Trinayani Serial Today October 7th: 'త్రినయని' సీరియల్: విక్రాంత్ ప్రయోగం సక్సెస్.. పాపే గాయత్రీ దేవి అని నయని ఒప్పుకుంటుందా? తిలోత్తమను వాయించిన ఆత్మ!
Trinayani Today Episode గాయత్రీ పాప పడుకోగానే గాయత్రీ దేవి ఆత్మ రావడం నయని చూడటం పాపే తన అత్త అని నయని నమ్ముతుందా లేదా అని ఉత్కంఠతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today October 7th: 'త్రినయని' సీరియల్: విక్రాంత్ ప్రయోగం సక్సెస్.. పాపే గాయత్రీ దేవి అని నయని ఒప్పుకుంటుందా? తిలోత్తమను వాయించిన ఆత్మ! trinayani serial today october 7th episode written update in telugu Trinayani Serial Today October 7th: 'త్రినయని' సీరియల్: విక్రాంత్ ప్రయోగం సక్సెస్.. పాపే గాయత్రీ దేవి అని నయని ఒప్పుకుంటుందా? తిలోత్తమను వాయించిన ఆత్మ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/07/43628d8d35088bfb8b322ae2fc77c0701728263969280882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode గాయత్రీ పాపకు ఆపద రావడం నయని గ్రహించలేకపోయిందని దాని గురించి ఆలోచించండి విషయం మీకే అర్థమవుతుందని లలితాదేవి చెప్పి వెళ్లిపోతుంది. దాంతో అందరూ ఆలోచనలో పడతారు. విక్రాంత్ ఆలోచించి ఇంట్లో వాళ్లందరితో పాప పడుకుంటేనే గాయత్రీ పెద్దమ్మ వస్తుందని పాప మెలకువతో ఉంటే రావడం లేదని అంటాడు. అందుకు నయని పాప మెలకువతో ఉన్నప్పుడే గాయత్రీ దేవిని పిలిచినా ఆత్మ రాదు. దాంతో అందరూ పాపని నిద్ర పుచ్చి ఆత్మని పిలవాలి అనుకుంటారు.
విక్రాంత్ గాయత్రీ పాప హిప్నటైజ్ చేసి నిద్ర పుచ్చాలని అనుకుంటాడు. నిజం తెలిసిపోతుందని విశాల్ చాలా టెన్షన్ పడతాడు. మొత్తానికి విక్రాంత్ పాపని పడుకోపెట్టేస్తాడు. ఇక నయని గాయత్రీ దేవి ఆత్మని పిలుస్తుంది. ఇంట్లో పెద్దగా గాలి వీస్తుంది. అందరూ ఆత్మ వస్తుందని అనుకుంటారు. ఇంతలో గాయత్రీ దేవి ఆత్మ వస్తుంది. నయని షాక్ అయిపోతుంది. పాపని ఆత్మని చూసి అలా ఉండిపోతుంది. ఇక గాయత్రీ దేవి ఆత్మ తిలోత్తమ వెనకాలే ఉండి తను వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దని సైగ చేస్తుంది. దాంతో తిలోత్తమ అందరికీ అబద్దం చెప్తుంది. ఇక తిలోత్తమ వెనక్కి తిరిగి గాయత్రీ దేవిని చూసి షాక్ అయిపోతుంది. ప్రయోగాలతో నన్ను చూడాలి అనుకుంటున్నావా నా చేతిలో చచ్చావే నువ్వు అని గొంతు పట్టి నిలుమేస్తుంది. మొత్తానికి తిలోత్తమ విడిపించుకుంటుంది.
తిలోత్తమ: గాయత్రీ అక్క వచ్చిందిరా.
నయని: నాకు కనిపించడం లేదు.
తిలోత్తమ: అదేంటి నయని అలా అంటావ్.
నయని: మీ కన్న కొడుకు ప్రయోగం చేశాడని అమ్మగారు రాలేదు అంటే పరువు పోతుందని అలా అబద్ధం చెప్పకండి అత్తయ్యా.
తిలోత్తమ: లేదు వచ్చింది నయని నిజం చెప్పు.
విశాల్: నయని మా అమ్మని చూడకుండా మాట్లాడకుండా ఉండలేదమ్మా.
తిలోత్తమ: వస్తుంది నా వైపే వస్తుంది. వద్దు అక్కా నన్నేం చేయొద్దు. వద్దు అక్కా.
గాయత్రీదేవి: చెంప మీద ఒక్కటిచ్చి నా ప్రాణం తీసి వికృతంగా నవ్విన నిన్ను ఎన్నిసార్లు చంపినా తప్పు లేదు. నేరం కాదు తిలోత్తమ.
తిలోత్తమ: విశాల్ మీ అమ్మని నన్ను ఏం చేయొద్దని చెప్పు విశాల్. నన్ను కొట్టింది కదా. (తనకు కనిపించడం లేదని నయని అబద్ధం చెప్తూనే ఉంటుంది. తిలోత్తమ కావాలనే అలా చేస్తుందని అంటుంది)
మళ్లీ గాయత్రీ దేవి తిలోత్తమ చెంప పగల గొడుతుంది. అందరూ బిత్తర పోతుంది. తిలోత్తమ విశాల్‌ని బతిమాలుతుంది. తనని కొట్టి చంపేయొద్దని చెప్పమని వేడుకుంటుంది. నయని మాత్రం లేదనే చెప్తుంది. గాయత్రీ దేవి మళ్లీ కొట్టడంతో తిలోత్తమ కింద పడిపోతుంది. ఇక తిలోత్తమ నయనితో నువ్వు అయినా విశాల్ అయినా అడ్డుకుంటే వదిలేస్తుందని అంటుంది. అందరూ తిలోత్తమ పిచ్చిది అయిపోయిందని అంటారు. వల్లభ బలవంతంగా తిలోత్తమని తీసుకొని వెళ్లిపోతాడు. ఇక గాయత్రీ దేవి వెళ్లిపోతుంది. గాయత్రీ పాప లేస్తుంది. నయని పాపని చూసి ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది.
తిలోత్తమ ఆరుబయట కూర్చొని వల్లభ తో మాట్లాడుతూ ఉంటే నయని అక్కడికి వస్తుంది. తిలోత్తమ నయని చేయి పట్టుకొని నీ పిల్లల మీద భర్త మీద ఒట్టు వేసి నిజంగా గాయత్రీ దేవి రాలేదా నన్ను కొట్టలేదా అని అడుగుతుంది. దాంతో నయని దీనికి ప్రమాణాలు ఎందుకు అమ్మగారు వచ్చారని అంటుంది. తిలోత్తమ, వల్లభలు షాక్ అవుతారు. పెద్దమ్మ గారు వచ్చి మీ అమ్మని చితక్కొట్టడం నిజమే అని వల్లభకి చెప్తుంది. అయితే గాయత్రీ పాపనే గాయత్రీ అక్క అని తిలోత్తమ అంటుంది. దానికి నయని అలా అనుకోడానికి లేదు అని అంటుంది. పాపని హిప్నటైజ్ చేయడం వల్లే గాయత్రీ దేవి గారు వచ్చుంటారని అంటుంది నయని. ఇక సుమన విక్రాంత్‌తో మీ పెద్దమ్మ మీ అమ్మని కొడితే ఎందుకు బాధ పడకుండా లైట్ తీసుకుంటున్నారని అంటుంది. పెద్దమ్మ నిజంగానే వచ్చుంటే నయని చెప్పున్నని విక్రాంత్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)