అన్వేషించండి

Trinayani Serial Today October 25th: 'త్రినయని' సీరియల్: నా కన్న కూతురి జాడ చెప్పే మీరు వెళ్లాలి లేదంటే నా మీద ఒట్టు: గాయత్రీదేవితో నయని

Trinayani Today Episode నయని గాయత్రీదేవి ఆత్మతో తన తొలిబిడ్డ జాడ చెప్పమని ఒక రోజు గడువు ఇవ్వడం గాయత్రీ దేవి చెప్తా అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి వల్లభ గొంతు పట్టేస్తుంది. వల్లభ విలవిల్లాడిపోతాడు. వల్లభని వదిలేయమని చెప్పమని నయనితో తిలోత్తమ అంటుంది. దానికి నయని అమ్మగారు ఏం చేసినా అందులో న్యాయమే ఉంటుందని అంటుంది. అన్నయ్యని నలిపేయడంతో న్యాయం ఉందా అని విశాల్ అడుగుతాడు. 

తిలోత్తమ: చెప్పు అక్క నా కొడుకు ప్రాణం ఎందుకు తీయాలి అనుకుంటున్నావ్.
గాయత్రీదేవి: నా కోడలు నయని ప్రాణం పోతుందా పోదా అని పరీక్షలు ప్రయోగాలు చేయాలి అనుకున్న నీకు సహాయపడ్డ నీ కొడుకు ప్రాణాలు తీస్తే తప్పే కాదు తిలోత్తమ.
విశాల్: అమ్మ చెప్పమ్మా అమ్మ చెప్పిన కారణం ఏంటి.
గాయత్రీదేవి: నీ కొడుకు విషం తీసుకొచ్చాడని విశాల్‌తో చెప్పు తిలోత్తమ.
నయని: ఆ మాట చెప్పాక తిలోత్తమ అత్తయ్యకి ప్రాణ గండం అని తనకి తెలుసు అమ్మగారు.  
హాసిని: ఏ మాట పెద్దయ్య ఏమాట అన్నారో చిన్నత్తయ్యకి చెప్పాలి.
తిలోత్తమ: అంతా నీ వల్లనే నువ్వు విష ప్రయోగం చేయడంతో నా కోడలిని బతక నివ్వరా అని నా కొడుకు ప్రాణాలు తీస్తానంటోందే అక్క.
గాయత్రీదేవి: అబద్దాలు ఆడకు తిలోత్తమ. 
నయని: మనసులో నా ప్రాణం తీయాలని విష ప్రయోగం చేశారని విశాల్ బాబుకి తెలిస్తే చంపేస్తారని హాసిని అక్క మీదకు నెట్టారా అత్తయ్య.
వల్లభ: మమ్మీ నువ్వు చేసిన పనికి పెద్దమ్మ నన్ను చంపేస్తుంది మమ్మీ.
హాసిని: పెద్దత్తయ్యా నేను విష ప్రయోగం చేసింది కేవలం నయని చెల్లికి గండం వస్తుందో లేదో తెలుసుకోవడానికి అందులో నేను నెగ్గాను కూడా.
వల్లభ: నన్ను వదిలేయమని చెప్పమనండి.
విశాల్: అమ్మ అన్నయ్య ప్రాణాలు పోతాయమ్మా.
గాయత్రీదేవి: హాసిని చేసిన ప్రయోగం కాదు విశాల్ వీళ్లద్దరూ విష ప్రయోగం చేసి నయని ప్రాణాలు తీసి ఆ నేరాన్ని అమాయకురాలు అయిన హాసిని మీద వేయాలని చూశారా.
నయని: అలాగా అమ్మగారు. 
తిలోత్తమ: చెప్పకు నయని నీకు దండం పెడతాను. నా బుజ్జివి కదూ నా బంగారు కోడలివి కదూ చెప్పకు నయని ప్లీజ్.
సుమన: ఏం చెప్పొద్దు అంటున్నారు ఎందుకు మా అక్కని బతిమాలు తున్నారు.
విశాల్: నయని ఏంటి అది.
తిలోత్తమ: నయని చెప్పకు నయని
గాయత్రీదేవి: చూడు నేను చెప్పినా వీళ్లు ఎవరికీ వినపడు అని తిలోత్తమ అతి తెలివి. నా కొడుకుకి ఇంకా వీళ్ల గురించి తెలియకుండా దాయడం అనవసరం. చెప్పు నయని విశాల్ చెప్పమన్నాడు కదా.
నయని: అమ్మగారు  మీ కొడుకుకి నిజం చెప్పమని మీరు చెప్తున్నారు కానీ నా కూతురిగా పుట్టిన మిమల్ని ఎక్కడున్నారో చెప్పమని అంటే చెప్పడం లేదు మీకు ఓ లెక్క నాకు ఓ లెక్కనా. 
గాయత్రీదేవి: వల్లభని వదిలేస్తుంది. 
తిలోత్తమ: మనసులో శభాష్ నయని కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా అడిగావు.
నయని: చెప్పండి అమ్మగారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పే మీరు ఇక్కడి నుంచి వెళ్లాలి.
గాయత్రీదేవి: చెప్తా నయని
నయని: ఎప్పుడు అమ్మగారు నేను చచ్చిన తర్వాతా.
గాయత్రీదేవి: నయని ఇంకెప్పుడూ అలాంటి మాటలు మాట్లాడకు.
నయని: నాకు ప్రాణ గండం ఉందని అందరికీ తెలుసమ్మగారు కానీ నేను చనిపోయేలోపు నా కన్న కూతుర్ని చూసుకోవాలి అని ఎంత మధన పడుతున్నానో మీకు తెలుసా. ఈ రోజు మీరు నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే.
గాయత్రీదేవి: ఇలా ఇరకాటంలో పెట్టావేంటి నయని.
తిలోత్తమ: వేరే దారి లేదు అక్క నువ్వు చెప్పాల్సిందే లేదంటే నయని చావుకి కారణం నువ్వే అనుకుంటారు.
గాయత్రీదేవి: చెప్తా నయని కానీ ఇవాళే అన్నావు కాబట్టి నాకు ఇంకా టైం ఉంది.

ఈ రోజు కచ్చితంగా చెప్తానని మాటిచ్చి గాయత్రీ అక్క వెళ్లారని తిలోత్తమ ఇంట్లో వాళ్లకి చెప్తుంది. బయటకు వెళ్లి వల్లభ అమ్మయ్యా అనుకుంటాడు. తిలోత్తమ వెళ్లి మనకు మంచే జరిగిందని అంటుంది. పసిపిల్లగా ఉన్న గాయత్రీదేవి ఎక్కడుండో తెలిస్తే చంపేయడం తేలికని అంటుంది తిలోత్తమ. మరోవైపు నయనిలా ఉంటే త్రినేత్రి పొలంలో పనులు చేస్తుంటుంది. త్రినేత్రికి తన మామ గొడుగు పడతాడు. ఇక ఆయన భార్య క్యారేజ్‌ తీసుకొని వచ్చి డబ్బు కోసం నా మొగుడు ఎంత పాట్లు పడుతున్నాడో అని తిట్టుకుంటుంది. త్రినేత్రి సంపాదన అత్త వైకుంటం కూడా నొక్కేస్తుంటుంది. త్రినేత్రి, మామ భోజనానికి కూర్చొంటారు. ఇంతలో బామ్మ కూడా వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప చెల్లి, రాజు తమ్ముడి లవ్‌ట్రాక్‌ని జీవన్‌ వాడుకుంటాడా.. పోలీస్‌ గెటప్‌తో గ్యాంగ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 :
"పుష్ప 2" రిజల్ట్​పై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్... మెగా విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 :
"పుష్ప 2" రిజల్ట్​పై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్... మెగా విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Embed widget