అన్వేషించండి

Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!

గత రెండేళ్లుగా లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా కనిపించడం లేదు. మైదానంలో గంభీరంగా వినిపించే ఆయన స్వరం ఎందుకు వినిపించడం లేదనే అభిమానుల ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కామెంటరీకి రాజీనామా చేశారు.
  • తనపై వివక్ష, వేధింపులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
  • వర్ణ వివక్ష, ముంబై మాఫియా ప్రభావంపై ఆయన స్పందించారు.
  • ప్రస్తుతం గోల్ఫ్, ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతంగా గడుపుతున్నారు.

Laxman Sivaramakrishnan: భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ లెగ్‌ స్పిన్నర్ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి కామెంటరీ ప్యానెల్‌కు ఆయన అధికారికంగా రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ వీడ్కోలు కేవలం వయసు రీత్యా తీసుకున్న నిర్ణయం కాదని, ఆవేదన, వివక్ష, వేధింపులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. 

రెండేళ్ల నిశ్శబ్దం ఆపై విస్పోటనం

గత రెండేళ్లుగా లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా కనిపించడం లేదు. మైదానంలో గంభీరంగా వినిపించే ఆయన స్వరం ఎందుకు వినిపించడం లేదనే అభిమానుల ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. " నేను గత రెండేళ్లుగా కామెంటరీకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అధికారికంగా బీసీసీఐ కామెంటరీకి రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నాను." అని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ రెండేళ్ల విరామం ఆయనలో ఒక కొత్త ఆలోచనా దృక్పథాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను భరించడం ఇక తన వల్ల కాదని ఆయన చెప్పుకొచ్చారు. 

ముంబై మాఫియా వేధింపులు

లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ చేసిన ఆరోపణల్లో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ముంబై మాఫియా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. క్రికెట్‌ పాలక వర్గాల్లో లేదా విశ్లేషణ విభాగాల్లో ఒక వర్గం ఆధిపత్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. "ముంబై మాఫియా సన్ను తీవ్రంగా వేధించింది". అని ఆయన నేరుగా చెప్పడం చర్చనీయాంశమైంది.  


Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!

నల్లగా ఉంటే కామెంటరీకి పనికి రారా

కామెంటరీ రంగంలో వర్ణ వివక్ష ఉందని లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ పోస్టు పెట్టారు. భారత్ వంటి దేశంలో ఇక్కడ మెజార్టీ ప్రజల గోధుమ లేదా నలుపు రంగులో ఉన్నప్పటికీ గ్లామర్‌ పేరిట వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. " నేను వర్ణ వివక్షకు గురయ్యాను, నల్లగా ఉంటే కామెంటరీకి పనికి రారా" అని అంటూ ఆయన సంధించిన ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. 



Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!

క్రికెట్ ప్రపంచం నుంచి విరామం తీసుకున్న ఈ రెండేళ్ల కాలాన్ని లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ తన మనసుకు నచ్చిన పనుల ద్వారా ప్రశాంతతను వెతుకున్నట్టు తెలిపారు. రెండేళ్లుగా గోల్ఫ్‌ మీద దృష్టి పెట్టాను. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తన కుటుంబాన్ని నాణ్యమైన సమయాన్ని కేటాయించగలుగుతున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్‌ పరుగు పందెంలో కోల్పోయిన ఆత్మీయతను ఇప్పుడు కుటుంబంతో కలిసి అనుభవిస్తున్నట్టు చెప్పారు.   

Frequently Asked Questions

లక్ష్మణ్ శివరామకృష్ణన్ క్రికెట్ వ్యాఖ్యానానికి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు?

ఆవేదన, వివక్ష, మరియు వేధింపుల కారణంగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐ వ్యాఖ్యాన ప్యానెల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.

లక్ష్మణ్ శివరామకృష్ణన్ భారత క్రికెట్ పాలక వర్గాలపై ఎలాంటి ఆరోపణలు చేశారు?

ముంబై మాఫియా వంటి ఒక వర్గం క్రికెట్ పాలక వర్గాలలో మరియు విశ్లేషణ విభాగాలలో ఆధిపత్యం చెలాయిస్తోందని ఆయన ఆరోపించారు.

వ్యాఖ్యాన రంగంలో వివక్ష ఉందని లక్ష్మణ్ శివరామకృష్ణన్ పేర్కొన్నారా?

అవును, ముఖ్యంగా రంగు ఆధారంగా వివక్ష ఉందని, నల్లగా ఉన్నవారు వ్యాఖ్యానానికి పనికిరారా అని ఆయన ప్రశ్నించారు.

గత రెండేళ్లుగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఏమి చేస్తున్నారు?

ఆయన గోల్ఫ్ పై దృష్టి పెట్టారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, మరియు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
2027 ODI World Cup Venues: 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
Sachin Guard Secret: సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!
సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!
Shami Career End..!.: షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget