Trinayani Serial Today September 3rd: 'త్రినయని' సీరియల్: పంచకమణి కోసం పయనమవనున్న నయని.. విశాల్ కోసం నయని ప్రాణ త్యాగం చేస్తుందా!
Trinayani Today Episode పౌర్ణమి గడియలు రావడంతో విశాల్ చేతిని నయం చేయడానికి నయని మణికాంత ప్రాంతానికి పయనం అవడానికి రెడీ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode విక్రాంత్ మీద మీదకు సుమన వెళ్తే విక్రాంత్ సుమనను పట్టించుకోడు. దాంతో సుమన డిసప్పాయింట్ అయిపోతుంది భర్తని తిట్టుకుంటుంది. మరోవైపు విశాల్ హాల్‌లో కాఫీ తాగుతుంటే వల్లభ, తిలోత్తమ అక్కడికి వస్తారు. విశాల్ ముందు వల్లభ ఫైల్ విసిరి కొట్టి త్వరగా కానివ్వు అంటాడు. అలా విసిరేస్తే విశాల్‌కు ఏం తెలుస్తుందని తిలోత్తమ అంటుంది.
విశాల్: ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోమని హాసిని వదినకు చెప్పాం కదా అన్నయ్య.
వల్లభ: క్యాన్సిల్ చేసుకుంటే మా ఆవిడకు రూ 20 కోట్ల నష్టం వస్తుంది.
విశాల్: ప్రోసీడ్ అవుదాం అనుకుంటే కుడి చేతితో సంతకం పెట్టలేను కదా.
తిలోత్తమ: వేలి ముద్ర వేసేయ్ నాన్న.
వల్లభ: మేం పేరు రాసుకుంటాం.
నయని: చెప్పు తెగుద్ది.
విశాల్: నయని ఏంటి ఆ మాటలు.
నయని: మీరు ఉండండి బాబుగారు. కుడి చేతితో కనీసం మంచి నీరు కూడా తాగలేని పరిస్థితిలో మీరు ఉంటే ఈయన గారి భార్య బిజినెస్ చూసుకోవాలి అంట. ఆ డీల్ ఓకే చేస్తే కదా నష్టం వచ్చేది.
వల్లభ: వదిలేస్తే హాసినికి నష్టం వచ్చినట్లే కదా.
నయని: నేను కాబట్టి చెప్పుతో కొడతా అన్నా అదే వదిన అయితే ఏం చేస్తుందో తెలీదు.
విశాల్: హాసిని వదిని మాతో కలిసి బిజినెస్ చేయడం ఓకే కానీ తను లేనప్పుడు ఇలా డీల్ గురించి మాట్లాడం కరెక్ట్ కాదు.
నయని: అసలు వీళ్ల కోసం మనం ఎందుకు ఫేవర్ చేయాలి. మిమల్ని పెంచిన అమ్మకి 270 కోట్లు ఉన్నాయి కదా కేవలం 20 కోట్ల కోసం ఆశ పడటం ఏంటి.
తిలోత్తమ: నా కోడలికి లాభం వస్తే అది నా కొడుకుకి వస్తున్నట్లే కదా.
విశాల్: అమ్మా నేను నీ కొడుకునే కదా.
నయని: అయినా మీరు ఎప్పుడూ మీ అమ్మతోనే ఉంటారు కదా హాసిని అక్కకి తోడు ఉండరు కదా..
విశాల్: హాసిని వదిన మా పార్టనర్ కదా తను లేకుండా సంతకాలు పెట్టం.
ఇంట్లోని హాల్లో పెట్టిన పెట్టె నుంచి కాంతి వస్తుంది అది చూసి దురంధర భయంతో పెద్దగా అరుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఇక దురంధర అందరికీ పెట్టె నుంచి వస్తున్న కాంతి చూపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. నయని దగ్గరకు వెళ్తుంది. అత్యుత్సాహంతో వల్లభ పెట్టెను పట్టుకోవడంతో వల్లభకు షాక్ కొడుతుంది. నయని ఆ పెట్టెను తీసుకోవడంతో వల్లభ షాక్ నుంచి బయట పడతాడు. అదంతా కాంతి పర్వం అని నయని అంటుంది. కాంతి పర్వం అని ఎందుకు అన్నావని నయనిని తిలోత్తమ ప్రశ్నిస్తుంది.
నయని: ఇవాళ ఉదయం తిథి మారి పౌర్ణమి వస్తుందని సంకేతంగా ఇలా కాంతి వచ్చింది.
హాసిని: అంటే మణికాంత ప్రాంతానికి వెళ్లే సమయం వచ్చిందని అన్నమాట.
నయని: అవును అక్క అక్కడున్న మానసాదేవి ఆలయానికి వెళ్లి పంచమమణిని తీసుకు వస్తే బాబుగారి ఆరోగ్యం కుదుట పడుతుంది.
సుమన: నీ చేతిలో తీసుకొచ్చి ఆ పచ్చిక మణిని బావగారి చేతిలో పెడితే చేయి మాత్రమే బాగు పడుతుంది. అదే వజ్రాలు వైఢూర్యాలు తెస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు. ఒక్క సారి ఆలోచించు.
దురంధర: నీ ముఖం మండ డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా.
సుమన: ఇప్పుడు బావగారి చేయి బాగు కాకపోయినా బిజినెస్ ఏం ఆగిపోదు. ఇంకా ఆస్తులు పెంచుకునే అవకాశం సద్వినియోగం చేసుకోండి అని సలహా ఇస్తున్నా.
హాసిని: నీ బోడి సలహాతో వచ్చేదేం లేదు.
విశాల్: నిజానికి నయని వెళ్లడం కూడా నాకు ఇష్టం లేదు. పెళ్లి అయినప్పటి నుంచి మన కోసం ఎన్నో చేసింది ఇప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లలు ఏమైపోతారా అని భయంగా ఉంది.
నయని: నేను ఆ పంచకమణిని తీసుకురాగలను అని రాసి పెట్టుఉందని నమ్ముతున్నాను.
హాసిని: అయితే మీ అమ్మకి అక్కడికి వెళ్లమని చెప్పండి.
దురంధర: అవును వదిన నువ్వు ఎలాగూ సర్పదీవికి వెళ్లావు కదా.
తిలోత్తమ: మణికాంత ప్రాంతానికి వెళ్లడం అంటే మృత్యువుతో దాగుడు మూతలు ఆడటమే. తన భర్త కోసం నయని వెళ్లక తప్పదు. విశాల్ చేయి పడిపోకపోయి ఉంటే వెళ్లే అవకాశమే లేదు కదా.
దురంధర: ఎవరో కుట్రతో ఇదంతా చేసినట్లు అనిపిస్తుంది.
హాసిని: నాకు అలాగే అనిపిస్తుంది.
నయని: ముందు స్వామీజీ వారిని కలిసి వారి ఆశీర్వాదంతో వెళ్తాను.
విశాల్: నయని మళ్లీ చెప్తున్నా నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు.
నయని విశాల్‌తో చెప్పి రాత్రికే బయల్దేరుతున్నానని అంటుంది. విశాల్ కూడా వస్తాను అంటే పిల్లల కోసం ఎవరో ఒకరు బతకాలి అని నయని అంటుంది. తొమ్మిది గంటల్లో బయటకు వచ్చేయాలని తెల్లారి లోపు బయటకు వచ్చేయాలి అని నయని అంటుంది. దానికి విశాల్ మన ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు ఉండలేరని అంటాడు. నయని ఇంటికి రాకపోయినా పంచకమణి అయినా ఇంటికి వస్తుందని నయని అంటుంది. విశాల్ ఎంత చెప్పినా నయని వినదు. తనని నమ్మమని తన లక్ష్యాన్ని చేరుకునేలా తనకి అండగా ఉండమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.