా అంటుంది తిలోత్తమ.
ఆ తర్వాత నయని దగ్గరికి విక్రాంత్ ని తీసుకువస్తుంది డమ్మక్క.
విక్రాంత్ : ఏంటి వదిన నాతో ఏదో మాట్లాడాలి అన్నారంట.
నయని: నువ్వు నీ భార్యకి మల్లెపూలు తీసుకురాలేదు కదా, మల్లెపూల వల్లే రక్తం చిందుతుందని నాకు కనిపించింది అని చెప్పటంతో విక్రాంత్ వాళ్లు షాక్ అవుతారు.
సుమన : ముక్కు ముఖం తెలియని వాళ్ళని కూడా కాపాడే మా అక్క ఇంట్లో వాళ్ళని ఎలా కాపాడుతుందో
అని చూస్తున్నాను అంటుంది.
విక్రాంత్ : ఆపద ఎవరికో ఇంకా వదినకి తెలియలేనట్లుగా ఉంది.
డమ్మక్క: ఆమెకి కాదు ముందు నీకు తెలిస్తే ఏమైపోతావో ఆలోచించుకో అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : స్వప్నను కాపాడిన అపర్ణ - రాజ్‌కు షాక్ ఇచ్చిన శ్వేత