అన్వేషించండి

Trinayani Serial Today May 28th : 'త్రినయని' సీరియల్ : ఉలూచితో పాటు తిలోత్తమ కూడా మారిపోయిందా.. గురువుగారు తెచ్చిన బిడ్డ నిజంగా ఉలూచినేనా, నమ్మేసిన సుమన!

Trinayani Serial Today May 28th Episode : సర్పదీవికి వెళ్లిన ఉలూచి మారిపోయిందని మరో బిడ్డను తీసుకొని వచ్చి గురువుగారు సుమనకు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode : గురువుగారు సర్పదీవి నుంచి ఓ చేత గాయత్రీ పాపను మరోచేతిలో ఉలూచిని ఎత్తుకొని తీసుకొని వస్తారు. గాయత్రీని నయని తీసుకోగా ఉలూచిని తీసుకోవడానికి వచ్చిన సుమన పాపని చూసి కెవ్వుమని అరుస్తుంది. ఏమైంది అందరూ అడగగా ఆ పాప ఉలూచి కాదు అని మరెవరో అని అంటుంది. అందరూ ఆ పాపని చూసి షాక్ అవుతారు. 

విశాల్: అవును కదా స్వామి ఈ చంటి పాప ఎవరు.

గురువుగారు: ఉలూచినే విశాలా. 

నయని: ఉలూచి అలా ఉండదు కదా స్వామి.

విక్రాంత్: రెండు రోజుల్లో మార్పురాదు కదా.

విశాలాక్షి: సర్ప దీవికి వెళ్తే రెండు గడియల్లో మార్పు వస్తుంది. 

వల్లభ: అంటే ఉలూచి రూపం మారింది అనా.

విశాలాక్షి: అవును..

హాసిని: మరి అలా అయితే గాయత్రీ పాప రూపం ఎందుకు మారలేదు. 

విశాలాక్షి: గాయత్రీ రూపం మారితే తాను పెరిగి పెద్దదైతే కన్న తల్లిదండ్రులు ఆశించిన రూపంలో లేదని మనోవేదనకు గురవుతారు. 

దురంధర: హాలో విశాలాక్షి గాయత్రీ తల్లిదండ్రులు ఎప్పుడో కన్ను మూశారు. 

విశాలాక్షి: కళ్లు మూసుకుంది మీరు. సరిగ్గా చూడటం లేదు. 

సుమన: ఇలాగే మాట్లాడుతుంది పిన్ని మా అక్క ఇచ్చిన అలుసు ఇది.

గురువుగారు: సుమన నీ బిడ్డ సర్పదీవి నుంచి జాగ్రత్తగా తిరిగి వచ్చినందుకు ఎత్తుకొని ముద్దాడకుండా జాప్యం చేస్తావెందుకు. 

సుమన: ఛీ.. ఛీ.. ఎవరో కన్న బిడ్డను నా బిడ్డ అని తీసుకొచ్చి దాని బాగోగులు చూడమని నాకు ఇస్తే చూసే ఖర్మ నాకు ఏం పట్టలేదు. 

డమ్మక్క: కన్నతల్లివి నువ్వు కంగారు పడకుండా బిడ్డని తాకి చూడు నీ కన్న పేగు కదులుతుంది. 

సుమన: ఏంటి కదిలేది నా తలకాయ్.. ఇప్పటికే ఆ పిల్లని చూసి నా కళ్లు తిరుగుతున్నాయి.

హాసిని: చిట్టీ నాకు ఎందుకో ఆ పిల్లే మన ఉలూచి అనిపిస్తుంది. 

సుమన: నువ్వు చెప్తే నేను నమ్మాలా.

విశాలాక్షి: నమ్మాలి సుమన నీ వేలిలోని అగ్గి కింద పడి ఆరిపోయింది చూడు. 

గురువుగారు: ఉలూచి వచ్చాకే ఇలా జరిగింది.

నయని: సుమన గురువుగారు చెప్పాకనమ్మకపోతే ఎలా.

వల్లభ: మీ గాయత్రీ మారిపోయి ఉంటే అప్పుడు మీ పరిస్థితి వేరేలా ఉండేది. 

విశాలాక్షి: గాయత్రీ పాప తప్ప సర్పదీవికి వెళ్లిన ఉలూచితో పాటు తిలోత్తమ అమ్మ కూడా మారిపోయింది. మళ్లీ అందరూ నోరెళ్ల బెడతాడు.  

వల్లభ: అయ్యో అలా ఎలా అవుతుంది. 

విశాల్: అన్నయ్య అలా కాదు రూపం మారినా అమ్మ అయితే ప్రాణాలతో ఉంది అనే కదా. 

నయని: అవును బావగారు మృత్యు గండం తొలగిపోయిందని ఆనందించాలి. 

సుమన: అసలు ఇలా రూపాలు మారిపోవడానికి కారణం ఈ విశాలాక్షినే. తనే కదా సర్ప దీవికి పంపించింది. 

విశాలాక్షి: సుమన బిడ్డను తీసుకో.

సుమన: నేను తీసుకోను. మీరు ఎన్ని చెప్పినా ఈ పిల్ల నా బిడ్డ కాదు.

విశాలాక్షి: నువ్వు తీసుకోకపోతే వచ్చే పౌర్ణమికి ఉలూచి సర్పదీవికి వెళ్లిపోతుంది. ఇక ఎన్నటికీ తిరిగిరాదు. 

నయని: సుమన..

సుమన: ఈ పిల్లని ఇప్పుడే తీసుకెళ్లిపోండి నా ఉలూచిని సాయంత్రం లోపు తీసుకొని రండి లేదంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.

విశాల్: విక్రాంత్ నీ కూతుర్ని నువ్వు అయినా తీసుకోరా.

విశాలాక్షి: రాబోయే పరీక్షకు అందరూ సిద్ధంగా ఉండండి. 

విక్రాంత్ సుమన దగ్గరకు వెళ్లి ఉలూచి ఉలూచి అని గోల చేసి ఇప్పుడు గురువుగారు పాపని తెస్తే ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. దాంతో సుమన తను తన బిడ్డ కాదు అని వాదిస్తుంది. నువ్వు నమ్మకపోతే నీ సొంతం అనుకున్న బిడ్డ నీకు కాకుండా పోతుంది అని అంటాడు. తీసుకొచ్చిన బిడ్డతో పాటు తన తల్లి కూడా మారిపోతుందని గురువుగారు చెప్పినా నువ్వు ఇంకా నమ్మలేదు అంటే నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు అని విక్రాంత్ సుమనతో అంటాడు. 

విశాల్: స్వామి ఇప్పటి వరకు సుమనను నమ్మించే ప్రయత్నం చేశాం కానీ ఇప్పుడు తను మనం ఆడింది నాటకం అని గుర్తుపట్టేస్తుంది. 

గురువుగారు: విశాలాక్షి అమ్మవారి మీద భారం వేయడం తప్పించి మనం చేయగలిగేది ఏముంటుంది విశాలా.

హాసిని: స్వామిజి ఎత్తుకొచ్చిన పాపని ఎత్తుకొని.. విశాల్ సూర్యాస్తమయం అవుతుంది ఇప్పుడు ఎలా.

విశాల్: అదే వదినా స్వామి వారిని అడుగుతున్నాను. ఈ పాప ఉలూచి కాదు కాబట్టి సాయంత్రం అయినా పాముగా మారలేదు. 

పావనా: నిజమే ఇప్పుడు సుమనమ్మకు అనుమానం వచ్చేస్తుంది. 

విశాలాక్షి: అప్పుడు గురువుగారిని తప్పు పడతారు.

పావనా: అయితే మన నాటకం తెలిసిపోతుంది.

విశాలాక్షి: ఇది నాటకం కాదు గురువుగారు మీకు చేసిన సాయం.

విశాల్: కానీ ఏం చేస్తాం పాప ఏడుపునకు అందరూ వచ్చేస్తారు. సుమన కూడా వచ్చేస్తుంది. తన కూతుర్ని ఏం చేశారు అని ప్రశ్నిస్తుంది. 

విశాలాక్షి: కంగారు పడకండి పసి బిడ్డను దాచిపెట్టండి.

అందరూ హాల్‌లోకి వస్తారు. సుమన పాపని మాత్రం తాను తల్లిని అని అంటే ఒప్పుకోదు. విశాలాక్షి, డమ్మక్కలను సుమన తిడుతుంది. ఇక సుమన షాపింగ్‌కు వెళ్తా అని అంటుంది. ఇంతలో దురంధర చీకటి పడితే షాపింగ్‌కు ఏంటే అని అంటుంది. ఇంతలో సుమన చీకటి అని అందర్ని చూస్తుంది. చీకటి పడితే ఉలూచి పాము పిల్లగా మారాలి కదా అని అంటుంది.  

సుమన: పాముగా మారితే పసి బిడ్డగా ఎలా ఏడుస్తుంది. అంటే ఆ పిల్ల నా బిడ్డ కాదు అని అర్థమైంది కదా. 

నయని: అవును సాయంత్రం అయితే ఉలూచి పాము పిల్లగా మారుతుంది. ఆ టైంలో ఏడుపు, నవ్వు, బాధ ఇలాంటి లక్షణాలు అసాధ్యం కదా. అసలు పాప ఎక్కడ ఉంది. 

సుమన: ఉలూచి అయితే ఏడ్వదు అక్క. నా బిడ్డను ఏం చేశారో మర్యాదగా చెప్పండి.

విశాలాక్షి: ఉలూచి అక్కడ ఏడుస్తుంటే నా బిడ్డ కావాలి అని ఎందుకు అరుస్తున్నావు సుమన.

సుమన ఇళ్లంతా వెతుకుతుంది. అయితే సోఫా వెనక పాముని చూసి సుమన అవాక్కై నిల్చుండి పోతుంది. ఇక విక్రాంత్ వెళ్లి సోఫా జరుపుతాడు. పాముని చూసి అందరూ షాక్ అయిపోతారు. విశాల్, పావనా, హాసినిలు కూడా నోరెళ్లబెడతారు. సుమన కోసం పసి బిడ్డ తల్లి కావాలి అని ఏడుస్తుందని ఇలా చూసిన తర్వాత కూడా తను నీ బిడ్డ కాదు అని అంటావా అని నయని అడుగుతుంది. దీంతో సుమన ఏడుస్తూ లేదు అని అంటుంది. తను నా కూతురే ఉలూచినే అని ఏడుస్తుంది. పొద్దున్నుంచి తనని పట్టించుకోలేదు. ఎవరో అనుకున్నాను అని ఎమోషనల్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘భారతీయుడు’ రీ రిలీజ్ - పాత మూవీకి కొత్త ట్రైలర్, విడుదల ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget