Trinayani Serial Today November 3rd: 'త్రినయని' సీరియల్: త్రినేత్రిని కాటేయడానికి వచ్చిన పాము.. నయనికి పిచ్చి అంటోన్న ఫ్యామిలీ!
Trinayani Today Episode త్రినేత్రిని కాటేయించి చంపడానికి ఆమె మేనత్తమామలు పాముని తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని లంగావోణి వేసుకొని వస్తుంది. పాము కాటేయనున్నట్లు కనిపించిందని ఇలా లాంగావోణిలో వస్తే పాము వస్తుందేమో అని ఇలా వచ్చానని నయని అంటుంది. నిజంగా పాము వస్తే నయనికి వచ్చిన కల నిజంగా నిజం అని తిలోత్తమ అంటుంది. అలా పాము రాకపోతే నాన్న పులిలా ఉన్నా లేనట్లు నయని ఊహించుకొని చెప్తుందని తిలోత్తమ అంటుంది.
సుమన: ఎవరైనా నవ్వుతారు అక్క ఇలా పాము వస్తుందని లంగా వోణి పులి వస్తుందని పట్టు చీర ఎవరైనా కట్టుకుంటారా.
విశాల్: నయని నేను చెప్పాను కదా అయినా నువ్వు వినలేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకొని ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెడుతున్నావేమో ఆలోచించు.
విక్రాంత్: బ్రో మీరు ఎవరూ వదిన మాటలు నమ్మడం లేదని నాకు అర్థమైంది కానీ నేను నమ్ముతా.
తిలోత్తమ: ముందు రానివ్వండి పాముని అప్పటికీ రాకపోతే నయనిని ఒక మంచి సైకాలజిస్ట్‌కి చూపిస్తే మంచిదని నా నిర్ణయం.
విశాల్: అదేంటి అమ్మ అలా అంటావ్.
తిలోత్తమను వల్లభ లాక్కొని బయటకు వెళ్తాడు. హాసిని వాళ్లిద్దరూ చూడకుండా చిన్న పిల్లలా బంగురుతూ వచ్చి మధ్యలో నిల్చొంటుంది. కావాలనే వాళ్లతో బుస్ బుస్ అని కామెడీ చేస్తుంది. రెండు తగిలించాలని ఇద్దరూ కొడతారు. కావాలనే హాసిని తిలోత్తమని హగ్ చేసుకొని మీద కాలు వేసి హగ్ మీ హగ్ మీ అని తిలోత్తమని ఇరిటేట్ చేస్తుంది. తిల్లూ ఆంటీ చుమ్మా ఇవ్వు అని అంటుంది. దానికి హాసిని నేను ఇలా చేస్తేనే మీకు చిరాకు వేస్తే మరి నయనిని చెల్లిని పిచ్చాస్పత్రిలో చూపించుకోమంటారా అని తిట్టి వెళ్తుంది.
త్రినేత్రి అడవిలో అమ్మవారి దగ్గరకు వచ్చి చలాకీగా అమ్మ నీకు నేను అందంగా రెడీ చేయడం నువ్వు మళ్లీ ఇలా తయారవ్వడం అని చెప్పి అమ్మవారికి నీరు పోసి కడిగి చక్కగా రెడీ చేస్తుంది. త్రినేత్రి మేనత్త మామలు పాముల వాడిని తీసుకొచ్చి పాము వదలమని చెప్తారు. త్రినేత్రి వైపు పాముని సర్పయ్య వదులుతాడు. పాము త్రినేత్రి దగ్గరకు వెళ్లి బుస కొడుతుంది. త్రినేత్రి చూసి పాము కాటుకి త్రినేత్రి చనిపోతుంది అని రాసి పెట్టి ఉంటే నన్ను కాటేసి వెళ్లిపో అని చేయి చూపిస్తుంది. దాంతో పాము కాటేయకుండా వెళ్లిపోతుంది. త్రినేత్రి మేనత్త మేనమామలు షాక్ అయిపోయి పాముల వాడిని తీసుకెళ్లిపోతాడు.
మరోవైపు సుమన విక్రాంత్ దగ్గరకు వెళ్లి ఇరిటేట్ చేస్తుంది. నీ పని నువ్వు చేసుకో అని విక్రాంత్ అంటే మంచి సలహా ఇవ్వాలని వచ్చానని చెప్పి మా అక్కకు రాబోయే ఆపద చిన్నప్పటి నుంచి కనిపిస్తుంది దాంతో అలా బ్రైన్ పోయిందేమో అంటుంది. సుమన మాటలకు విక్రాంత్ విసిగిపోయి వదినకు ఓ మాట చెప్తాను వదినను పిచ్చి అన్నవాళ్లకి పిచ్చి అని వాళ్లని ఫారెన్ ట్రీట్మెంట్‌కి తీసుకెళ్తా డబ్బు కట్టండని చెప్పమని అంటానని అంటాడు. సలహా ఇవ్వడానికి వచ్చిన నన్ను ఇలా అన్నారు అంటే మీరు మహానుభావుడు అని సుమన వెళ్లిపోతుంది. ఇక హాల్‌లో సుమన, తిలోత్తమ, వల్లభలు కూర్చొని ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి చేసిన పనికి కుమిలి కుమిలి ఏడ్చిన కుటుంబం.. హారతి, దీపక్‌లకు బాబు!