అన్వేషించండి

Karthika Deepam 2 Serial September 26th: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాశీ పెళ్లి రచ్చ.. తగులుకున్న స్వప్న, పారులు.. నిజం తెలిస్తే ఇక అంతే!   

Karthika Deepam 2 Serial Episode కాశీ స్వప్నని తీసుకొని పారిజాతం ఇంటికి రావడం అక్కడ శ్రీధర్ రెండో పెళ్లి గురించి తెలిసిపోతుందని అందరూ టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode స్వప్న, కాశీలు కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్న జాగ్రత్తని కాశీతో కార్తీక్ చెప్తాడు. పరిస్థితులు ఎలా అయినా మారొచ్చు నమ్మి నీ దగ్గరకు వచ్చి తనని కాపాడుకో అని స్వప్న చేయి కాశీ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని నా చెల్లి జాగ్రత్త అని అంటాడు. 

కాంచన: ఓరేయ్ కార్తీక్ నిన్ను చూస్తుంటే సొంత చెల్లికి పెళ్లి చేసి అప్పగింతలు చేస్తున్నట్లు ఉందిరా.
దీప: అన్నయ్య అని పిలిచింది చెల్లే అవుతుంది కదమ్మా. 
కాంచన: కాశీ, స్వప్నలు వెళ్లిపోయిన తర్వాత.. నీకు ఓ చెల్లి ఉంటే బాగున్ను అని ఎప్పుడూ అనిపించేది ఆ అమ్మాయి ఆ లోటు తీర్చుతుందిరా.
కార్తీక్: దేవుడు నీకు తెలీకుండానే నీతో నిజాలు మాట్లాడిస్తున్నాడమ్మా. మనం అత్తింటికి వెళ్లాలి కదా పద టైం అయింది.
కాంచన: దీప నువ్వు రా ఈ రోజు కార్తీక్ పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నాం నువ్వు దగ్గరుండాలి
కార్తీక్: ఉంటుంది లేమ్మా అందరి పెళ్లి చేస్తుంది కదా నా పెళ్లి దగ్గరుండి చేస్తుంది. 
దీప: మనసులో మీ కోపం నాకు తెలుసు బాబు కానీ పెళ్లి చేయడం తప్పు వేరే దారి లేదు.

శ్రీధర్: గుడిలోనూ లేదు ఇంట్లోనూ లేదు స్వప్న ఏమైనట్లు.
కావేరి: ఒకవేళ కాశీ తీసుకెళ్లిపోయి ఉంటే.
శ్రీధర్: అందుకే కదా మనం వాడిదగ్గరకు వెళ్తున్నాం. ఇంతలో స్వప్న తండ్రికి కాల్ చేస్తుంది. నేను సాయంత్రం ఇంటికి వస్తానని నా కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని అంటుంది. ఇక సుమిత్ర కూడా శ్రీధర్‌కి కాల్ చేసి కార్తీక్‌ వాళ్ల పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నారని రమ్మని చెప్తుంది. 

ఇంట్లో అందరూ కార్తీక్ వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. దీప గుడికి తీసుకెళ్లడంతో పనిలో పనిగా ముహూర్తాలు పెట్టించాను అని సుమిత్ర అంటుంది. ఈ సారి కచ్చితంగా పెళ్లి వెంటనే జరిగిపోవాలని సుమిత్ర అంటుంది. ఇక పారిజాతం కూడా ఈ సారి ఎవరి కారణంగా పెళ్లి ఆగకూడదు ఆగదు అంతే అంటుంది. అప్పుడే నానమ్మ అంటూ కాశీ, స్వప్నని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు.

దశరథ్: రేయ్ కాశీ నీకు పెళ్లి అయిందని దాసు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదురా.
కాశీ: సారీ పెద్దనాన్న మా పెళ్లి విషయం ఎవరికీ తెలీదు. మేం ప్రేమించుకున్నాం. కొన్ని కారణాల వల్ల గుడిలో పెళ్లి చేసుకున్నాం.
శివనారాయణ: తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయ్.
పారిజాతం: మనసులో చంపేశావ్ కదరా ఇప్పుడు ఈ పిల్ల శ్రీధర్ కూతురని తెలిస్తే శివనారాయణ శివ తాండవం చేస్తాడు. జ్యోత్స్న పెళ్లి కార్తీక్‌తో జరగాలి అంటే ఈ పిల్ల నోరు విప్పేలోపే నేను వీళ్లని తిట్టి ఇక్కడి నుంచి పంపేయాలి. 
కాశీ: నాకు స్వప్నకి పెద్దవాళ్లు మీరే కదా మీ ఆశీర్వాదం కోసం వచ్చా. దిల్లూ వీళ్లే నా ఫ్యామిలీ.
పారిజాతం: ఎవర్రా నీకు ఫ్యామిలీ మీ నాన్నతో చెప్పకుండా నాతో చెప్పకుండా ఓ దిక్కూ ముక్కూ లేని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే మేం ఫ్యామిలీ అయిపోతామా. 
స్వప్న: మీరు కాశీకి నానమ్మ అయితే నాకు అమ్మమ్మ అవుతారు. చూడండి అమ్మమ్మ గారు నేను దిక్కూముక్కూ లేని దాన్ని కాదు.
పారిజాతం: నీ నంగనాచి కబుర్లు ఆపు పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు పెద్దింటికి చెందిన వాడు అని వలసి మరీ పట్టేసినట్లున్నావ్. నీకు కొంచెం అయినా బుద్ధి బుర్ర ఉందారా మీ నాన్న నేను చచ్చాం అనుకున్నావా నీ పెళ్లితో మాకు ఏం సంబంధం లేదు అనుకున్నావా. చేసిందే చెండాలం అయిన పని పైగా చూపించడానికి ఇంటికి వచ్చావ్. ఏ ధైర్యంతో ఎవరి అండదండలతో దీని మెడలో తాళి కట్టావ్రా. (కార్తీక్, దీప, కాంచన వస్తారు కాశీ వాళ్లని చూసి షాక్ అవుతారు) 
కాంచన: మీరు ఇక్కడికి వచ్చారా.
దశరథ్: ఇక్కడికి వచ్చారా అన్నావ్ ఏంటి చెల్లమ్మా అంటే వీళ్ల పెళ్లి సంగతి నీకు తెలుసా.
కాంచన: తెలుసు అన్నయ్య ఇంతకు ముందే ఆశీర్వాదం కోసం మా ఇంటికి వచ్చారు. ఈ అమ్మాయి పేరు స్వప్న కార్తీక్‌కి బాగా తెలుసు. 
కార్తీక్: మనసులో కాశీ ఇలాంటి పని చేశాడేంటి. ఇప్పుడు ఈ ఫొటో స్వప్న చూసినా మీ నాన్న ఎవరు అని స్వప్నని అడిగినా మా నాన్న రెండో పెళ్లి గురించి బయట పడుతుంది. అప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి. 
దీప: మనసులో వీళ్లు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. భగవంతుడా కార్తీక్ బాబు పెళ్లి అయిన వరకు ఈ నిజం బయట పడకుండా చూడు.  
శివనారాయణ: నువ్వు చదువుకున్నవాడివే అయినా ఇలాంటి పనులు చేయడం మీ రక్తం లోనే ఉన్నట్లుంది. ఇప్పుడు నువ్వు మా కుటుంబానికి తెలిసిన వాడివి అని చెప్పుకోవడం మాకు సిగ్గు చేటు. ముందు మీరు ఇక్కడి నుంచి బయల్దేరండి.
కార్తీక్: మనసులో దీనికే నువ్వు ఇలా అంటే స్వప్న తండ్రి ఎవరో తెలిస్తే ఏం అంటావో. 
పారిజాతం: ఓరేయ్ చేసుకున్నదే దిక్కుమాలిన పెళ్లి ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా.
కాశీ: మాదేం దిక్కుమాలిన పెళ్లి కాదు ఓ మంచి మనిషి సమక్షంలో జరిగింది. 
పారిజాతం: అహా.. ఎవరు ఆ మంచి మనిషి.
కాశీ: దీపక్క.
పారిజాతం: దీపా.
కాశీ: అవును దీపక్కే మా పెళ్లి పెద్ద తనే మా పెళ్లి చేసింది.
పారిజాతం: అమ్మనీ ఎంత పని చేశావే.
కాశీ: జరిగింది నాన్నకి చెప్పాను ఇక్కడికే రమ్మన్నాను ముందు మమల్ని ఆశీర్వదించండి నానమ్మ.  
పారిజాతం: నువ్వు ఆగరా. ఏమే దీప నీకు నేను ఏం అన్యాయం చేశానే నీలాగే నా మనవడు గతి లేని వాడు అనుకున్నావా. అదొక అక్క నువ్వొక తమ్ముడివి. దాసు వస్తాడు. రారా దాసు. రా నీ కొడుకు ఎంత పని చేశాడో చూడు. చేతికి రాఖీ కట్టగానే సొంత అక్కలా ఫీలైపోయి వీడిని కన్న నీకు చెప్పుకుండా నిన్ను కన్న నాకు చెప్పుకుండా పెళ్లి చేసింది.
కాశీ: ఇందులో అక్క తప్పేమీ లేదు.
పారిజాతం: నువ్వు ఇష్టపడితే ఈ రోడ్డున పోయిన దాన్ని నీతో పెళ్లి చేయడానికి అది ఎవరు.
స్వప్న: అమ్మమ్మ గారు నేను రోడ్డున పోయేదాన్ని కాదు నాదీ గౌరవమైన కుటుంబమే.
కార్తీక్: స్వప్న ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లండి.
స్వప్న: వెళ్తాం బాస్ కానీ నన్ను తిడితే మా అమ్మానాన్నలని తిట్టినట్లే కదా. నేను ఎవరో చెప్పే ఇక్కడి నుంచి వెళ్తా. (కార్తీక్, దీప, పారిజాతం, జ్యోత్స్న అందరూ శ్రీధర్ రెండో పెళ్లి గురించి తెలిస్తే ఏమవుతుందని టెన్షన్ పడతారు.)
శివనారాయణ: అమ్మానాన్నలకు తెలీకుండా పెళ్లి చేసుకున్నావ్ అంటే నువ్వు వాళ్లని మోసం చేసినట్లే కదా ఇంక ఆత్మాభిమానంతో ఎలా మాట్లాడుతావ్.
స్వప్న: వాళ్లకి తెలీకుండా పెళ్లి చేసుకోవచ్చు తాతగారు కానీ నాకంటూ  ఓ అడ్రస్ ఉంది కదా. సొసైటీలో గౌరవంగా బతికే అమ్మానాన్నలు ఉన్నారు. నేను కాశీని పెళ్లి చేసుకుంటే ఎవరూ లేని దాన్ని అయిపోతాను అనుకుంటారా.
శివనారాయణ: నువ్వు వీళ్లలా కాదు గట్టిగా మాట్లాడుతున్నావ్ నిన్ను చూస్తుంటే ఏదో పరువు గల కుటుంబం నుంచే వచ్చినట్లు ఉన్నావ్.
కార్తీక్: మనసులో పరువు గల కుటుంబమే తండ్రి ఎవరో తెలియనంత వరకు. 

దీప గొడవ ఆపాలని స్వప్న ఎవరో తెలీకుండా ఉండాలి అని దాసుతో స్వప్న వాళ్లని తీసుకెళ్లమని అంటుంది. పారిజాతం ఆ పెళ్లి చెల్లదని దిక్కుమాలిన దాన్ని వదిలేసి కాశీని తీసుకెళ్లు అని దాసుతో అంటుంది. దాంతో స్వప్న అమ్మమ్మ గారు ఇంకోక్క సారి దిక్కుమాలినది అంటే ఊరుకోను అని అంటుంది. ఇక శివనారాయణ నువ్వు గొప్పింటి పిల్లలా ఉన్నావ్ ఈ కాశీ మావాడు అనుకొని మీ నాన్న మాతో గొడవకు రాగలడని మీనాన్న ఎవరో చెప్పు మాట్లాడుతా అని అడుగుతాడు. శ్రీధర్ రెండో పెళ్లి గురించి తెలిసిన వారంతా చాలా టెన్షన్ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్య వర్సెస్ మహదేవయ్య.. అదిరిపోయిన మాటల యుద్ధం.. స్పీడెక్కిన స్టోరీ, ఇది కదా కావాల్సింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget