Trinayani Serial Today October 28th: 'త్రినయని' సీరియల్: నయని దగ్గర బొమ్మ దొంగిలించిన తిలోత్తమ చితక్కొట్టిన గాయత్రీదేవి.. నయని, పాప ఇద్దరికీ ప్రాణ గండం!
Trinayani Today Episode నయనికి గాయత్రీ దేవి ఇచ్చిన బొమ్మని వల్లభ, తిలోత్తమ కొట్టేయడం గ్రహించిన ఆత్మ తిలోత్తమను చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని చేతిలో ఉన్న బొమ్మ వల్ల గాయత్రీ దేవి పునర్జన్మ గురించి తెలిసి నయని కన్న తొలి బిడ్డ తెలుస్తుందని దాంతో పాటే ఆ రోజే పాపకి గండం కూడా వస్తుందని గాయత్రీదేవి చెప్తుంది. అందరూ ఇలా జరగబోతుందేంటి అని బాధ పడతారు. హాసినికి గాయత్రీదేవినే గాయత్రీ పాప అని తెలియడంతో కంగారులో గాయత్రీ పాపని గుడికి తీసుకెళ్లకపోతే సరి అంటుంది. విశాల్ కంగారు పడతారు.
సుమన: అదేంటి అక్క గాయత్రీని తీసుకెళ్లకపోతే గండం రాదు అన్నట్లు చెప్తున్నావ్.
హాసిని: అలా అన్నానా ఏదో అనేసుంటా.
విశాల్: అమ్మ పేరున్న గాయత్రీ పాప రాకపోతే కీడు జరగదు అని వదిన అనుకుంటుంది.
నయని: లేదు అక్క రేపు పాపని ఈ బొమ్మని గుడికి తీసుకెళ్లమని అమ్మగారు చెప్పారు. నా బిడ్డ ఎవరో తెలుసుకునేలోపు ఎలాంటి ఆపద వచ్చినా అడ్డుకుంటాను.
సుమన: తల్లీబిడ్డలకు ఇద్దరికీ బాలేదు అనుకుంటా.
తిలోత్తమ: వల్లభతో ఒంటరిగా.. ఆ బొమ్మని మనం వాడుకుంటే ఎలా ఉంటుంది వల్లభ. ఇన్ని రోజులు గండం వస్తుందని విశాల్‌ని కూడా కంగారు పెట్టిన నయని రేపు కన్నబిడ్డని చూస్తాను అనే కంగారులో చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గుర్తించలేని స్థితిలో ఉంటుంది.
వల్లభ: కన్న బిడ్డని చూస్తే ప్రపంచాన్నే మర్చిపోతుంది కదా మమ్మీ
తిలోత్తమ: మనం నయనిని ఈ ప్రపంచమే మర్చిపోయేలా చేయాలి. ఈ సారి నయనితో పాటు తన కన్న తొలి బిడ్డ గాయత్రీఅక్కయ్య కూడా పరలోకానికి వెళ్లిపోవాలి. నయని రేపు గుడికి తీసుకెళ్లేది బొమ్మ కాదు వాళ్ల చావు. ఆ బొమ్మతోనే అమ్మ అని పిలవబోయే కొత్త పాపని నయనిని ఇద్దరినీ బూడిద చేయబోతున్నాను. నువ్వు అయితే ఆ బొమ్మని రాత్రి ఎత్తుకొని నా దగ్గరకు తీసుకురా.
వల్లభ: అలాగే మమ్మీ బొమ్మతోనే మనం మృత్యువు తీసుకురానున్నాం అంతే కదా.
సుమన విక్రాంత్‌కి చాటుగా తీసుకొచ్చి గాయత్రీ దేవి ఇచ్చిన బొమ్మని జాగ్రత్తగా చూద్దామని అందులో వజ్రాలు వైడూర్యాలు ఏమైనా ఉంటాయని అనుమానంగా ఉందని అంటుంది. విలువైనవి ఉంటే మనకే కలిసి వస్తుందని అంటుంది. విక్రాంత్ సుమనను తిట్టి రేపు గాయత్రీపెద్దమ్మ పసి బిడ్డగా కనిపిస్తుంది. చిన్న పిల్లలకు చాక్లెటో, బొమ్మ ఇస్తారు అంతే అంటుంది. దానికి సుమన అలా కాదు మా అక్క, పెద్దత్తయ్య ఏం చేసినా దాని వెనక ఏదో లాజిక్ ఉందని అంటుంది. విక్రాంత్ మనసులో ఇది ఏదో వాగుతుంది అనుకుంటే ఈ రోజు మాత్రం కరెక్ట్‌గానే మాట్లాడుతుంది సుమన చెప్పింది ఆలోచించాల్సిందే అని అనుకుంటాడు.
రాత్రి వల్లభ బొమ్మ నొక్కేసి డ్యాన్స్‌లు వేస్తాడు. తిలోత్తమ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో పవర్ పోతుంది. తిలోత్తమ వెనక గాయత్రీ దేవి నిల్చొని ఉంటుంది. ఇక తిలోత్తమ ఆ బొమ్మ తీసుకొని స్టెప్పులు వేస్తుంది. ఇంతలో గాయత్రీ దేవికి చూసి షాక్ అయిపోతుంది. నేను నా కోడలికి ఇచ్చిన బొమ్మ ఎలా తీసుకున్నావ్ నువ్వు అని గాయత్రీదేవి తిలోత్తమని చితక్కొడుతుంది. ఇక వల్లభ భయంతో దాక్కుంటాడు. ఇంతలో కరెంట్ వస్తుంది. అందరూ వస్తారు హాల్లోకి తిలోత్తమ వాళ్లతో గాయత్రీ అక్కయ్య నన్ను ఉతికేస్తుందని చెప్తుంది. ఏమైందని నయని అంటే నీకు ఇచ్చిన బొమ్మ వల్లభ తీసుకొచ్చానని చెప్తుంది. గాయత్రీ దేవి తిలోత్తమ దగ్గరకు పిలుస్తుంది. నయని వెళ్లమని అంటే విశాల్ వద్దని అమ్మ కోపంగా ఉందని చంపేస్తుందని అంటుంది. ఇక నయని ఆ బొమ్మని తీసుకుంటుంది. బొమ్మలో ఏమైనా క్లూ ఉంటుందేమో అని తీసుకున్నానని తిలోత్తమ చెప్తుంది. విశాల్ కూడా తిలోత్తమని వారిస్తాడు.
గాయత్రీదేవి: నయని పాప నేను నీ దగ్గర ఉన్నప్పుడు ప్రమాదం ఏమైనా జరిగితే అది నీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
తిలోత్తమ: అంటే రేపు నీకు నయనికి ఇద్దరికీ ప్రాణ గండం ఉందా అక్క.
విశాల్: ఏంటమ్మా నువ్వు అనేది.
విక్రాంత్: బ్రో రేపు పెద్దమ్మ మనకు పసి బిడ్డగా కనిపించబోయినప్పుడు ఏదో కీడు జరగబోతుందని అర్థమతుంది. పాపని కాపాడబోయి నయని వదిన కూడా ప్రమాదంలో పడొచ్చేమో కదా ఇలా కూడా ఆలోచించాలి.
నయని: ఆపది ఏ రూపంలో వస్తుందో నాకు తెలిస్తే బాగుండేది.
విక్రాంత్: రేపు ఏదో జరగబోతుంది
తిలోత్తమ: ఏది జరగాలి అని ఉంటే అది జరుగుతుంది.
గాయత్రీదేవి: నయని జాగ్రత్త రేపు నువ్వు ఆపద చూడలేవు కానీ నా పునర్జన్మ రూపం చూడగలవు.
నయని: నేను నా బిడ్డని చూడగలిగితే చాలు తర్వాత తనని కాపాడుకోవడానికి నా ప్రాణాలు అయినా పణంగా పెడతాను.
రాత్రి విశాల్ బొమ్మ పట్టుకొని బాల్కానీలో బాధగా ఉంటాడు. నయని అక్కడికి వస్తుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా మన పెద్ద కూతుర్ని చూస్తానా అని తొందరగా ఉంది కదా అని అంటుంది. దానికి విశాల్ అవును అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌కి ఆశలు ఉంటాయ్ నువ్వు భార్యగా ఉండాల్సిందే: అనసూయ మాటలకు ఆలోచనలో దీప