అన్వేషించండి

Trinayani Serial Today September 27th: 'త్రినయని' సీరియల్: భుజంగమణి దక్కించుకున్న నయని, నయమైన విశాల్ చేయి.. అప్పటి వరకు గడువు!

Trinayani Today Episode విశాల్‌, నయనిలు భుజంగమణి దక్కించుకొని క్షేమంగా ఇంటికి రావడం సుమన, తిలోత్తమ భుజంగమణి కోసం ప్లాన్స్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today September 10th Episode నయని, విశాల్‌, గాయత్రీ పాపలు మణికాంత గిరిలోని మానసా దేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నీటి దీపం చివరకు వచ్చిందని ఆ దీపం వెలిగితేనే భుజంగమణి దొరుకుతుందని మాటలు వినిపిస్తాయి. ఆ సారి దీపం వెలిగించాలంటే చాలా కష్టమని వాయిస్ వినిపిస్తుంది. మానసా దేవి ధరించిన 7 మణుల్లో ఒక జ్వాలామణి ఉందని దాన్ని తాకితే దీపం వెలుగుతుందని అంటుంది. అయితే మూడు అవకాశాలే ఉన్నాయని ఆ మణిని గుర్తించకపోతే ముగ్గురి ప్రాణాలు పోతాయని వినిపిస్తుంది. 

మానసాదేవి విగ్రహం చాలా పెద్దగా ఉండటం అక్కడికి చేరుకొని మణి చూడటం కష్టమని నయని ఏడుస్తుంది. ఇంతలో చిలుక శివ అక్కడికి వస్తుంది. జ్వాలా మణి గురించి నయని చిలుకకు చెప్తుంది. ఆ మణి నేను తాకుతానని ఏ మణి తాకాలో మీరే చెప్పండని చిలుక అంటుంది. నయని చెప్తుంది చిలుక శివ మణిని తాకుతుంటుంది. మొదటి రెండు మణులను తాకగా దీపం వెలగదు. చివరి అవకాశం అని నయని ఏడుస్తుంది. అది పోతే ఇక ముగ్గురి ప్రాణాలు పోతాయని చాలా ఏడుస్తుంది. మరణం ఖాయం అని విశాల్ అంటాడు. ప్రయత్నించింది నేను కాబట్టి ఆ శిక్ష నాకే అని నేను పిట్టని కాబట్టి ఉంటే ఎంత పోతే ఎంత అని చిలుక అంటుంది. దాంతో నయని, విశాల్ ఇద్దరూ ఏ మణి తాకాలో చెప్పలేకపోతారు. శివని లి చేయడం ఇష్టం లేదని ఏడుస్తారు. 

ఇంతలో గాయత్రీ పాప మానసాదేవి అమ్మవారి ఎడమ చేతికి ఉన్న మణిని తాకమని చూపిస్తుంది. విశాల్ మనసులో మా అమ్మ జ్వాలా మణిని చూపించిందని అనుకుంటాడు. చిలుక శివ ఆ మణిని తాకగానే మొత్తం వెలుగులు మయం అవుతుంది. నీటి దీపం పెద్దగా వెలిగి మొత్తం కాంతి వస్తుంది. నయని, విశాల్, చిలుక అందరూ చాలా సంతోషిస్తారు. శివని బతికించినందుకు నయని గాయత్రీ పాపకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక భుజంగ మణి ధగధగ మెరుస్తూ ఉండటాన్ని చూస్తారు. నయని ఆ భుజంగ మణి దగ్గరకు వెళ్తుంది. భుజంగ మణిని తీసుకొని వచ్చి విశాల్ కుడి చేతకి తాకిస్తుంది. దాంతో చేతికి ఆ కాంతి చేరి చచ్చుబడిపోయిన విశాల్ చేయి ఎప్పటిలా మారిపోతుంది. చలనం వస్తుంది. 

నయని భుజంగ మణి అక్కడ పెట్టేస్తా అని అంటే మళ్లీ వాయిస్ వినిపిస్తుంది. వచ్చే విజయ దశమిలో పంచకమణితో కలిపి భుజంగమణి ఇక్కడ పెట్టకపోతే నీ వంశం నిర్వీర్యం అవుతుందని వినిపిస్తుంది. నయని విశాల్ షాక్ అయిపోతారు. నయని సరే అంటుంది. ఇక ఉదయం ఇంట్లో అందరూ నయని, విశాల్ వాళ్ల రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇక తిరిగి రారు అని సుమన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. విక్రాంత్ తిడతాడు. అన్నావదినలు సక్రమంగా తిరిగి వస్తున్నాడని అంటాడు. గజగండ ఇంకా రాలేదు కదా అని వల్లభ అంటే మీరే గజగండని ఫాలో అవ్వ మన్నారా అని హాసిని అంటుంది. 

ఇంతలో గాయత్రీ పాప ఇంటికి వస్తుంది. హాసిని సందడి సందడి చేస్తుంది. పిల్ల వచ్చింది తల్లీ తండ్రీ రాలేదని దురంధర అంటే సుమన వాళ్లు రారేమో అని అంటుంది. ఇంతలో నయని వస్తుంది. అందరూ విశాల్ గురించి అడుగుతారు. ఇక విశాల్ హీరో హీరోలా చేతులు ఊపుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. వల్లభ, సుమన, తిలోత్తమ ముఖాలు మాడిపోతాయి. మిగతా అందరూ సంతోషిస్తారు. వచ్చింది బావ గారేనా అని సుమన అంటే నేను గజగండని అని విశాల్ అంటాడు. విక్రాంత్ జోక్ అని అంటాడు.  ఇక సుమన వాళ్లు భుజంగ మణి గురించి అడుతారు. నయని మాతో పాటే తీసుకొచ్చామని చెప్తారు. విశాల్ అందరికీ భుజంగమణిని చూపిస్తాడు. సుమన పట్టుకొని చూస్తా అంటే నయని ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాశీ పెళ్లి రచ్చ.. తగులుకున్న స్వప్న, పారులు.. నిజం తెలిస్తే ఇక అంతే!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
Nindu Manasulu Serial Today July 13th: నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
Podarillu Serial Today July 13th:కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌
పొదరిల్లు: కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget